తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ktr Petition In Supreme Court : కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ కాలేదు - బీఆర్ఎస్ లీగల్ టీమ్ ఏం చెప్పిందంటే…

KTR Petition in Supreme Court : కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ కాలేదు - బీఆర్ఎస్ లీగల్ టీమ్ ఏం చెప్పిందంటే…

15 January 2025, 16:39 IST

google News
    • KTR petition in Formula-E race case: కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ కాలేదని బీఆర్ఎస్ లీగల్ టీమ్ తెలిపింది. లీగల్ ఒపీనియన్ ప్రకారం విత్‌డ్రా చేసుకున్నట్లు ప్రకటించింది. ఏ కోర్టులో అయినా అప్పీల్ చేసుకునే అవకాశం ఉందిని స్పష్టం చేసింది. కాంగ్రెస్ నేతల ప్రచారాన్ని ఖండించింది. 
కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ కాలేదు - బీఆర్ఎస్ లీగల్ టీమ్
కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ కాలేదు - బీఆర్ఎస్ లీగల్ టీమ్

కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ కాలేదు - బీఆర్ఎస్ లీగల్ టీమ్

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ క్వాష్ పిటిషన్ పై కొందరూ దుష్ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అబద్ధపు ప్రచారాలను నమ్మవద్దని కోరింది. మరోవైపు బీఆర్ఎస్ లీగల్ టీమ్ కేటీఆర్ పిటిషన్ పై పలు వివరాలను వెల్లడించింది.

డిస్మిస్ కాలేదు - మోహిత్ రావు, న్యాయవాది

కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ కాలేదని కేటీఆర్ తరపు న్యాయవాది మోహిత్ రావు తెలిపారు. లీగల్ ఒపీనియన్ ప్రకారం కేసును విత్ డ్రా చేసుకున్నామని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఏ కోర్టులోనైనా ఆప్పిల్ చేసుకునేందుకు తమకు అవకాశం ఉందని స్పష్టం చేశారు.

“ఫార్ములా ఈ కార్ కేసులో సుప్రీం కోర్టులో కేటీఆర్ వేసిన పిటిషన్ పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం విచారణ జరిపింది. కేటీఆర్ క్యాష్ పిటిషన్ పై ఆర్యమా సుందరం, సిద్ధార్థ దవేలు వాదనలు వినిపించారు. ఈ కేసులో సెక్షన్ 13.1A పీసీ యాక్ట్ వర్తించదని వాదనలు వినిపించాం” అని మోహిత్ రావు పేర్కొన్నారు.

హాస్యాస్పదం - సోమ భరత్, బీఆర్ఎస్ లీగల్ టీమ్

మరోవైపు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, న్యాయవాది సోమ భరత్ మీడియాతో మాట్లాడారు. “ఈ స్టేజ్‌లో మేము ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాకపోవచ్చని సుప్రీం ధర్మాసనం చెప్పింది. అప్పుడు కేటీఆర్ సూచనల మేరకు.. ఆయన తరఫు న్యాయవాది దవే ‘క్వాష్ పిటిషన్‌’ను ఉపసంహరించుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలు కూడా.. సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌లను విత్‌డ్రా చేసుకున్న సందర్భం ఉంది. కేటీఆర్ విత్‌డ్రా చేసుకుంటేనేమో పిటిషన్ కొట్టేసినట్టు ప్రచారం చేస్తున్నారు. వాళ్లు అలా చేస్తేనేమో.. సుప్రీం వారి పిటిషన్లను కొట్టేయలేదన్నట్టు అర్థసత్యాలు, అబద్ధాలతో ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. సుప్రీంకోర్టులో కేసును ఉప సంహరించుకుంటే ఎదో కేసును కొట్టేసినట్టు కాంగ్రెసోళ్లు, వాళ్ళ బాకాలు అతి చేయడం హాస్యాస్పదం” అంటూ కొట్టిపారేశారు.

మరోవైపు సుప్రీంకోర్టు క్వాష్ పిటిషన్‌ విత్ డ్రా చేసుకోవటంతో.. రేపు (గురువారం జనవరి 16న) ఈడీ అధికారుల విచారణకు కేటీఆర్‌ హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు కేటీఆర్‌ను ఈడీ అధికారులు విచారించనున్నారు. ఫార్ములా ఈ-రేసు కేసులో విచారించనున్నారు. అయితే.. అడ్వకేట్‌తో హాజరవుతానని కేటీఆర్‌ తమకు సమచారం ఇవ్వలేదని ఈడీ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

జనవరి 9న ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీఆర్‌‌ను ఏసీబీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. దాదాపు 6.30 గంటల పాటు ప్రశ్నించారు. ఈ కేసు దర్యాప్తు అధికారి డీఎస్పీ మజీద్ ఖాన్‌.. కేటీఆర్‌ను ప్రశ్నలు అడిగారు. ఈ విచారణను జాయింట్‌ డైరెక్టర్‌ రితిరాజ్‌ పర్యవేక్షించారు. విచారణను వేరే గది నుంచి చూసేందుకు కేటీఆర్‌ న్యాయవాది రామచంద్రరావుకు అనుమతి ఇచ్చారు. ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరుకావాలని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.

తదుపరి వ్యాసం