తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Aarogyasri Card : ప్రతి ఒక్కరికీ డిజిటల్ ఆరోగ్యశ్రీ కార్డు, ఇలా పొందండి?

Aarogyasri Card : ప్రతి ఒక్కరికీ డిజిటల్ ఆరోగ్యశ్రీ కార్డు, ఇలా పొందండి?

HT Telugu Desk HT Telugu

16 September 2023, 15:12 IST

google News
    • Aarogyasri Card : పేదలందరికీ ఉచిత వైద్యం అందించాలని లక్ష్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్య శ్రీ లేదా ఆయుష్మాన్ పథకాలను అమలుచేస్తున్నారు. అర్హులైన వారికి ఆరోగ్యశ్రీ కార్డులను అందిస్తున్నారు.
ఆరోగ్య శ్రీ కార్డు
ఆరోగ్య శ్రీ కార్డు

ఆరోగ్య శ్రీ కార్డు

Aarogyasri Card : పేదలకు ఉచిత వైద్యం అందించేందుకు ఏర్పాటు చేసిన ఆరోగ్య శ్రీ పథకం కార్డులు ప్రస్తుతం డిజిటల్ కార్డులుగా మెరుగుదిద్దుకున్నాయి. గతంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి సభ్యులందరికీ ఒక ఆరోగ్యశ్రీ కార్డు ఉండేది. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆరోగ్యశ్రీ కార్డు లేదా ఆయుష్మాన్ కార్డును ఒక్కొక్క వ్యక్తికి డిజిటల్ కార్డుగా అందిస్తోంది. ఈ క్రమంలో కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ ఒక్కొక్క డిజిటల్ కార్డు మీ సేవ, సీఎస్సీ సెంటర్, ఆన్లైన్ సెంటర్ ద్వారా పొందేందుకు వీలు కల్పించింది. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారు మీ సేవ కేంద్రాలకు వెళ్లి ఈ కేవైసీ చేసుకొని కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

ఉచితంగా వైద్యసేవలు

ఈ ఆయుష్మాన్ కార్డు ద్వారా ఐదు లక్షల వరకు కార్పొరేట్ వైద్య సేవలు ఉచితంగా పొందవచ్చని అధికారులు తెలిపారు. ఆరోగ్యశ్రీ లేదా ఆయుష్మాన్ కార్డుపై 1500 రకాల రోగాలు, శస్త్ర చికిత్సలు, సుమారు 900 రకాల వైద్య సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరూ మీసేవ, సీఎస్సీ, ఆన్ లైన్ సెంటర్ల ద్వారా ఈకేవైసీ చేసుకొని ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డు పొందవచ్చని వైద్యాధికారులు తెలిపారు.

రిపోర్టింగ్ : కామోజీ వేణుగోపాల్, ఆదిలాబాద్

తదుపరి వ్యాసం