Yuzvendra Chahal: తనపై వస్తున్న ఊహాగానాలకు చాహల్ క్లారిటీ.. ఏమన్నాడంటే?
18 August 2022, 21:46 IST
- తన పెళ్లిపై వస్తున్న ఊహాగానాలపై టీమిండియా ఆటగాడు యజువేంద్ర చాహల్ స్పందించాడు. దయ చేసిన అసత్య ప్రచారాలను వ్యాప్తి చేయవద్దని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు.
చాహల్-ధనశ్రీ
సోషల్ మీడియా వచ్చిన తర్వాత సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలు చాలా సులభంగా బయటకు వస్తున్నాయి. వారు వాడే ట్విటర్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల ద్వారా పర్సనల్ విషయాలను సులభంగా తెలుసుకుంటున్నారు. దీంతో వారి సంబంధాలు, ప్రేమ, పెళ్లి లాంటి విషయాలు బట్టబయలవుతున్నాయి. తాజాగా టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్ కూడా ఇలాంటి సమస్యే ఎదుర్కొన్నాడు. చాహల్, అతడి భార్య ధనశ్రీ వర్మపై నెట్టింట కొన్ని ఊహాగానాలు హల్చల్ చేశాయి. దీంతో తమ రిలేషన్‌షిప్‌పై తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దంటూ చాహల్.. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లను కోరాడు.
"మా బంధానికి సంబంధించిన ఎలాంటి పుకార్లను నమ్మవద్దని మీ అందరికీ వినయపూర్వకంగా విన్నవించుకుంటున్నాను. దయ ఉంచి ఈ వార్తలకు ముగింపు పలకండి. మీ అందరి జీవితాల్లో ప్రేమ, వెలుగులు చిగురించాలని కోరుకుంటున్నాను" అని యజువేంద్ర చాహల్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నాడు.
ఆగస్టు 16న చాహల్.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో న్యూ లైఫ్ లోడింగ్ అంటూ స్టోరీ పోస్ట్ చేశాడు. దీంతో చాహల్, ధనశ్రీ తమ జీవితంలో ఓ బిడ్డను స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారంటూ అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే కొంతమంది మాత్రం ధనశ్రీ తన పేరు నుంచి చాహల్ పేరును తొలగించిందని ఎత్తి చూపుతున్నారు. దీంతో వీరిద్దరూ విడిపోతున్నారనే ఊహాగానాలు వ్యాప్తి చెందాయి. తాజాగా ఈ రూమర్లన్నింటీ క్లారిటీ ఇచ్చాడు చాహల్. అయితే చాహల్ ఈ విషయంపై స్పష్టతనిచ్చినప్పటికీ.. ధనశ్రీ మాత్రం ఇంకా స్పందించలేదు.
ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా చాహల్.. తన భార్య ధనశ్రీతో కలిసి ఆనందకరమైన సమయాన్ని గడిపాడు. ఇద్దరూ కలిసి డెర్బీలో వెకేషన్‌కు వెళ్లి అక్కడ దిగిన ఫొటోలను షేర్ చేశారు. ఆ సిరీస్ తర్వాత వెస్టిండీస్ పర్యటనలో భాగంగా యూఎస్ఏకు భారత జట్టుతో కలిసి చాహల్ ప్రయాణం చేశాడు. ఈ నెలాఖరున ఆసియా కప్ కోసం యూఏఈ వెళ్లనున్నాడు.
టాపిక్