తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  148 ఏళ్లలో ఫస్ట్ టైమ్.. వింబుల్డన్ విన్నర్ సిన్నర్.. అతని మాజీ ప్రేయసి ఎవరో తెలుసా? గెలిచిన ప్రైజ్ మనీ ఇదే

148 ఏళ్లలో ఫస్ట్ టైమ్.. వింబుల్డన్ విన్నర్ సిన్నర్.. అతని మాజీ ప్రేయసి ఎవరో తెలుసా? గెలిచిన ప్రైజ్ మనీ ఇదే

Published Jul 14, 2025 09:14 AM IST

google News
  • ఇటలీ టెన్నిస్ ఆటగాడు జానిక్ సిన్నర్ హిస్టరీ క్రియేట్ చేశాడు. 148 ఏళ్ల టెన్నిస్ చరిత్రలో వింబుల్డన్ టైటిల్ గెలిచిన తొలి ఇటలీ ఆటగాడిగా నిలిచాడు. దీంతో సిన్నర్ పేరు మార్మోగుతోంది. అతని మాజీ ప్రేయసిపై చర్చ జోరందుకుంది. 
యుఎస్ ఓపెన్ ఫైనల్ తర్వాత ప్రేయసిని ముద్దాడుతున్న సిన్నర్

యుఎస్ ఓపెన్ ఫైనల్ తర్వాత ప్రేయసిని ముద్దాడుతున్న సిన్నర్

జానిక్ సిన్నర్ ప్రపంచంలోనే అత్యుత్తమ టెన్నిస్ ఆటగాడిగా గుర్తింపు పొందిన మొదటి ఇటాలియన్. ఇంతేకాదు, ఆదివారం (జూలై 14) వింబుల్డన్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకోవడం ద్వారా ఈ ఆటగాడు మరో ఘనతను సాధించాడు. 148 ఏళ్ల హిస్టరీలో వింబుల్డన్ టైటిల్ గెలిచిన తొలి ఇటలీ ఆటగాడిగా నిలిచాడు. సిన్నర్ ఫైనల్లో అల్కరాజ్ ను ఓడించాడు. ఈ విజయంతో సిన్నర్ లవర్ పై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.


ప్రేయసి ఎవరంటే?

సిన్నర్ ఇంకా వివాహం చేసుకోలేదు. అతనికి ఇప్పుడు లవర్ లేదు. అయితే మాజీ ప్రేయసి అన్నా కాలిన్స్కాయ తో సిన్నర్ గతంలో రిలేషన్ షిప్ లో ఉన్నాడు. అన్నా కాలిన్స్కాయ కూడా టెన్నిస్ ప్లేయరే. 2024లో యు.ఎస్. ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో టేలర్ ఫ్రిట్జ్‌పై సిన్నర్ విజయం సాధించిన తరువాత అన్నా కాలిన్స్కాయను సినర్ స్టాండ్స్ లోనే ముద్దు పెట్టుకున్నాడు. ఈ ఫొటో తెగ వైరల్ గా మారింది.

డేటింగ్ లో లేను

ఇక ఇప్పుడు సిన్నర్ ఎవరితో డేటింగ్ లో లేను అని అనౌన్స్ చేశాడు. మోడల్ లారా లీటోతో సంబంధంలో ఉన్నాడని లేదా గతంలో మరో మోడల్ మేరియా బ్రాసినిని డేట్ చేశాడని వచ్చిన వార్తలను తిరస్కరించాడు. 2024 మేలో సిన్నర్ రష్యన్ ప్రొఫెషనల్ టెన్నిస్ క్రీడాకారిణి కాలిన్స్కాయతో తన సంబంధాన్ని అధికారికంగా ప్రకటించాడని పీపుల్ పేర్కొంది. 2024 సెప్టెంబర్‌లో యు.ఎస్. ఓపెన్ ముద్దు సీన్ జరిగింది. నివేదికల ప్రకారం వారు వింబుల్డన్‌లో కూడా కలిసి కనిపించారు.

ప్రైజ్ మనీ

వింబుల్డన్ విన్నర్ గా నిలిచిన సిన్నర్ ప్రైజ్ మనీ గురించి కూడా చర్చ సాగుతోంది. సిన్నర్ £3,000,000 (సుమారు $ 4.05 మిలియన్ డాలర్లు) సంపాదించాడు. ఇది 2024 ప్రైజ్ మనీ £2.7 మిలియన్లతో పోలిస్తే 11% అధికం. వింబుల్డన్ రన్నరప్ కార్లోస్ అల్కరాజ్ 1,520,000 పౌండ్లు (సుమారు 2.05 మిలియన్ డాలర్లు) అందుకున్నాడు. ఇది 2024లోని 1.4 మిలియన్ పౌండ్లతో పోలిస్తే 8% అధికం.

విన్నర్లు వీళ్లే

వింబుల్డన్ 2025 మహిళల సింగిల్స్ టైటిల్ ను ఇగా స్వియాటెక్ గెలుచుకుంది. ఈ పోలండ్ భామ తొలిసారి వింబుల్డన్ లో విజేతగా నిలిచింది. పురుషుల సింగిల్స్ టైటిల్ ను జానిక్ సిన్నర్ దక్కించుకున్నాడు. అతనికి కూడా ఇదే తొలి వింబుల్డన్ ట్రోఫీ. ఈ సారి వింబుల్డన్ సింగిల్స్ టైటిళ్లను కొత్త ఛాంపియన్లు అందుకున్నారు. పురుషుల సింగిల్స్ లో జకోవిచ్, అల్కరాజ్ కు చుక్కెదురైంది.