తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl Auction | మురిసిన శ్రేయస్‌.. హర్షల్‌, రబాడాకు ఫుల్‌ డిమాండ్‌

IPL Auction | మురిసిన శ్రేయస్‌.. హర్షల్‌, రబాడాకు ఫుల్‌ డిమాండ్‌

Hari Prasad S HT Telugu

12 February 2022, 15:13 IST

google News
    • ఐపీఎల్‌ వేలంలో ఊహించినట్లే శ్రేయస్‌ అయ్యర్‌ మంచి ధర పలికాడు. ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా నిలుస్తాడన్న అంచనాలు తప్పినా.. రూ12.25 కోట్ల ధర పలికి ఫర్వాలేదనిపించాడు.
టీమిండియా ప్లేయర్ శ్రేయస్ అయ్యర్
టీమిండియా ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ (Reuters )

టీమిండియా ప్లేయర్ శ్రేయస్ అయ్యర్

బెంగళూరు: టీమిండియా బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌.. ఐపీఎల్‌ మెగా వేలంలో భారీ ధర పలికాడు. తొలిరోజు మధ్యాహ్నం వరకూ అత్యధిక ధరకు అమ్ముడైన ప్లేయర్‌ అతనే. శ్రేయస్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రూ.12.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అతని తర్వాత గత సీజన్‌లో దుమ్మురేపిన పేస్‌ బౌలర్‌ హర్షల్‌ పటేల్‌ కూడా రూ.10.75 కోట్లు పలకడం విశేషం. ఇక టీమిండియా మాజీ బ్యాటర్‌ సురేశ్‌ రైనా, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ షకీబుల్‌ హసన్‌లకు మాత్రం నిరాశ తప్పలేదు. తొలి రౌండ్‌లో ఫ్రాంఛైజీలు వీళ్లను కొనుగోలు చేయలేదు. ఇప్పటి వరకూ అమ్ముడైన ప్లేయర్స్‌ ఎవరు? వాళ్ల ధర ఎంత అన్నది ఇప్పుడు చూద్దాం.

- శ్రేయస్‌ అయ్యర్‌ - రూ.12.25 కోట్లు (కోల్‌కతా నైట్‌రైడర్స్‌)

- శిఖర్‌ ధావన్‌ - రూ.8.25 కోట్లు (పంజాబ్‌ కింగ్స్‌)

- రవిచంద్రన్‌ అశ్విన్‌ - రూ.5 కోట్లు (రాజస్థాన్‌ రాయల్స్‌)

- ప్యాట్ కమిన్స్‌ - రూ.7.25 కోట్లు (కోల్‌కతా నైట్‌రైడర్స్‌)

- కగిసో రబాడా - రూ.9.25 కోట్లు (పంజాబ్‌ కింగ్స్‌)

- ట్రెంట్ బౌల్ట్‌ - రూ.8 కోట్లు (రాజస్థాన్‌ రాయల్స్‌)

- మహ్మద్‌ షమి - రూ.6.25 కోట్లు (గుజరాత్‌ టైటన్స్‌)

- ఫాఫ్‌ డుప్లెస్సి - రూ. 7 కోట్లు (రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు)

- క్వింటన్‌ డీకాక్‌ - రూ.6.75 కోట్లు (లక్నో సూపర్‌జెయింట్స్‌)

- డేవిడ్‌ వార్నర్‌ - రూ.6.25 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్‌)

- మనీష్‌ పాండే - రూ.4.6 కోట్లు (లక్నో సూపర్‌జెయింట్స్‌)

- షిమ్రన్‌ హెట్‌మెయర్‌ - రూ.8.5 కోట్లు (రాజస్థాన్‌ రాయల్స్‌)

- రాబిన్‌ ఉతప్ప (చెన్నై), జేసన్‌ రాయ్‌(గుజరాత్‌) - రూ.2 కోట్లు

- దేవదత్‌ పడిక్కల్‌ - రూ.7.75 కోట్లు (రాజస్థాన్‌ రాయల్స్‌)

- డ్వేన్‌ బ్రేవో - రూ.4.4 కోట్లు (చెన్నై సూపర్‌ కింగ్స్‌)

- నితీష్‌ రాణా - రూ.8 కోట్లు (కోల్‌కతా నైట్‌రైడర్స్‌)

- జేసన్‌ హోల్డర్‌ - రూ.8.75 కోట్లు (లక్నో సూపర్‌జెయింట్స్‌)

- హర్షల్‌ పటేల్‌ - రూ.10.75 కోట్లు (రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు)

- దీపక్‌ హుడా - రూ.5.75 కోట్లు (లక్నో సూపర్‌ జెయింట్స్‌)

తదుపరి వ్యాసం