తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Kl Rahul: జాతీయ గీతం సమయంలో రాహుల్‌ చేసిన పనికి ఫ్యాన్స్‌ ఫిదా.. వీడియో

KL Rahul: జాతీయ గీతం సమయంలో రాహుల్‌ చేసిన పనికి ఫ్యాన్స్‌ ఫిదా.. వీడియో

Hari Prasad S HT Telugu

19 August 2022, 9:55 IST

google News
    • KL Rahul: టీమిండియా కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ గురువారం (ఆగస్ట్‌ 18) తొలి విజయాన్ని అందుకున్నాడు. అయితే ఈ విజయం కంటే ఎక్కువగా మ్యాచ్ ఆరంభానికి ముందు జాతీయ గీతం సమయంలో అతడు చేసిన పని ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది.
KL Rahul
KL Rahul (Twitter)

KL Rahul

హరారె: ఇండియన్‌ టీమ్‌కు కేఎల్‌ రాహుల్‌ గతంలో నాలుగు మ్యాచ్‌లకు కెప్టెన్‌గా ఉండగా.. అన్నింట్లోనూ టీమ్‌ ఓడిపోయింది. ఈ చెత్త రికార్డును చెరిపేయాలన్న టార్గెట్‌తో జింబాబ్వేతో తొలి వన్డే బరిలోకి దిగిన అతడు.. మొత్తానికి అనుకున్నది సాధించాడు. తొలి విజయాన్ని అది కూడా 10 వికెట్లతో ఘనంగా అందుకున్నాడు. 190 రన్స్‌ టార్గెట్‌ను ఇండియా కేవలం 30.5 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా చేజ్‌ చేసింది. గిల్‌ (82), ధావన్‌ (81) పోటీ పడి రన్స్‌ చేశారు.

ఈ విజయంతో కెప్టెన్‌గా రాహుల్‌ ఊపిరి పీల్చుకున్నాడు. గాయం తర్వాత టీమ్‌లోకి తిరిగొచ్చిన రాహుల్‌ తన బ్యాటింగ్‌ సామర్థ్యాన్ని ప్రదర్శించే అవకాశం అయితే ఈ మ్యాచ్‌లో దక్కలేదు. మంచి ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్‌ గిల్‌ కోసం రాహుల్ తన ఓపెనింగ్‌ స్థానాన్ని వదులుకున్నాడు. ఇదే అభినందించదగిన విషయం అంటే.. మ్యాచ్‌కు ముందు జాతీయ గీతం పాడే సమయంలో రాహుల్ చేసిన మరో పనికి ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు.

భారత జాతీయ గీతం రాబోతోంది అని ప్రకటించగానే తన నోట్లో ఉన్న చూయింగ్‌ గమ్‌ను రాహుల్‌ బయటకు తీసి పడేశాడు. నేషనల్ ఆంథెమ్‌కు అతడు ఇచ్చిన గౌరవం అభిమానులకు బాగా నచ్చింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను ఫ్యాన్స్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. నిన్ను చూసి గర్వపడుతున్నాం అంటూ కొందరు కామెంట్స్‌ చేశారు.

ఇక ఈసారి ఐపీఎల్‌ తర్వాత రాహుల్‌ టీమిండియాకు తొలి మ్యాచ్‌ ఆడాడు. గాయం కారణంగా అతడు సుమారు రెండు నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అతనితోపాటు జింబాబ్వేతో తొలి వన్డేకు ఆరు నెలల తర్వాత టీమిండియాలోకి వచ్చాడు బౌలర్‌ దీపక్‌ చహర్‌. మూడు వికెట్లతో ఈ కమ్‌బ్యాక్‌ హీరో సక్సెసైనా.. రాహుల్‌కు మాత్రం ఆ ఛాన్స్ దక్కలేదు.

తదుపరి వ్యాసం