తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Kl Rahul Movie : కేఎల్ రాహుల్ జీవితం ఆధారంగా సినిమా!

KL Rahul Movie : కేఎల్ రాహుల్ జీవితం ఆధారంగా సినిమా!

Anand Sai HT Telugu

26 June 2023, 10:02 IST

google News
    • KL Rahul Movie : క్రికెట్ నేపథ్యంలో ఓ సినిమా రాబోతోంది. ఈ చిత్రానికి కిరికి ఇట్ 11 అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రం KL రాహుల్ జీవితం ఆధారంగా రూపొందిస్తున్నారు.
కేఎల్ రాహుల్
కేఎల్ రాహుల్ (ANI)

కేఎల్ రాహుల్

బాలీవుడ్‌తో పోలిస్తే, దక్షిణాదిలో ముఖ్యంగా కన్నడ సినిమాలో క్రీడలు, క్రీడాకారుల గురించిన సినిమాలు తక్కువ తెరపైకి వచ్చాయి. ప్రతిసారీ, సినిమా క్లైమాక్స్‌లో గేమ్‌లను వాడుకుంటారు. అయితే సినిమా మొత్తం ఒకే గేమ్‌కి సంబంధించి తీసినవి చాలా అరుదు. అయితే ఇప్పుడు కన్నడలో క్రికెట్ నేపథ్యంలో ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా క్రికెట్‌(Cricket)తో పాటు కామెడీపై కూడా దృష్టి పెడుతుంది.

కేజీఎఫ్(KGF), కాంతార వంటి భారీ చిత్రాలను అందించిన హోంబలే ఫిల్మ్స్ కు చెందిన సోదర సంస్థ కేఆర్‌జీ స్టూడియోస్ క్రికెట్ నేపథ్యంలో ఓ సినిమా చేయనుంది. ఇప్పటికే ఆర్‌సీబీ(RCB) క్రికెట్ టీమ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్న హోంబలే ఫిల్మ్స్ ఇప్పుడు క్రికెట్ నేపథ్యంలో సినిమా తీయడానికి ఆసక్తి చూపింది. ఈ చిత్రానికి కిరిక్ ఇట్ 11 అని పేరు పెట్టారు. ఈ చిత్రం భారత క్రికెటర్ కేఎల్ రాహుల్(KL Rahul) జీవితం ఆధారంగా రూపొందిస్తున్నారని తెలుస్తోంది.

కర్నాటక గర్వించదగ్గ ఆటగాడు కేఎల్ రాహుల్ జీవితాన్ని కిరిక్ ఇట్ సినిమా ద్వారా తెరపైకి తీసుకొస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా కేఎల్ రాహుల్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోందని కేఎల్ రాహుల్ కానీ, చిత్ర బృందం కానీ అధికారికంగా చెప్పలేదు. కిరిక్ ఇట్ మూవీ డానిష్ సేథ్, నవీన్ శంకర్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. బెంగుళూరుకు చెందిన మనోజ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

డానిష్ సేథ్ ఇప్పటికే కొన్ని కన్నడ సినిమాల్లో నటించాడు. ఎన్నో ఏళ్లుగా ఆర్‌సీబీ టీమ్‌తో కలిసి ప్రయాణించిన డానిష్.. క్రికెట్, క్రికెటర్ల గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. కిరిక్ ఇట్ సినిమా కామెడీతో పాటు క్రికెట్ కథ కూడా చెబుతుందని అంటున్నారు. కేఎల్ రాహుల్ జీవితంలోని కొన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయని తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం కేఎల్ రాహుల్.. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు. పిట్ నెస్ పై ఫోకస్ చేస్తున్నాడు. గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న రాహుల్ ఆసియా కప్(Asia Cup) నాటికి పూర్తి ఫిట్ నెస్ తిరిగి వచ్చే అవకాశం లేదు. ఎన్సీఏలో ఫిట్ నెస్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఐపీఎల్ 16వ ఎడిషన్ సందర్భంగా.. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో రాహుల్ గాయపడ్డాడు. ఆ తర్వాత మే ప్రారంభంలో అతడికి శస్త్ర చికిత్స జరిగింది.

టాపిక్

తదుపరి వ్యాసం