తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl Auction | ఐపీఎల్‌ వేలంలో ఇషాన్‌ కిషన్‌కు రికార్డు ధర

IPL Auction | ఐపీఎల్‌ వేలంలో ఇషాన్‌ కిషన్‌కు రికార్డు ధర

Hari Prasad S HT Telugu

12 February 2022, 17:13 IST

google News
    • ఊహించినట్లే యువ వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ ఐపీఎల్‌ వేలంలో రికార్డు ధర దక్కించుకున్నాడు. అతన్ని రూ.15.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్‌.
ఇషాన్ కిషన్
ఇషాన్ కిషన్ (ANI)

ఇషాన్ కిషన్

బెంగళూరు: ఐపీఎల్‌ వేలం వస్తోందంటే అందరి చూపు శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌లపైనే ఉంది. ఈ ఇద్దరూ వేలంలో భారీ ధర అందుకోబోతున్నారని ఎక్స్‌పర్ట్స్‌ అంచనా వేశారు. ఇప్పుడు అందుకు తగినట్లే యువ వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ కోసం ముంబై ఇండియన్స్‌ భారీగా ఖర్చు చేసింది. 

వేలంలో రూ.15.25 కోట్లకు అతన్ని కొనుగోలు చేసింది. అతన్ని దక్కించుకోవడానికి పంజాబ్‌ కింగ్స్‌తోపాటు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కూడా చాలానే ప్రయత్నించాయి. చివరికి ముంబై టీమే బిడ్‌ గెలిచింది. గతంలో ఎప్పుడూ ఓ ప్లేయర్‌ కోసం రూ.10 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు చేయని ముంబై ఇండియన్స్‌.. తొలిసారి ఇషాన్‌ కోసం ఆ రికార్డు బ్రేక్‌ చేసింది.

పూరన్‌కు రూ.10.75 కోట్లు

ఇక వెస్టిండీస్‌ వికెట్‌ కీపర్‌ నికొలస్‌ పూరన్‌పై కాసుల వర్షం కురిపించింది సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌. అతన్ని ఏకంగా రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది. అటు శ్రీలంక బౌలర్‌ వానిందు హసరంగను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కూడా రూ.10.75 కోట్లు పెట్టి కొనడం విశేషం. మరోవైపు స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌కు రూ.8.75 కోట్లు చెల్లించనుంది సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌. అటు ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యా రూ.8.25 కోట్ల ధర పలికాడు. 

అతన్ని లక్నో సూపర్‌ జెయింట్స్‌ టీమ్‌ కొనుగోలు చేసింది. మరో ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ను రూ.6.5 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్‌, అంబటి రాయుడును రూ.6.75 కోట్లకు చెన్నై సూపర్‌ కింగ్స్‌, జానీ బెయిర్‌స్టోను రూ.6.75 కోట్లకు పంజాబ్‌ కింగ్స్‌, దినేష్‌ కార్తీక్‌ను రూ.5.5 కోట్లకు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కొనుగోలు చేశాయి.

తదుపరి వ్యాసం