తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Racing: ఆఫ్‍రోడ్ రేసింగ్ వరల్డ్‌కప్‍లో చరిత్ర సృష్టించిన భారత టీమ్ ‘ఇండీ’

Racing: ఆఫ్‍రోడ్ రేసింగ్ వరల్డ్‌కప్‍లో చరిత్ర సృష్టించిన భారత టీమ్ ‘ఇండీ’

24 September 2024, 18:18 IST

google News
    • Racing: ఎఫ్ఐఎం ఈ-ఎక్స్‌ప్లోరర్ ప్రపంచకప్‍లో భారత టీమ్ ఇండీ రేసింగ్ చరిత్ర సృష్టించింది. అద్భుత ప్రదర్శన కనబరిచింది. మూడో స్థానంలో నిలిచింది. ఆ వివరాలివే..
Racing: ఆఫ్‍రోడ్ రేసింగ్ వరల్డ్‌కప్‍లో చరిత్ర సృష్టించిన భారత టీమ్ ‘ఇండీ’
Racing: ఆఫ్‍రోడ్ రేసింగ్ వరల్డ్‌కప్‍లో చరిత్ర సృష్టించిన భారత టీమ్ ‘ఇండీ’

Racing: ఆఫ్‍రోడ్ రేసింగ్ వరల్డ్‌కప్‍లో చరిత్ర సృష్టించిన భారత టీమ్ ‘ఇండీ’

ఎలక్ట్రిక్ ఆఫ్ రోడ్ రేస్ అయిన ఎఫ్‍ఐఎం ఈ-ఎక్స్‌ప్లోరర్ ప్రపంచకప్‍లో ఇండీ రేసింగ్ జట్టు అదరగొట్టింది. స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన ఈ వరల్డ్ కప్‍లో మూడో స్థానంలో నిలిచింది. దీంతో ఈ ప్రపంచ ఈవెంట్‍లో మూడో ప్లేస్ దక్కించుకున్న తొలి భారతీయ టీమ్‍గా ఇండీ రేసింగ్ చరిత్ర సృష్టించింది. పాల్గొన్న తొలి సీజన్‍లోనే రాణించింది.

పాయింట్స్ ఇలా..

ఈ ప్రపంచకప్ ఈవెంట్ నాలుగు రౌండ్లలో ఇండీ రేసింగ్ జట్టు 479 పాయింట్లు సాధించి మూడో స్థానాన్ని దక్కించుకుంది. బోనెల్ టీమ్ 498, హోండా రేసింగ్ 490 పాయింట్లతో తొలి రెండు స్థానాలను సొంతం చేసుకున్నాయి. ఇండి రేసింగ్ మూడో ప్లేస్‍లో నిలిచింది.

ఇండీ రేసింగ్ టీమ్‍లో మహిళా రైడర్ సాండ్రా గోమెజ్ 271 పాయింట్లతో సత్తాచాటారు. పురుషుల విభాగంలో స్పెన్సర్ విల్టన్ 162, రునార్ సుధామన్ 46 పాయింట్లు చేశారు. మొత్తంగా ఈ ఇండియన్ టీమ్ మూడో స్థానం దక్కించుకుంది. హిస్టరీ క్రియేట్ చేసింది.

సూపర్ క్రాస్‍లు ఎక్కువగా..

ఈ టోర్నీలో రాణించడంపై ఇండీ రేసర్ సాండ్రా గోమేజ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ట్రాక్‍లో అనుకున్న దాని కంటే ఎక్కువ సూపర్ క్రాస్‍లో ఉన్నాయని అన్నారు. “ఈ టోర్నీలో నా టోర్నీ ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నా. గతంలో నేను చేసిన రేస్‍ల కంటే ఈ ట్రాక్‍లో చాలా సూపర్ క్రాస్‍లు ఉన్నాయి. నేను పూర్తిస్థాయిలో శ్రమించాల్సి వచ్చింది. రెండు రేస్‍ల్లో మంచి ఆరంభం లభించింది. రెండు రేస్‍ల్లో వరుసగా ఫస్ట్, సెకండ్‍లో నిలిచా” అని గోమేజ్ తెలిపారు.

తాను పడిన శ్రమ ఫలించిందని ఇండీ రేసింగ్ టీమ్ రేసర్ స్పెన్సర్ విల్టన్ అన్నారు. ఈ లాంగ్ సీజన్‍లో తమకు చాలా సవాళ్లు ఎదురయ్యాయని, తాము పడిన కష్టాలకు ఇప్పుడు ప్రతిఫలం వచ్చిందని అన్నారు. ఇప్పుడు వచ్చిన మూడో స్థానంలో సంతోషంగా ఉన్నామని చెప్పారు. అయితే, వచ్చే ఏడాది టోర్నీలో తాము ఫస్ట్ ప్లేస్‍లో నిలిచేందుకు లక్ష్యంగా పెట్టుకుంటామని విల్టన్ చెప్పారు.

తమ టీమ్ ఇండియా తరఫున పతకం సాధించడం సంతోషంగా ఉందని ఇండీ రేసింగ్ జట్టు ఓనర్ కంకణాల అభిషేక్ రెడ్డి తెలిపారు. భారత్‍లోని ఆఫ్ రోడ్ రేసర్లకు ఇది స్ఫూర్తిగా ఉంటుందని అన్నారు.

ఇండీ రేసింగ్ టీమ్ ఈ సీజన్‍లో రాణిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒసాకాలో జరిగిన రేస్‍లో సాండ్రా తొలి స్థానంలో నిలిచి విన్నర్ కాగా.. స్పెన్సెర్ నాలుగో ప్లేస్‍లో నిలిచారు. ఒస్లో రేస్‍లో సాండ్రా రెండో స్థానం దక్కించుకున్నారు. ఇప్పుడు.. ఎఫ్ఐఎం ఈ-ఎక్స్‌ప్లోరర్ ప్రపంచకప్‍లో ఈ టీమ్ మూడో ప్లేస్ సొంతం చేసుకొని అదరగొట్టింది.

తదుపరి వ్యాసం