తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  వింబుల్డన్ లో పోలండ్ భామ హిస్టరీ.. తొలిసారి టైటిల్ గెలిచిన ఇగా స్వియాటెక్.. ప్రైజ్ మనీ తెలిస్తే షాక్ అవాల్సిందే!

వింబుల్డన్ లో పోలండ్ భామ హిస్టరీ.. తొలిసారి టైటిల్ గెలిచిన ఇగా స్వియాటెక్.. ప్రైజ్ మనీ తెలిస్తే షాక్ అవాల్సిందే!

Published Jul 12, 2025 10:26 PM IST

google News
  • ఇగా స్వియాటెక్ అదరగొట్టింది. ఈ పోలండ్ భామ వింబుల్డన్ టైటిల్ ను తొలిసారి సొంతం చేసుకుంది. శనివారం ఫైనల్లో అమండా అనిసిమోవాను డబుల్ బాగెల్ తో ఓడించింది. విన్నర్ గా నిలిచిన ఇగా అందుకున్న ప్రైజ్ మనీ ఎంతంటే? 
ఇగా స్వియాటెక్ (REUTERS)

ఇగా స్వియాటెక్

వింబుల్డన్ 2025 మహిళల సింగిల్స్ టైటిల్ ను ఇగా స్వియాటెక్ సొంతం చేసుకుంది. శనివారం (జూలై 12) లండన్ లో జరిగిన ఫైనల్లో ఈ పోలండ్ అమ్మాయి స్వియాటెక్ 6-0, 6-0 తేడాతో అమెరికాకు చెందిన అమండా అనిసిమోవాపై ఘన విజయం సాధించింది. ఆరంభం నుంచి చివరి వరకు పూర్తి నియంత్రణలో ఉన్న ఈ పోలిష్ ఎనిమిదో సీడ్ తన ప్రత్యర్థి నుంచి పాయింట్లు రాబట్టి ఆరో గ్రాండ్ స్లామ్ కిరీటాన్ని కైవసం చేసుకుంది. వింబుల్డన్ లో ఆమెకు ఇదే తొలి టైటిల్.


డబుల్ బాగెల్

వింబుల్డన్ ఫైనల్లో స్వియాటెక్ డబుల్ బాగెల్ సాధించింది. అంటే రెండు సెట్లలోనూ ప్రత్యర్థికి ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా విజయం అందుకుంది. 1988 ఫ్రెంచ్ ఓపెన్ లో నటాషా జ్వెరెవాను ఓడించిన స్టెఫీ గ్రాఫ్ తర్వాత డబుల్ బాగెల్ తో మహిళల సింగిల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గిన తొలి క్రీడాకారిణిగా స్వియాటెక్ హిస్టరీ క్రియేట్ చేసింది. ఫైనల్లో అనిసిమోవా చేసిన 28 అనవసర తప్పిదాలు స్వియాటెక్ కు సహాయపడ్డాయి. ఆమె మొత్తం పాయింట్లలో 55-24 ఆధిక్యంతో మ్యాచ్ ను ముగించింది.

అక్కడ నాలుగు

రోలాండ్-గారోస్ ఎర్రమట్టిపై నాలుగు గ్రాండ్ స్లామ్ టైటిళ్లు, యూఎస్ ఓపెన్ హార్డ్ కోర్ట్స్ లో ఒక గ్రాండ్ స్లామ్ టైటిళ్లను స్వియాటెక్ గెలుచుకుంది. స్వియాటెక్ ఈ ఏడాదికి ముందు వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్స్ దాటలేదు. తన తొలి వింబుల్డన్ టైటిల్ గెలుచుకోవడం అంత సులభం కాదని ఊహించలేదు. తొలి గ్రాండ్ స్లామ్ ఫైనల్ కు చేరిన 23 ఏళ్ల అనిసిమోవా ఇప్పటికే చాంపియన్ షిప్ మ్యాచ్ కు చేరుకోవడం ద్వారా కెరీర్ బెస్ట్ విజయాన్ని సాధించింది. కానీ తుదిపోరులో ఓటమితో కన్నీళ్లు పెట్టుకుంది. వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను కొత్త ఛాంపియన్ అందుకోవడం వరుసగా ఇది ఎనిమిదోసారి.

ప్రైజ్ మనీ

వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేత ఇగా స్వియాటెక్ స్వియాటెక్ £3,000,000 (సుమారు $ 4.07 మిలియన్ డాలర్లు) ఖాతాలో వేసుకుంది. అంటే ఇండియన్ కరెన్సీలో అది రూ.34.94 కోట్లు. ఇది 2024 తో పోలిస్తే 11% ఎక్కువ. రన్నరప్ అమండా అనిసిమోవా £1,520,000 (సుమారు $ 2.06 మిలియన్ డాలర్లు) ప్రైజ్ మనీగా అందుకుంది. అంటే రూ.17.68 కోట్లు. ఇది మునుపటి సంవత్సరం కంటే 8% ఎక్కువ. వింబుల్డన్ 2025 కోసం మొత్తం ప్రైజ్ మనీ ఫండ్ 53.5 మిలియన్ పౌండ్లకు పెంచిన సంగతి తెలిసిందే. పురుషుల, మహిళల సింగిల్స్ విజేతకు ప్రైజ్ మనీ ఈక్వెల్ గా ఉంటుంది.