తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ind Vs Zim: భారత్-జింబాబ్వే మ్యాచ్‌లో కొన్ని అరుదైన ఘనతలు.. ఓ లుక్కేయండి

IND vs ZIM: భారత్-జింబాబ్వే మ్యాచ్‌లో కొన్ని అరుదైన ఘనతలు.. ఓ లుక్కేయండి

18 August 2022, 22:43 IST

google News
    • హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో భారత్ కొన్ని అరుదైన ఘనతలను సాధించింది. 192 పరుగుల లక్ష్యాన్ని వికెట్లేమి కోల్పోకుండా 10 వికెట్ల విజయాన్ని అందుకుంది భారత్. అంతేకాకుండా ధావన్ వన్డేల్లో 6500 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
భారత్-జింబాబ్వే
భారత్-జింబాబ్వే (AP)

భారత్-జింబాబ్వే

జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో భారత్ 10 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో జింబాబ్వేపై పూర్తి ఆధిపత్యం సాధించిన టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా కొన్ని అరుదైన ఘనతలను కూడా సొంతం చేసుకుంది. 192 పరుగుల లక్ష్యాన్ని వికెట్లేమి కోల్పోకుండా భారత్ ఛేదించిది. అంతేకాకుండా ఏడాదిలో రెండు సార్లు పది వికెట్ల తేడాతో విజయం సాధించడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో జరిగిన కొన్ని హైలెట్లు గురించి ఇప్పుడు చూద్దాం.

భారత్-జింబాబ్వే తొలి వన్డే హైలెట్స్..

- భారత్ అత్యధికంగా 13 వరుస విజయాలను జింబాబ్వేపై సాధించింది. ఒకే జట్టుపై ఇన్ని విజయాలు సాధించడం విశేషం(2013-22)

- పది వికెట్ల విజయాల్లో రెండో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం ఇదే(192/0). ఇంతకుముందు జింబాబ్వే పైనే 197./0 తేడాతో విజయం సాధించింది.

- వన్డేల్లో 6500 పరుగులను పూర్తి చేసుకున్న ఐదో భారత బ్యాటర్‌గా శిఖర్ ధావన్(6574) గుర్తింపు తెచ్చుకున్నాడు.

- యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఏడు వన్డేల్లో మూడో అర్ధశతకాన్ని నమోదు చేశాడు.

- గత నాలుగు ఇన్నింగ్సుల్లో ధావన్-గిల్ మూడు సార్లు సెంచరీ భాగస్వామ్యాన్ని(119, 48, 113, 192) నమోదు చేశారు.

- ఒకే ఏడాదిలో భారత్ రెండు సార్లు పది వికెట్ల తేడాతో విజయం సాధించింది. గత నెలలో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ 113 పరుగుల లక్ష్యాన్ని వికెట్లేమి కోల్పోకుండా ఛేదించింది.

- ఇప్పటి వరకు భారత్ ఎనిమిది సార్లు పది వికెట్ల తేడాతో విజయాలను నమోదు చేసింది.

జింబాబ్వే ఇచ్చిన 190 పరుగుల లక్ష్యాన్ని భారత్ జట్టు వికెట్లేమి కోల్పోకుండా ఛేదించింది. ఓపెనర్లు శిఖర్ ధావన్(81), శుభ్‌మన్ గిల్(82) అర్ధశతకాలతో విజృంభించి జట్టు విజయాన్ని మరింత తేలిక చేశారు. జింబాబ్వే బౌలర్లను టీమిండియా ఓపెనింగ్ జోడీని విడదీసేందుకు ఎంత కష్టపడినప్పటికీ ఫలితం లేకపోయింది. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 189 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ చకాబావా(35) ఒక్కడే అత్యధిక స్కోరు. భారత బౌలర్లలో దీపక్ చాహర్, ప్రసిధ్, అక్షర్ తలో మూడు వికెట్ల ఆకట్టుకున్నారు.

తదుపరి వ్యాసం