తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Australian Open 2025: స్టార్ ప్లేయర్ జొకోవిచ్‍కు మంచి పోటీ ఇచ్చిన 19ఏళ్ల తెలుగు సంతతి ఆటగాడు.. పోరాడి ఓటమి

Australian Open 2025: స్టార్ ప్లేయర్ జొకోవిచ్‍కు మంచి పోటీ ఇచ్చిన 19ఏళ్ల తెలుగు సంతతి ఆటగాడు.. పోరాడి ఓటమి

13 January 2025, 19:12 IST

google News
    • Australian Open 2025: స్టార్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్‍తో ఆస్ట్రేలియన్ ఓపెన్‍లో తలపడ్డాడు తెలుగు సంతతి ప్లేయర్ నిశేష్ బసవరెడ్డి. మంచి పోటీని ఇచ్చాడు. నాలుగు సెట్ల పాటు జరిగిన మ్యాచ్‍లో జొకోవిచ్ గెలిచాడు.
Australian Open 2025: స్టార్ ప్లేయర్ జొకోవిచ్‍కు మంచి పోటీ ఇచ్చిన 19ఏళ్ల తెలుగు సంతతి ఆటగాడు.. పోరాడి ఓటమి
Australian Open 2025: స్టార్ ప్లేయర్ జొకోవిచ్‍కు మంచి పోటీ ఇచ్చిన 19ఏళ్ల తెలుగు సంతతి ఆటగాడు.. పోరాడి ఓటమి (AP)

Australian Open 2025: స్టార్ ప్లేయర్ జొకోవిచ్‍కు మంచి పోటీ ఇచ్చిన 19ఏళ్ల తెలుగు సంతతి ఆటగాడు.. పోరాడి ఓటమి

టెన్నిస్ గ్రాండ్‍స్లామ్ టోర్నీ ‘ఆస్ట్రేలియన్ ఓపెన్‍ 2025’లో తెలుగు సంతతి ఆటగాడు నిశేష్ బసవరెడ్డి మంచి ప్రదర్శనే చేశాడు. టెన్నిస్ దిగ్గజం, 24 గ్రాండ్‍స్లామ్ టైటిళ్ల విజేత నొవాక్ జొకోవిచ్‍కు పోటీ ఇచ్చాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‍లో అమెరికా తరఫున బసవరెడ్డి బరిలోకి దిగాడు. మెల్‍బోర్న్ వేదికగా నేడు (జనవరి 13) జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‍లో సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ 4-6, 6-3, 6-4, 6-2 తేడాతో 107వ ర్యాంక్ బసవరెడ్డిపై విజయం సాధించాడు. జొకోవిచ్‍పై తొలి సెట్‍ను దక్కించుకొని వావ్ అనిపించాడు 19ఏళ్ల నిశేష్. అయితే, ఆ తర్వాత జొకోవిచ్ వరుసగా మూడు సెట్లు దక్కించుకొని మ్యాచ్ గెలిచాడు.

నిశేష్.. ఆరంభం అదుర్స్

గ్రాండ్‍స్లామ్ సింగిల్స్ మెయిన్ డ్రాకు నితేశ్ అర్హత సాధించడం ఇదే ఫస్ట్ టైమ్. తొలిసారే ఆస్ట్రేలియన్ ఓపెన్‍లో ఏకంగా నొవాక్ జొకోవిచ్ అతడికి ప్రత్యర్థిగా ఎదురయ్యాడు. అయినా ఈ పురుషుల సింగిల్స్ ఫస్ట్ రౌండ్ మ్యాచ్‍లో ఆరంభంలో అదరగొట్టాడు నిశేష్. తొలి సెట్‍లో దూకైన ఆట కనబరిచాడు. ఏడో సీడ్ జొకోవిచ్‍పై తొలి సెట్‍ను కైవసం చేసుకొని సత్తాచాటాడు.

ఆ తర్వాత జొకోవిచ్ విజృంభించాడు. రెండో సెట్‍ను 6-3తో కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాతి సెట్‍లో నిశేష్ మంచి పోటీ ఇచ్చాడు. ఓ దశలో 3-4తో నిలిచాడు. అయితే, ఆ తర్వాత జోరు పెంచిన జొకోచివ్ ఆ సెట్‍ను 6-4తో కైవసం చేసుకున్నాడు. నాలుగో సెట్‍లో నొవాక్ మరింత దూకుడుగా ఆడాడు. 6-2తో దక్కించుకున్నాడు. దీంతో జొకోవిచ్ విజయం సాధించాడు. స్టార్ ప్లేయర్ జొకోకు మంచి పోటీని మెప్పించాడు నిశేష్.

ఈ మ్యాచ్‍లో జొకోవిచ్ ఏకంగా 23 ఏస్‍లు బాదేశాడు. జొకో 129 పాయింట్లు సాధించగా.. నితేశ్ 106కు పరిమితం అయ్యాడు. నిశేష్ సర్వీస్‍ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు జొకోవిచ్. ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్లో జే ఫారియాతో జొకో తలపడనున్నాడు.

నెల్లూరు టు అమెరికా

నిశేష్ బసవరెడ్డి.. తల్లిదండ్రులు తెలుగువారే. నెల్లూరుకు చెందిన వారు 1999లో అమెరికాలోని శాన్‍ఫ్రాన్సిస్కోలో స్థిరపడ్డారు. 2005లో అక్కడే జన్మించాడు నిశేష్ బసవరెడ్డి. చిన్నప్పటి నుంచి టెన్నిస్ శిక్షణ తీసుకుంటున్నాడు. 2022లో యూఎస్ ఓపెన్ బాయ్స్ డబుల్స్ గెలిచాడు. గతేడాది ఏటీపీ 150 ర్యాంకింగ్‍లో అడుగుపెట్టాడు. ఇప్పుడు సీనియర్ గ్లాండ్‍స్లామ్ స్థాయికి వచ్చేశాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‍లో జోకోవిచ్‍తో ఆడాడు.

తదుపరి వ్యాసం