IND vs PAK Match - Asia Cup: ఆసియా కప్ నిర్వహణపై క్లారిటీ - ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
04 July 2023, 11:59 IST
IND vs PAK Match - Asia Cup: ఆసియా కప్ నిర్వహణ వ్యవహరం ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. పాకిస్థాన్‌తో పాటు శ్రీలంక ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వబోతున్నట్లు తెలిసింది. ఈ ఆసియా కప్ టోర్నీలో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడు జరిగే అవకాశం ఉందంటే...
బాబర్ ఆజాం , రోహిత్ శర్మ
IND vs PAK Match - Asia Cup: ఈ ఏడాది ఆసియా కప్ ఉంటుందా? లేదా? అనే సస్పెన్స్ త్వరలోనే వీడనున్నట్లు సమాచారం. ఆసియా కప్ నిర్వహణపై ఓ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆసియా కప్ కోసం షెడ్యూల్‌ను ఫిక్స్ చేయబోతున్నట్లు తెలిసింది. ఆసియా కప్‌కు ఈ ఏడాది పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది.
రెండు దేశాల మధ్య ఉన్న రాజకీయ పరమైన కారణాల వల్ల పాకిస్థాన్‌లో ఆడేందుకు బీసీసీఐ సుముఖంగా లేకపోవడంతో ఇన్నాళ్లు ఆసియా కప్ నిర్వహణపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా పాకిస్థాన్, శ్రీలంక రెండు దేశాల్లో ఆసియా కప్ నిర్వహించేలా ఒప్పందం కుదిరినట్లు తెలిసింది. ఇండియా ఆడనున్న మ్యాచ్‌లకు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుండగా మిగిలిన మ్యాచ్‌లను పాకిస్థాన్‌లో నిర్వహించేలా ప్లాన్ చేస్తోన్నట్లు తెలిసింది.
కాగా ఆసియా కప్‌లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌పైనే క్రికెట్ అభిమానుల దృష్టి మొత్తం ఉంది. ఈ చిరకాల ప్రత్యుర్థుల మధ్య ఆసియా కప్ మ్యాచ్ సెప్టెంబర్ 3న జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మ్యాచ్‌కు శ్రీలంకలోని డంబుల్లా స్టేడియం ఆతిథ్యం ఇవ్వనున్నట్లు తెలిసింది.
త్వరలోనే ఆసియా కప్ షెడ్యూల్‌ను అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆసియా కప్ తర్వాత వరల్డ్ కప్‌లో ఇండియాతో పాకిస్థాన్ తలపడనున్నాయి. అక్టోబర్ 15న ఈ రెండు దాయాది దేశాల మధ్య మ్యాచ్ జరుగనుంది.