తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vastu Tips: ఇంట్లో ఎలాంటి బల్లి కనిపిస్తే కోటీశ్వరులు అవుతారు- ఎలాంటి బల్లి కనిపిస్తే పేదరికంలో మగ్గిపోతారు?

vastu Tips: ఇంట్లో ఎలాంటి బల్లి కనిపిస్తే కోటీశ్వరులు అవుతారు- ఎలాంటి బల్లి కనిపిస్తే పేదరికంలో మగ్గిపోతారు?

Ramya Sri Marka HT Telugu

Published Nov 24, 2024 09:50 AM IST

google News
    • vastu Tips: ఇంట్లో బల్లి ఉండటం సాధారణమైన విషయమే. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో బల్లి ఉండటాన్ని సాధారణంగా తీసి పడేయకూడదట. ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉండటం వల్ల మీరు ఊహించని పరిణామాలు వస్తాయట. అవేంటో చూద్దా.
ఇంట్లో ఎలాంటి బల్లి కనిపిస్తే కోటీశ్వరులు అవుతారు

ఇంట్లో ఎలాంటి బల్లి కనిపిస్తే కోటీశ్వరులు అవుతారు

ఇంట్లో బల్లి ఉండటం, అది తరచూ కనిపించడం దాదాపు అందరి ఇళ్లలో సాధారణంగా జరిగే విషయాలే. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మాత్రం ఇది చాలా ప్రత్యేకమైన విషయం.ఎందుకంటే ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉండటం వల్ల చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో బల్లులు ఉండటం వల్ల కొన్నిసార్లు మంచి జరుగుతుంది, మరి కొన్ని సార్లు చెడు కూడా జరుగుతుంది. ఇంట్లోకి బల్లి రావడం, తరచూ కొన్ని ప్రదేశాలలో అది కనిపించడం, బల్లి మీద పడటం వంటివి కొన్ని ప్రత్యేక సంకేతాలను అందిస్తాయి. జ్యోతిష్య శాస్త్రంతో పాటు వాస్తు శాస్త్రంలో బల్లి కనిపిస్తే కలిగే శుభ, అశుభ సంకేతాలను గురించి వివరించారు. అవేంటో తెలుసుకుందాం.


లేటెస్ట్ ఫోటోలు

అక్టోబర్ 14 రాశి ఫలాలు.. ఏ రాశి వారికి అనుకూలం, ఎలా వ్యవహరించాలో తెలుసుకోండి!

Oct 13, 2025, 08:43 PM

3 యోగాలు- ఈ 5 రాశులకు మారనున్న తలరాత- ఘనంగా లాభాలు, ప్రమోషన్స్, ఉద్యోగ బదిలీ- విదేశీ ప్రయాణం, సంతోషమయ జీవితం!

Oct 12, 2025, 02:49 PM

అక్టోబర్ 11 రాశి ఫలాలు.. అన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వచ్చే రోజు.. కొత్త అవకాశాలు, ఆత్మవిశ్వాసంతో ముందడుగు

Oct 10, 2025, 08:20 PM

అక్టోబర్ 10 రాశి ఫలాలు.. ఈ ఒక్క రాశి వారికే కాస్త అదృష్టం.. మిగిలిన రాశుల వాళ్లు ఈ జాగ్రత్తలు తీసుకోండి

Oct 09, 2025, 08:21 PM

అక్టోబర్ 9 రాశి ఫలాలు.. ఈ ఏడు రాశులకు అదృష్ట కలిసి వచ్చే రోజు.. ప్రతి పనిలో విజయం, వ్యాపారాల్లో లాభాలు

Oct 08, 2025, 08:17 PM

అక్టోబర్ 8 రాశి ఫలాలు.. ఈ ఐదు రాశుల వారికి అదృష్టం కలిసి వచ్చే రోజు.. ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయో చూడండి

Oct 07, 2025, 08:51 PM

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో తరచూ బల్లి కనిపించడం అదృష్టానికి సంకేతం. ఇంటికి సంపద, సంతోషాలు రాబోతున్నాయని అర్థం. కొన్ని ఆఫ్రికన్ సంస్కృతుల ప్రకారం.. బల్లులు దుష్టశక్తులను దూరంగా ఉంది సానుకూల శక్తులను అదృష్టాన్ని తెచ్చే శక్తి కలిగి ఉంటాయి. ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉండటం వల్ల ఆ ఇంట్లోకి సంపద, సంతోషంతో నిండుతుంది.

ఇంట్లో బల్లి కనపించడం..

ఇంట్లో బల్లి కనపించడం శుభమే. కానీ, అది నల్లబల్లి కాకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం నల్లబల్లి అనేది శుభ సంకేతం కాదు. ముఖ్యంగా ఇంట్లోని పూజ గది దగ్గర నల్లబల్లి కనిపించడం అశుభాన్ని సూచిస్తుంది. ఇది ఆర్థిక నష్టం లేదా మరేదైనా సమస్యలు వస్తాయనే సంకేతంగా చెబుతారు. నిజానికి బల్లిని లక్ష్మీ దేవి చిహ్నంగా చెబుతారు. కానీ, నల్లబల్లి లక్ష్మీదేవిని సూచించదు. అందువల్ల ఇంట్లో లేదా పూజా మందిరం దగ్గర చెడు శకునంగా భావించాలి.

ఇంటి గుమ్మం దగ్గర బల్లి కనిపించడం..

ఇంటి సింహ ద్వారపు గుమ్మం దగ్గర బల్లి కనిపించడం శుభ సంకేతం. బల్లి ప్రధాన ద్వారం గుండా ఇంట్లోకి ప్రవేశిస్తే అది అతి త్వరలో మీ ఇంట కాసుల వర్షం కురుస్తుందనడానికి సంకేతం. బల్లి రూపంలో లక్ష్మీదేవి మీ ఇంట అడుగుపెట్టబోతుందని అర్థం.

పూజా మందిరంలో బల్లి కనిపించడం..

ఇంట్లో పూజా స్థలంలో బల్లి కనిపించడం శుభ సూచికంగా పరిగణిస్తారు. ఇంట్లో శ్రేయస్సు పెరగడానికి సంకేతం. భవిష్యత్ లో ఆర్థికంగా మెండైన లాభాలు పొందగలరని సూచిస్తుంది. ముఖ్యంగా శుక్రవారం రోజున ఇంట్లో పూజ గదిలో బల్లిని సూచిస్తున్నట్లయితే లక్ష్మీదేవి ఆశీర్వాదంగా భావించాలి.

ఇంట్లో రెండు బల్లులు కలిసి కనిపించడం..

ఇంట్లో రెండు బల్లులు కలిసి కనిపిస్తే పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదు. శుభం, అశుభం అనే వాటితో సంబంధముండదు. అయితే రెండు బల్లులు పరస్పరం పోట్లాడుకుంటూ కనిపిస్తే మాత్రం అది అశుభానికి సంకేతం. బల్లి పోట్లాట లేదా బల్లుల తగవు ఇంట్లో రోగాల రాకకు సంకేతం. కుటుంబంలో అనారోగ్యం, గొడవలు రాబోతున్నాయని సూచిస్తుంది.

బల్లి కింద పడిపోవడం..

జ్యోతిష్య శాస్త్రం, వాస్తు శాస్త్రాల ప్రకారం, బల్లి కిందపడటం అశుభ సూచికం. బల్లి పదేపదే నేలపై పడటం ఆ ఇంటికి అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా బల్లి పురుషుడు లేదా స్త్రీ మీద పడటం కూడా అనేక శుభ, అశుభ పరిణామాలకు సంకేతం.

బల్లి నేలపై పాకడం..

బల్లి నేలపై పాకుతూ కనిపిస్తే శుభ సూచికంగానే భావించాలి. ఆ బల్లికి మీ ద్వారా ఎటువంటి హాని జరగకూడనంత వరకే శుభం. బల్లిని వేధించడం, చంపడం అనే తప్పులు చేయవద్దు. వీటి ద్వారా అశుభ ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.