అయ్యప్ప దీక్షలో ఉన్నవాళ్లు ఉల్లిపాయ, వెల్లుల్లితో చేసిన ఆహారాన్ని ఎందుకు తినకూడదు?
30 November 2024, 13:30 IST
- భారతీయ వంటగదిలో ఉల్లిపాయ, వెల్లుల్లి ముఖ్యమైన పదార్థాలు. మాలధారణ, ఉపవాస సమయంలో వీటితో చేసిన ఆహార పదార్థాలను తినకూడదని ఎందుకంటారు? దీని వెనకున్న ఆధ్యాత్మిక విశ్వాసం ఏంటి?
![అయ్యప్ప దీక్షలో ఉన్నవారు ఉల్లిపాయ, వెల్లుల్లి ఎందుకు తినకూడదు
అయ్యప్ప దీక్షలో ఉన్నవారు ఉల్లిపాయ, వెల్లుల్లి ఎందుకు తినకూడదు](https://images.hindustantimes.com/telugu/img/2024/11/30/550x309/Ayyappa_Padi_Pooja_Naived_1729314658586_1732952171671.jpeg)
అయ్యప్ప దీక్షలో ఉన్నవారు ఉల్లిపాయ, వెల్లుల్లి ఎందుకు తినకూడదు
భారతీయులు చేసే వంటకాల్లో ఉల్లిపాయ, వెల్లుల్లికి ప్రాధాన్యత ఎక్కువ. ఇవి ఆహారానికి మంచి రుచిని, సువాసనను అందించడంతో పాటు మెండైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తాయి. అయితే హిందువుల నమ్మకాల ప్రకారం అయ్యప్ప మాల, హనుమాన్ మాల, శివ మాల వంటి మాలధారణ సమయాల్లో ఉల్లిపాయలు, వెల్లుల్లితో తయారు చేసిన ఆహార పదార్థాలను తినకూడదు. పండగలు, ప్రత్యేక పూజల సమయాల్లో ఉపవాసాలు చేసే వారు కూడా ఆ రోజు ఉల్లిపాయ, వెల్లులికి దూరంగా ఉండాలని చెబుతారు. ఆధ్మాత్మిక భాషలో చెప్పాలంటే ఉల్లిపాయ, వెల్లులిని తామసిక ఆహారాల జాబితాలో చేరుస్తారు. అలా ఎందుకంటారు మాలధారణ, ఉపవాస సమయాల్లో ఉల్లిపాయ, వెల్లుల్లితో తయారు చేసిన ఆహారాలను ఎందుకు తీసుకోకూడదు తెలుసుకుందాం.
లేటెస్ట్ ఫోటోలు
30 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. వీరి రాత మారుతుంది, అదృష్టంతోపాటు ఆర్థిక లాభాలు!
Jayam Ravi: ఇక నుంచి ఆ పేరుతోనే పిలవాలన్న తమిళ స్టార్ హీరో.. 22 ఏళ్ల తర్వాత మార్పు
మహాకుంభమేళా 2025: మహా జాతర ప్రారంభం.. లక్షలాది మంది భక్తుల పవిత్ర రాజస్నానం
Honeymoon: మాల్దీవుల్లో రెండో భార్యతో మ్యూజిక్ డైరెక్టర్ హనీమూన్.. నీలి సముద్రంలో కొత్త పెళ్లికూతురు.. ఫొటోలు వైరల్
మహా కుంభమేళా ప్రారంభం- చలిని సైతం లెక్కచేయకుండా పవిత్ర స్నానాలు..
Argument Behavior in Women: వివాదాలు పెట్టుకునే స్త్రీల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా, ఈ సూచనలతో ముందే పసిగట్టండి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఉల్లిపాయ, వెల్లులి దుష్ట గ్రహాలుగా చెప్పుకునే రాహు, కేతువులతో సంబంధం కలిగి ఉంటాయి. మాలధారణ, ప్రత్యేక పూజలు, ఉపవాస సమయాల్లో వీటిని తినడం వల్ల భక్తుడి శక్తికి అంతరాయ కలుగుతుంది. ఫలితంగా దీక్ష లేదా ఉపవాసం, ప్రార్థన వంటి వాటి ప్రభావం తగ్గుతుంది. ఫలితంగా వారు ఆధ్మాత్మికంగా ఎక్కువ సమయాన్ని వెచ్చించలేరు. కనుక దేవుడి దీక్షలో ఉన్నప్పుడు, ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు ఉల్లిపాయ వెల్లులితో చేసిన ఆహార పదార్థాలను తినకూడదు అంటారు.
కేవలం దీక్షా సమయంలోనే కాకుండా సాధారణంగా కూడా ప్రతి నెలా నాలుగు రోజులు వీటిని తినకూడదని పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజులేవో వాటి ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
1. అమావాస్య:
ప్రతి నెలా అమావాస్య నాడు తమ పూర్వీకులకు సంబంధించిన ఆచారాలు, ధానధర్మాలు వంటివి చేస్తుంటారు. ఈరోజు తినే భోజనం సరళంగా ఉండాలి. కనుక అమావాస్య రోజున వెల్లుల్లి, ఉల్లిపాయలతో చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి.
2. పౌర్ణమి:
పౌర్ణమి అనేది చంద్రుడి శక్తితో అనుసంధానం అయి ఉంటుంది. పురాణాల ప్రకారం పౌర్ణమి తిథి చాలా స్వచ్ఛమైనది. ఈ రోజు ఉల్లిపాయ, వెల్లుల్లితో చేసిన వంటకాలను తినడం వల్ల ఆ శక్తికి ఆటంకం కలుగుతుందని నమ్మిక.
3. ఏకాదశి:
పురాణాల ప్రకారం ఏకాదశి అనేవి విష్ణువుకు అంకితం చేయబడిన రోజు. ఈ రోజు విష్ణువు, లక్ష్మీదేవిలను పూజించడం అత్యంత శుభప్రదమని చెబుతారు. ఏకాదశి రోజు తామసిక ఆహారాలను తినడం వల్ల ప్రార్థనా శక్తి, ధ్యానంపై ధ్యాస తగ్గుతాయి.
4. ప్రదోష వ్రతం:
ప్రదోష వ్రతానికి హిందూ పురాణాల్లో ప్రాముఖ్యత ఎక్కువ. ఈ రోజున శివుడిని, శివకుటుంబీకులను భక్తి శ్రద్ధలతో పూజించి,ఉపవాసం ఉండటం వల్ల ఆర్థిక, శారీరక, మానసిక శ్రేయస్సు కలుగుతుందని నమ్మిక. ఈ రోజు సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఉల్లిపాయ, వెల్లుల్లిని తీసుకోవడం వల్ల ఆధ్మాత్మికంగా దృష్టిని కేంద్రీకరించలేరని నమ్ముతారు.