తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Ayyappa Temple Steps: అయ్యప్ప స్వామికి 18 నెంబర్ కు ఉన్న సంబంధం ఏంటి? ఆలయంలోని 18 మెట్ల పేర్లు తెలుసా?

Ayyappa temple steps: అయ్యప్ప స్వామికి 18 నెంబర్ కు ఉన్న సంబంధం ఏంటి? ఆలయంలోని 18 మెట్ల పేర్లు తెలుసా?

Gunti Soundarya HT Telugu

14 November 2024, 18:23 IST

google News
    • Ayyappa temple steps: అయ్యప్ప దీక్ష చేపట్టిన భక్తులు శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయంలో పద్దెనిమిది మెట్లు ఎక్కి దర్శించుకుంటారు. శబరిమల ఆలయానికి 18 అనే సంఖ్యకు ముడిపడి ఉంటుంది. ఈ రెండింటికీ ఉన్న సంబంధం ఏంటి? ఆలయంలో ఉన్న పద్దెనిమిది మెట్ల పేర్లు ఏంటో తెలుసుకుందాం. 
శబరిమల 18 మెట్ల పేర్లు ఏంటి?
శబరిమల 18 మెట్ల పేర్లు ఏంటి? (pinterest)

శబరిమల 18 మెట్ల పేర్లు ఏంటి?

కార్తీక మాసంలో చాలా మంది అయ్యప్ప దీక్షలు చేపడతారు. 41 రోజుల పాటు కఠినమైన నియమాలు ఆచరిస్తూ నిత్యం అయ్యప్పను పూజిస్తారు. శబరిమల వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. శబరిమల అయ్యప్ప దేవాలయం అనగానే 18 మెట్లు గుర్తుకు వస్తాయి.

లేటెస్ట్ ఫోటోలు

Sun Saturn Conjunction:సూర్యుడు, శని కలయికతో ఈ 3 రాశులకు లక్కే లక్కు.. పనిలో విజయం, సంతోషంతో పాటు ఎన్నో

Feb 10, 2025, 08:36 AM

విజయానికి కేరాఫ్​ అడ్రెస్​ ఈ 3 రాశులు- కష్టాలు దూరం, ఉద్యోగంలో ప్రమోషన్​..

Feb 10, 2025, 05:58 AM

Weekly Love Horoscope : ఈ ఆరు రాశులవారికి వీక్లీ లవ్ జాతం ఎలా ఉంది?

Feb 09, 2025, 10:39 PM

ఇక అదృష్టమంతా ఈ 3 రాశుల వారిదే! ఆర్థిక కష్టాలు దూరం, వ్యాపారంలో ధన లాభం..

Feb 09, 2025, 06:20 AM

09 February 2025 horoscope: రేపు మీ రాశి వారికి ఎలా ఉండబోతోంది? 9 ఫిబ్రవరి 2025, ఆదివారం రాశి ఫలాలు

Feb 08, 2025, 09:10 PM

ఈ మూడు రాశుల వారికి మరో వారం చాలా అదృష్టం.. ఆర్థిక ప్రయోజనాలు, సంతోషం దక్కుతాయి!

Feb 08, 2025, 12:31 PM

అయ్యప్ప మాల ధరించి ఇరుముడి కట్టుకున్న వారికి మాత్రమే ఈ పద్దెనిమిది మెట్లు ఎక్కేందుకు అర్హత ఉంటుంది. సాధారణ భక్తులు ఈ మెట్లు ఎక్కేందుకు సాధారణ భక్తులకు అనుమతి ఉండదు. ఈ పద్దెనిమిది మెట్లను పదునెట్టాంబడి అని పిలుస్తారు. పంచ లోహాలతో ఈ మెట్లకు పూత పూశారు. రెండు శాస్త్రాలు, అష్టదిగ్పాలకులు, 4 వేదాలు మొత్తం కలిపి 18 మెట్లుగా మారినట్టు చెప్తారు.

తొలి ఐదు మెట్లు పంచేంద్రియాలతో సమానం. ఎనిమిది మెట్లు అసూయ, లోభం, కామం, క్రోధం, మదం, మొహం, మాస్తర్యం, దంబం సూచిస్తాయి. మరో మూడు మెట్లు సత్వ, తమో, రజో గుణాలను సూచిస్తాయి. చివరి రెండు మెట్లు విద్య, అవిద్యగా చెప్తారు. అలాగే ఈ పద్దెనిమిది మెట్లకు 18 పేర్లు ఉన్నాయి. అష్టాదశ దేవతలు వీటిని సంరక్షిస్తూ ఉంటారని చెబుతారు. అలాగే అయ్యప్ప స్వామి ఈ పద్దెనిమిది మెట్లు ఎక్కుతూ తన 18 అస్త్రాలను విడిచి పెట్టాడని అంటారు.

అయ్యప్ప 18 మెట్ల పేర్లు

  1. అణిమ
  2. లఘిమ
  3. మహిమ
  4. ఈశ్వత
  5. వశ్యత
  6. ప్రాకామ్య
  7. బుద్ధి
  8. ఇచ్చ
  9. ప్రాప్తి
  10. సర్వకామ
  11. సర్వ సంపత్కర
  12. సర్వ ప్రియకర
  13. సర్వ మంగళాకార
  14. సర్వ దుఃఖ విమోచన
  15. సర్వాంగ సుందర
  16. మృత్యు ప్రశమన
  17. సర్వ విఘ్ననివారణ
  18. సర్వ సౌభాగ్యదాయక

అష్టాదశ దేవతలు

  1. మహంకాళి
  2. కళింకాళి
  3. భైరవ
  4. సుబ్రహ్మణ్యం
  5. గంధర్వరాజ
  6. కార్తవీర్య
  7. క్రిష్ట పింగళ
  8. భేతాళ
  9. మహిషాసుర మర్ధని
  10. నాగరాజ
  11. రేణుకా పరమేశ్వరి
  12. హిడింబ
  13. కర్ణ వైశాఖ
  14. అన్నపూర్ణేశ్వరి
  15. పుళిందిని
  16. స్వప్న వారాహి
  17. ప్రత్యంగళి
  18. నాగ యక్షిణి

అలాగే శబరిమలలోని అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలంటే 18 కొండలు దాటాలి. ఆ కొండల పేర్లు ఏంటంటే

18 కొండల పేర్లు

  1. పొన్నాంబళమేడు
  2. గౌదవమల
  3. నాగమల
  4. సుందరమల
  5. చిట్టమ్బలమల
  6. ఖలిగిమల
  7. మాతంగమల
  8. దైలాదుమల
  9. శ్రీపాదమల
  10. దేవరమల
  11. నీల్కల్ మల
  12. దాలప్పార్ మల
  13. నీలిమల
  14. కరిమల
  15. పుత్తుశరిమల
  16. కాళైకట్టిమల
  17. ఇంజప్పారమల
  18. శబరిమల

ఇవన్నీ దాటుకుంటూ పట్టబంధాసనంలో కూర్చుని అభయ హస్తంతో దర్శనమిచ్చే అయ్యప్ప స్వామిని భక్తులు దర్శించుకుని అయ్యప్ప దీక్షలు విరమిస్తారు.

తదుపరి వ్యాసం