Vahana yoga: 2025లో ఈ నాలుగు రాశుల వారికి వాహన యోగం.. ఏం కొనాలో ఇప్పటి నుంచే ఆలోచించుకొండి!
07 December 2024, 13:01 IST
- Vahana Yoga: 2024 ముగిసిపోతుంది. కొత్త సంవత్సరం రాబోతుంది. ఈ సారైనా సొంత ఇళ్లు, సొంత వాహనం కొనే యోగం ఉందో లేదో అని ఇప్పటికే చాలా మంది అనుకుంటూ ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి 2025లో వాహనం కొనాలనే కల నెరవేతుందట. ఈ ఏడాది కొన్ని రాశుల వారికి వాహన యోగం ఏర్పడుతుంది.
2025లో ఈ రాశుల వారికి వాహన యోగం
సొంతిల్లు, సొంత వాహనం ఉండాలనేది ప్రతి ఒక్కరి కల. అయితే ఎంత కష్టపడినా కొందరు చిన్న స్కూటర్ కూడా కొనలేరు. ఇందుకు వేరు వేరు కారణాలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ కారణం మీ పుట్టిన సమయం అయి ఉండచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పుట్టిన సమయాన్ని బట్టి ప్రతి వ్యక్తికీ ప్రత్యేకమైన రాశి కేటాయించబడుతుంది. దాని ప్రకారం మీ జీవితంలో చాలా విషయాలు జరుగుతుంటాయి. ప్రతి ఒక్కరి జాతకంలోని 4స్థానంలో సొంతింటి యెగం, వాహన యోగం వంటివి సూచిస్తాయి. అలాగే మాట, వివేకం, తర్కానికి ప్రాతినిధ్యం వహించే బుధ గ్రహం కూడా వాణిజ్య వాహన యోగాలను ప్రభావితం చేస్తాడు. వాహన కొనుగోలు అనేది కొన్నిసార్లు శుక్రుడి చేతిలో కూడా ఉంటుంది. ఏదైమైనా జ్యోతిష్య గణన లెక్కల ప్రకారం 2025 సంవత్సరంలో కీలక గ్రహాల సంచారంలో మార్పులు జరుగుుతున్నాయి. ఇవి వ్యక్తుల జీవితాల్లో చాలా రకాల మార్పులను తెస్తున్నాయి. వాటిని బట్టి కొన్ని రాశుల వారికి 2025 సంత్సరంలో వాహన యోగం ఉంది. ఆ రాశులేవో అందులో మీరు ఉన్నారో లేదో తెలుసుకుందాం రండి.
లేటెస్ట్ ఫోటోలు
2025 లో వాహనం యోగం ఉన్న రాశులు:
మేష రాశి:
మేష రాశి వారికి వాహనం కొనడానికి 2025 సంవత్సరం మంచి సమయం. ఈ ఏడాది గ్రహాల స్థానాల్లో మార్పు కారణంగా మీకు భూమి, వాహన కొనుగోలుకు సంబంధించిన విషయాలకు మంచి మద్దతు లభిస్తుంది. కాకపోతే ఇందుకు మీకు కష్టపడాల్సిన వస్తుంది. పాత వాహనాలతో సమస్యలు ఎదుర్కొంటున్న మేష రాశి వారు కొత్తది కొనుగోలు చేయడానికి ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది. మీ శ్రమకు తగిన ఫలితాలను పొందుతారు. నచ్చిన వాహనాన్ని కొనుక్కుని దాని తాలూకా ఆనందాన్ని బాగా ఆస్వాదించగలుగుతారు.
వృషభ రాశి:
వృషభ రాశి వారు 2025 లో కొత్త వాహనం లేదా వారి మొదటి వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటే అనేక ఇబ్బందులు తలెత్తవచ్చు. దీని కారణంగా తర్వాత కొన్నిసమస్యలు రావచ్చు. కాబట్టి మీరు కొత్త సంవత్సరంలో కొత్త వాహనం కొనడం మానుకోవాలి. అయితే ఇప్పటికే పాత వాహనాన్ని కలిగి ఉంటే, మీరు దానిని రిపేర్ చేయవచ్చు లేదా చిన్న మార్పులు చేయవచ్చు. సెకండ్ హ్యాండ్ వాహనాన్ని తీసుకున్నా పరవాలేదు కానీ వీలైనంత వరకూ అయితే 2025 లో కొత్త వాహనాలను కొనకపోవడమే మంచిది.
మిథున రాశి:
2025 మిథున రాశి వారికి వాహన లాభాల పరంగా మిశ్రమ ఫలితాలున్నాయి. ఈ రాశి వారు కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటే దాని గురించి ఆలోచించి పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకోవడం మంచిది. అయితే మీరు ఇప్పటికే ఉపయోగించిన పాత వాహనాన్ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే అందులో పెట్టుబడి పెట్టే ముందు దాని స్టేటస్ మరియు డాక్యుమెంట్లను జాగ్రత్తగా తనిఖీ చేయండి. నచ్చిన వాహనాన్ని తీసుకొండి కానీ దాన్ని సరిగ్గా ఆలోచించి ఎంచుకొండి.
కర్కాటర రాశి:
కర్కాటక రాశి వారికి కొత్త వాహనాలు కొనుగోలు చేయడానికి 2025 మంచి సమయం. ఈ ఏడాది మీకు వాహనం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు కలగవచ్చు. ఆత్మీయులు లేదా ఇంటి పెద్దల సలహా మేరకు మీకు నచ్చిన వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు. వ్యవసాయం లేదా వ్యాపార అవసరాల కోసం వచ్చే సంవత్సరం వాహనం కొనుగోలు చేయడం మంచిది.