తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి ధనం అందుతుంది.. ఉల్లాసంగా ఉంటారు

Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి ధనం అందుతుంది.. ఉల్లాసంగా ఉంటారు

HT Telugu Desk HT Telugu

11 January 2025, 7:00 IST

google News
    • Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 11.01.2025 శనివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి ధనం అందుతుంది
Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి ధనం అందుతుంది

Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి ధనం అందుతుంది

రాశిఫలాలు (దిన ఫలాలు) : 11.01.2025

లేటెస్ట్ ఫోటోలు

Parivartana Yogam: పరివర్తన రాజయోగంతో 3 రాశుల వారికి అదృష్టం.. ఇక అన్నీ విజయాలే, తిరుగేలేదు

Feb 07, 2025, 09:39 AM

ఈ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం! ఇక అన్ని కష్టాలు దూరం, జీవితంలో సంతోషం..

Feb 07, 2025, 05:58 AM

7 February Horoscope: ఈ శుక్రవారం మీకు శుభాలను తెస్తుందా? ఫిబ్రవరి 7 రాశి ఫలాలు

Feb 06, 2025, 09:01 PM

Mercury Effects: మకర రాశిలోకి బుధుడు .. 4 రాశులకు ఇబ్బందులు.. జాగ్రత్తగా ఉండాలి

Feb 06, 2025, 10:26 AM

5th February Horoscope: మీ రాశి గ్రహబలం రేపు ఎలా ఉండబోతోంది?.. ఫిబ్రవరి 5 రాశి ఫలాలు

Feb 04, 2025, 09:59 PM

ఈ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం! ఆనందం, అదృష్టం, జీవితంలో సంతోషం..

Feb 03, 2025, 05:58 AM

ఆయనము: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ

మాసం: పుష్యం, వారం : శనివారం, తిథి : శు. ద్వాదశ, నక్షత్రం : రోహిణి

మేషం

రాశి వారికి ఈ రోజు ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలు వేసుకుంటారు. పరిస్థితులు అను కూలిస్తాయి. ఆవిశ్రాంతంగా శ్రమిస్తారు. పరిచయాలు బలపడతాయి. బుధవారం నాడు అనుకున్న పనులుసాగవు. ఒత్తిడికి గురి కాకుండా చూసుకోండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త. ఆరోగ్యం పట్ల ఆశ్రద్ధ తగదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.

వృషభం

ఈ రాశి వారికి ఈ రోజు ఓర్పు, పట్టుదలతో శ్రమించండి. యత్నాలు విరమించుకోవద్దు. పరిస్థితులు త్వరలో చక్కబడతాయి. రావలసిన ధనం అందుతుంది. ప్రముఖులకు కానుకలు అందిస్తారు. చేపట్టిన పనులు సానుకూలమవుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. తరుచూ సన్నిహితులతో సంబాషిస్తుంటారు. అనవసర విషయాల్లో జోక్యం తగదు.

మిధునం

రాశి వారికి ఈ రోజు ఆర్ధికలావాదేవీలు సంతృప్తిని స్తాయి. వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసు కుంటారు. కొన్ని ఇబ్బందుల నుంచి బయట పడతారు. ఖర్చులు విపరీతం. పత్రాలు, రశీదులు జాగ్రత్త. పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. కొత్త పనులు మొదలెడతారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి.

కర్కాటకం

ఈ రాశి వారికి ఈ రోజు కార్యసాధనకు మరింత శ్రమించాలి. పట్టింపులకు పోవద్దు. లౌక్యంగా మెలగండి. అవకాశాలను తక్షణం అంది పుచ్చుకోండి. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. సామ రస్యంగా మెలగండి. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. ఆత్మీయులతో సంభాషిస్తారు. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. ఆంతతరంగిక విషయాలు వెల్లడించవద్దు.

సింహం

రాశి వారికి ఈ రోజు మనోదైర్యంతో మెలగండి. కృషి ఫలించకున్నా శ్రమించామన్న తృప్తి ఉంటుంది. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. మనోధైర్యంతో యత్నాలు సాగిం చండి. పరిస్థితులు త్వరలో చక్కబడతాయి. గృహోపకరణాలు, విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. కీలక పత్రాలు జాగ్రత్త. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఫోన్ సందేశాలను నమ్మవద్దు.

కన్య

ఈ రాశి వారికి ఈ రోజు సంప్రదింపులు కొలిక్కి వస్తాయి. రుణవిముక్తులవుతారు. ఆదాయం సంతృప్తికరం. విలాసాలకు వ్యయం చేస్తారు. గృహంలో స్తబ్దత తొలగుతుంది. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. గత సంఘ టనలు అనుభూతినిస్తాయి. కొత్తవ్యక్తులతో మితంగా సంభాషించండి. ముఖ్యమైన విషయాల్లో ఒత్తిడికి గురికావద్దు. వేడుకలో పాల్గొంటారు.

తుల

రాశి వారికి ఈ రోజు దృఢసంకల్పంతో యత్నాలు సాగిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పరిచయాలు బలపడతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. అనవసర జోక్యం తగదు. వేడుక తలపెడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

వృశ్చికం

రాశి వారికి ఈ రోజు నిర్దేశిత ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు, పరిస్థితులు అను కూలిస్తాయి. సమర్థతను చాటుకుంటారు. ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. వాయిదాపడుతూ వస్తున్న పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. మీ మాటలు చేరవేసే వారున్నారని గమనించండి. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.

ధనుస్సు

ఈ రాశి వారికి ఈ రోజు గ్రహస్థితి అను కూలంగా ఉంది. స్నేహసంబంధాలు బలపడతాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు చురుకుగా సాగు తాయి. వాహనం కొనుగోలు చేస్తారు. కీలక పత్రాలు జాగ్రత్త. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. వేడుక తలపెడతారు. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. ప్రముఖులకు శుభాకాంక్షలు, కానుకలు అందిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త.

మకరం

ఈ రాశి వారికి ఈ రోజు లక్ష్యాన్ని సాధించే వరకు శ్రమించండి. యత్నాలు విరమించుకోవద్దు. మీ కృషి త్వరలోనే ఫలిస్తుంది. స్వయం కృషితోనే కార్యం సాధిస్తారు. మీ ఓర్పు, పట్టుదలలే విజయానికి దోహదపడతాయి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు. ఆపన్నులకు సాయం అందిస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడపుతారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి.

కుంభం

ఈ రాశి వారికి ఈ రోజు వ్యవహారాల్లో ఒత్తిడికి గురికావద్దు. అన్ని విధాలా శుభమే జరుగు తుంది. మనోదైర్యంతో యత్నాలు సాగించండి. ఆత్మీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. వేడుకల్లో పాల్గొంటారు. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి.

మీనం

ఈ రాశి వారికి ఈ రోజు వ్యవహారానుకూలత ఉంది. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. పిల్లల భవిష్యత్తుపై దృష్టిపెడతారు. ధనసమస్యలెదురయ్యే సూచ నలున్నాయి. దుబారా ఖర్చులు తగ్గించుకోండి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వ వద్దు. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. ఆప్తుల తో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
తదుపరి వ్యాసం