Today Rasi Phalalu: ఈ రాశుల వాళ్లకు బాగుంటుంది.. సంక్రాంతి పూట అదృష్టం వస్తుంది.. ఏ రాశుల వారు ఏం చేయాలో తెలుసుకోండి
14 January 2025, 4:00 IST
- Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 14.01.2025 మంగళవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Today Rasi Phalalu
రాశిఫలాలు (దిన ఫలాలు) : 14.01.2025
లేటెస్ట్ ఫోటోలు
Budhaditya Yoga: కుంభరాశిలో సూర్యుని రాక, బుద్ధాదిత్య రాజ యోగం- ఈ 4 రాశుల వారికి గోల్డెన్ డేస్ మొదలు, ఉద్యోగ అవకాశాలు!
Shani Transit: శని సంచారం, 2025లో డబ్బుల వర్షం కురుస్తుంది.. ఈ మూడు రాశుల వారికి సంతోషం
ఇక విజయానికి కేరాఫ్ అడ్రెస్ ఈ 3 రాశులు- డబ్బులే, డబ్బులు..
Guru Transit: మిథున రాశిలో గురువు సంచారం.. ఈ 3 రాశులకు అదృష్టం, ధనం, సంతోషంతో పాటు ఎన్నో
ఇక ఈ రాశుల వారికి డబ్బుకు లోటు ఉండదు! జీవితంలో అపార సంతోషం..
Rahu Transit: రాహువు కుంభ రాశి సంచారం.. ఈ రాశులకు ఆకస్మిక ధన లాభం, సంతోషంతో పాటు ఎన్నో
ఆయనము: ఉత్తరాయణం, సంవత్సరం: శ్రీ క్రోధినామ
మాసం: పుష్యం, వారం : మంగళవారం, తిథి : శు. పాడ్యమి, నక్షత్రం : పునర్వసు
మేషం
ఈ రాశి వారికి ఈ రోజు కొంతమందికి మీ సలహాలు, సూచనలు ఇచ్చి వాళ్ళ ద్వారా పనులు చేయించుకోవాలన్న ఆలోచనలు ముడిపడతాయి. మీకు ఉన్న ధైర్యం, స్ఫూర్తి మీ వాళ్ళకి లేదు అని బాధపడాలో లేదా వాళ్లందరి బలమే మీరు అని సంతోషపడాలో అర్ధంకాదు. ముఖ్యమైన విషయమై దీర్ఘాలోచనలు చేస్తారు. గురువుల ద్వారా ధైర్యాన్ని, మంచి సలహాలను స్వీకరించగలుగుతారు. పూజలలో ఆరావళి కుంకుమను ఉపయోగించండి.
వృషభం
ఈ రాశి వారికి ఈ రోజు ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. పూజలలో ప్రథమ తాంబూలాన్ని వాడండి. ఆర్ధిక ప్రయోజనాలు పొందుతారు. కళలు, రాజకీయ, రంగాలలోని వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. వివాహాది శుభకార్యాలు సానుకూల పడతాయి. రహస్య సమాచారము కీలకమైన వ్యక్తుల గురించి అసలు విషయాలను తెలుసుకోగలుగుతారు. విదేశీ అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. బ్యాంకు ఉద్యోగస్తులకు బాగుంటుంది.
మిథునం
ఈ రాశి వారికి ఈ రోజు కీలకమని భావించి విషయాలలో తొందరపాటు తగదు. జాగ్రత్త వహించండి. సెంటిమెంట్ వస్తు భద్రత పట్ల జాగ్రత్తలు అవసరం. ముఖ్యమైన పనులు సన్నిహితుల సహకారంతో పూర్తి చేస్తారు. ఆలోచనలకు కార్యరూపం ఇస్తారు. నూతన కార్యక్రమాలు చేపడతారు. పూజలలో, శుభకార్యాలలో సుగంధసిద్ధ గంధాక్షింతలను ఉపయోగించండి, గృహం, వాహన అమ్మకాలు, కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని రకాల వ్యాపారస్తులకి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా మంచి ప్రోత్సాహాన్ని అందుకోగలుగుతారు.
కర్కాటకం
ఈ రాశి వారికి ఈ రోజు మీ శ్రమకు, మీ కష్టానికి ప్రతిఫలాలను అందుకోగలుగుతారు. రాజకీయ పైరవీలు లాభిస్తాయి. వాక్చాతుర్యంతో ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో నుండైనా బయటపడగలుగుతారు. మేనేజ్మెంట్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. సేల్స్ డిపార్టుమెంట్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంది. ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో కప్పు సాంబ్రాణి త్రిశూల్ పొడితో ధూపం వేయండి. నర దిష్టి తొలగిపోతుంది. వ్యాపారాలలో ఆదాయం రొటేషన్ల రూపంలో ఉంటుంది. విహార యాత్రలు పుణ్యక్షేతాల సందర్శన చేసుకుంటారు.
సింహం
ఈ రాశి వారికి ఈ రోజు కార్యాలయంలో కొంతమంది చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను బయట పడవేయాలని మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. సాక్షాధారాలతో మీరు రుజువులను నిరూపించగలుగుతారు. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది. వాహనాన్ని అమ్మి కొత్తది కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. దీనికి తగిన వ్యక్తులను ఎంచుకుంటారు. వారికి సమాచారాన్ని అందజేస్తారు. దైవదర్శనాలు చేసుకోగలుగుతారు.
కన్య
ఈ రాశి వారికి ఈ రోజు పట్టుదల క్రమశిక్షణతో సాధించలేనిది అంటూ ఏమీ లేదు, దేవుడి మీద భారం వేసి ముందడుగు వేస్తారు. మీ ఓర్పు, సహనంతో ఎన్నో విజయాలను సాధిస్తారు. దైవ చింతన కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. కుక్కలకు, జీవరాసులకు మంచినీళ్లు పెట్టండి. సిద్ధ గంధంతో ఆ వెంకటేశ్వరస్వామి వారికి అర్చన జరిపించండి. పెద్దల పేరు మీద స్వయంపాకం ఇవ్వండి. ఏ నూతన కార్యక్రమాన్ని అయినా ప్రారంభించండి. పితృదేవతల అనుగ్రహంతో కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి అవుతాయి.
తుల
ఈ రాశి వారికి ఈ రోజు అనుకున్న కార్యక్రమాలలో అంతంత మాత్రపు పురోగతిని సాధిస్తారు. ఆలోచన విధానం అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపార రీత్యా తీసుకునే ఆలోచనలు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అష్టమూలిక తైలంతో లక్ష్మి తామర వత్తులతో దీపారాధన చేయండి. విదేశాలలో ఉన్నవారికి అంతంత మాత్రమే ఫలితాలు అందుతాయి. భూ సంబంధిత లావాదేవీలు అనుకూలిస్తాయి. మంత్ర ఉపదేశం తీసుకోవాలన్న ఆలోచనలు కలుగుతాయి..
వృశ్చికం
ఈ రాశి వారికి ఈ రోజు దీర్ఘాలోచన ద్వారా మంచి ఫలితాలు అందకపోవచ్చు. తొందరగా తీసుకొన్న ఆలోచనలతో ప్రయోజనాలని దక్కించుకుంటారు. రుణ బాధల నుండి బయట పడడానికి గానూ చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శ్రీ ఆంజనేయ వృషభం స్వామి వారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటన ఈ బొట్టును ధరించండి. స్వార్జితంతో కొన్ని సేవా కార్యక్రమాలకు విరాళాలు అందజేస్తారు. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు అందుతాయి.
ధనుస్సు
ఈ రాశి వారికి ఈ రోజు టీవీ పరిశ్రమల్లో ఉన్నవారికి సినీ పరిశ్రమల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సుదీర్ఘమైన చర్చలు, ఫోన్ సంభాషణ ద్వారా విలువైన సమాచారాన్ని గ్రహిస్తారు. ఓం నమశ్శివాయ వత్తులతో, అష్టమూలికా తైలంతో నిత్య దీపారాధన చేయండి. శత్రువుల పట్ల శ్రద్ధ కనబరుస్తారు. రక్త సంబంధాలు అతీతంగా వ్యవహరిస్తారు తప్పుని తీవ్రంగా ఖండిస్తారు.
మకరం
ఈ రాశి వారు ఈ రోజు కోపతాపాలకు దూరంగా ఉండండి. జీవిత భాగస్వామితో సఖ్యత కలిగి ఉంటారు. అన్ని విషయాల గురించి అవగాహన పెంచుకునే ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన పెట్టుబడులు నూతన ప్రయత్నాలు అంతంత మాత్రమే ఉంటాయి. మీ ఇష్టదేవుళ్లకు మహాతీర్ధం పొడితో అభిషేకం చేయడండి. పాల వ్యాపారస్తులకి నేల వ్యాపారస్తులకి చిన్న చిన్న వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది. స్నేహితుల ద్వారా నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు.
కుంభం
ఈ రాశి వారికి ఈ రోజు నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వివాహాది విషయ వ్యవహారాలు ముడిబడతాయి. నూతన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. వైద్యుణ్ని మార్చాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటన ఈ బొట్టును ధరించండి. శనీశ్వరాలయంలో తైలాభిషేకం జరిపించండి. నలుపు వత్తులతో, నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. వాహన విషయంలో, ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు.
మీనం
ఈ రాశి వారికి ఈ రోజు కోర్టు వ్యవహారాది తీర్పులు మిశ్రమంగా ఉంటాయి. ప్రయోజనాలు దక్కుతాయో లేదో అన్న ఆందోళన కలిగి ఉంటారు. కొన్ని సందర్భాలలో నిజాలు మాట్లాడుకోలేని పరిస్థితులు నెలకొంటాయి. మహా పాశుపత కంకణం ధరించండి. ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది, నూతన వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు ప్రయోజనకరంగా మారుతాయి. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి.
టాపిక్