Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల ఆర్థిక లాభాలు.. కష్టాలు తీరిపోయి సంతోషంగా ఉండొచ్చు
10 January 2025, 4:00 IST
- Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 10.01.2025 శుక్రవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల ఆర్థిక లాభాలు
రాశిఫలాలు (దిన ఫలాలు) : 10.01.2025
లేటెస్ట్ ఫోటోలు
Budhaditya Yoga: కుంభరాశిలో సూర్యుని రాక, బుద్ధాదిత్య రాజ యోగం- ఈ 4 రాశుల వారికి గోల్డెన్ డేస్ మొదలు, ఉద్యోగ అవకాశాలు!
Shani Transit: శని సంచారం, 2025లో డబ్బుల వర్షం కురుస్తుంది.. ఈ మూడు రాశుల వారికి సంతోషం
ఇక విజయానికి కేరాఫ్ అడ్రెస్ ఈ 3 రాశులు- డబ్బులే, డబ్బులు..
Guru Transit: మిథున రాశిలో గురువు సంచారం.. ఈ 3 రాశులకు అదృష్టం, ధనం, సంతోషంతో పాటు ఎన్నో
ఇక ఈ రాశుల వారికి డబ్బుకు లోటు ఉండదు! జీవితంలో అపార సంతోషం..
Rahu Transit: రాహువు కుంభ రాశి సంచారం.. ఈ రాశులకు ఆకస్మిక ధన లాభం, సంతోషంతో పాటు ఎన్నో
ఆయనము: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ
మాసం: పుష్యం, వారం : శుక్రవారం, తిథి : శు. ఏకాదశి, నక్షత్రం : కృతిక
మేషం
ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. తీసుకున్న ఋణములు భారమయ్యే అవకాశముంది. వాగ్వివాదములకు చోటులేకుండా జాగ్రత్తపడాలి.
వృషభం
అన్నదమ్ముల సహకారం ఉంటుంది. సుఖసంతోషాలకు లోటుండదు. ఆస్తుల విలువలు పెరగడం, రత్నములు మణులు మొదలగు వస్తువులను అమ్మివేయడం వలన ఆదాయం కల్గుతుంది. మిత్రులు బంధువులతో ఆశావహంగా గడుపుతారు.
మిథునం
ఇది ఆనందదాయకమైన, అదృష్టవంతమైన కాలం. మీ ప్రయత్నాలలో విజయం పొందుతారు. వ్యాజ్యాల విషయాల్లో కూడా ఉపశమనం కనిపిస్తుంది. మీ స్థితి మరియు సంపాదన కూడా మెరుగుపడుతుంది.
కర్కాటకం
సహోద్యోగులతో వివాదాలను ఉత్తమంగా తప్పించుకోవాలి. విద్యార్థుల ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. చదువు విషయంలో మరింత కృషి మరియు శ్రద్ధ అవసరం కావచ్చు. పెట్టుబడులకు సమయం కాదు.
సింహం
మీ తోబుట్టువులు మీతో మంచి సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు. మీకు మంచి సామాజిక జీవితం ఉంటుంది. మీరు సంగీతం, కళలు మొదలైన సృజనాత్మక విషయాలలో సమయాన్ని వెచ్చించే అవకాశం ఉంది.
కన్య
అధికారం, సమాజంలో ఉన్నత స్థానం లభిస్తుంది. భౌతికసుఖాలను, విలాసాలను అనుభవిస్తారు. మీరు కొత్త స్నేహితులను కూడా సంపాదించుకుంటారు మరియు ఆనందకరమైన జీవనశైలితో జీవనంలో ముందుకు సాగుతారు.
తుల
విద్యార్థులు నాయకత్వ లక్షణాలు పెంచుకుని, వక్తృత్వపు పోటీల్లోనూ, పోటీ పరీక్షల్లోనూ విజయం సాధిస్తారు. వ్యవసాయ దారులకు అధికదిగుబడుల వలన ఆదాయం, అన్ని వృత్తుల వారికి సమృద్ధి.
వృశ్చికం
ధనం నిల్వచేస్తారు. కళత్ర పుత్రులతో సుఖజీవనం. కుటుంబ వాతావరణం బాగుంటుంది. తోబుట్టువులతో సత్సంబంధాలు బాగుంటుంది.
ధనుస్సు
దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. మార్గావరోధాలు కల్గుతాయి. ఫ్లూ జ్వరాలు, కండరముల నొప్పులు వంటి ఆరోగ్య సమస్యల బారినపడే అవకాశం ఉంది.
మకరం
వ్యవసాయదారులకు కలసివచ్చే సమయం. శత్రువులపై జయం. వృత్తి ఉద్యోగాలలో గౌరవం, ఆర్థిక పరిపుష్టి, కుటుంబవృద్ధి అవుతుంది. వ్యాపారాలలో ముందంజ, ఆర్థికలాభాలు వస్తాయి.
కుంభం
అభివృద్ధి, లాభాలను పొందే శుభ తరుణం ఇది. ఈ కాలంలోనే ఉద్యోగ విషయంలో ఉన్నతి అంటే ప్రమోషన్, జీతం పెంపు కల్గుతుంది. కొత్త అవకాశాలను పొందుతారు.
మీనం
స్నేహితుల నుండి మద్దతు మరియు అన్ని ప్రయత్నాలలో విజయం పొందుతారు. సంపద వృద్ధిని సూచిస్తోంది. ఆర్థికసమస్యల నుండి బయటపడతారు. సమాజంలో మెరుగైన స్థానం మరియు ఆనందాన్ని అనుభవించే సమయం.
టాపిక్