తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారు కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు.. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి

Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారు కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు.. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి

HT Telugu Desk HT Telugu

Published Mar 21, 2025 04:00 AM IST

google News
    • Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 21.03.2025 శుక్రవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
నేటి రాశి ఫలాలు (freepik)

నేటి రాశి ఫలాలు

రాశిఫలాలు (దిన ఫలాలు) : 21.03.2025


లేటెస్ట్ ఫోటోలు

త్వరలో మిథున రాశిలో గురువు సంచారం, ఈ మూడు రాశులకు ఊహించని లాభాలు.. ధనం, సంతోషం, పురోగతితో పాటు ఎన్నో!

Apr 30, 2025, 10:37 AM

ఈ 4 రాశుల వారికి కనీవినీ ఎరుగని రీతిలో ధన లాభం, వ్యాపారంలో సక్సెస్​- కష్టాలు దూరం..

Apr 30, 2025, 05:37 AM

ఈ 5 రాశుల వారికి కనీవినీ ఎరుగని విధంగా అదృష్టం- ధన లాభంతో ఆర్థిక సమస్యలు దూరం!

Apr 29, 2025, 10:58 AM

ఈ 4 రాశుల వారికి కష్టకాలం- ఆర్థికంగా ఇబ్బందులు, జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది..

Apr 27, 2025, 05:33 AM

కష్టాల నుంచి ఈ 3 రాశులకు విముక్తి- కనీవినీ ఎరుగని విధంగా ధన లాభం, ఇక జీవితంలో సంతోషం..

Apr 26, 2025, 06:29 AM

ఈ రాశుల వారికి ఇక కష్టాలు దూరం- వాహన యోగం, వ్యాపారంలో విజయం!

Apr 25, 2025, 01:24 PM

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ

మాసం: ఫాల్గుణ, వారం : శుక్రవారం, తిథి : కృ. సప్తమి, నక్షత్రం : జ్యేష్ఠ

మేషరాశి

మేష రాశి వారు స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. భేషజాలకు పోవద్దు. పెద్దల సలహా తీసుకోండి. ఊహించని ఖర్చు ఎదురవుతుంది. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలు మొదలు పెడతారు. అవకాశాలు అందినట్టే అంది చేజారి పోతాయి. పట్టుదలతో అడుగు ముందుకేయండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఆశాజనకం. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఉన్నతి కొందరికి అపోహ కలిగిస్తుంది. వ్యాఖ్యలు, విమర్శలు పట్టించుకోవద్దు. మనోధైర్యమే మీకు బలాన్నిస్తుంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. కొత్త యత్నాలు మొదలెడతారు. మీ కృషిలో లోపం లేకుండా శ్రమించండి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు.

మిథున రాశి

ఆర్ధికలావాదేవీలు కొలిక్కి వస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆహ్వానం అందుకుంటారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. అందరితోనూ మితంగా సంభాషించండి. చేపట్టిన పనులు వాయిదా వేసుకుంటారు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. మనోధైర్యంతో ముందుకు సాగండి. పత్రాల్లో సవరణలు సాధ్యపడవు. శుభకార్యానికి హాజరవుతారు.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు సంతోషకరమైన వార్త వింటారు. మీ నిర్ణయం పిల్లల భవిష్యత్తుకు నాంది పలుకుతుంది. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు. మీ కృషి ఫలిస్తుంది. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. ఒక సంబంధం కలిసి వచ్చే సూచనలున్నాయి. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. పత్రాల రెన్యువల్, పన్ను చెల్లింపుల్లో తగదు. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.

సింహ రాశి

మీదైన రంగంలో ఒత్తిడికి గురికావద్దు. సింహ రాశి వారు సంయమనంతో సమస్యలు పరిష్కరించుకోవాలి. మీ మాటతీరు అదుపులో ఉంచుకోండి. ఓర్పు, పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం. పనుల్లో ఆటంకాలెదురైనా ఎట్టకేలకు పూర్తవుతాయి. ఆదాయం అంతంత మాత్రమే. దుబారా ఖర్చులు విపరీతం. ఆచితూచి అడుగేయండి. సన్నిహితుల సాయంతో సమస్య పరిష్కారమవుతుంది.

కన్య రాశి

కన్య రాశి వారికి అన్ని విధాలా అనుకూలమే. కార్యసిద్ధి, వ్యవహార జయం ఉన్నాయి. వివాహయత్నం ఫలిస్తుంది. బంధుత్వాలు బలపడతాయి. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. వస్త్ర ప్రాప్తి, వాహన సౌఖ్యం ఉన్నాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు పురమాయించవద్దు. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. స్థిర చరాస్తుల వ్యవహారంలో జాగ్రత్త. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు.

తుల రాశి

లక్ష్యసాధనకు ఓర్పు, కృషి ప్రధానం. ముఖ్యమైన పనుల్లో ఏకాగ్రత వహించండి. సాయం ఆశించవద్దు. ఓర్పు, స్వయంకృషితోనే కార్యం సాధ్యమవుతుంది. ఆదాయం సంతృప్తికరం, దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. మీ ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. పెట్టుబడులకు అనుకూలం. వ్యవహారాల్లో సముచిత నిర్ణయం తీసుకుంటారు.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారి కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. దృఢ సంకల్పంతో శ్రమించి లక్ష్యం సాదిస్తారు. పనులు వేగవంతమవుతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ఏకాగ్రతతో మెలగండి. వ్యవహార ఒప్పందాల్లో తొందర పాటు తగదు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. రావలసిన ధనం అందుతుంది. విలాసాలకు వ్యయం చేస్తారు.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం వృథా కాదు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. స్నేహసంబంధాలు బలపడతాయి. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. శుభకార్యం నిశ్చయమవుతుంది. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ వ్యాఖ్యలు వివాదాస్పదం కాకుండా చూసుకోండి. ఖర్చులు విపరీతం. కొత్త బాధ్యతలు చేపడతారు.

మకర రాశి

మకర రాశి వారు ఆర్థికంగా బాగున్నా మితంగా ఖర్చు చేయండి. ఆర్భాటాలకు పోవద్దు. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. పరిచయస్తులు ధన సహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. చేపట్టిన పనులపై శ్రద్ద వహించండి. మీ ఏమరు పాటు ఇబ్బందులకు దారితీస్తుంది. పట్టింపులకు పోవద్దు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. నోటీసులు అందుకుంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. పాత పరిచయస్తులను కలుసుకుంటారు.

కుంభ రాశి

కుంభ రాశి వారికి శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. మీదైన రంగంలో రాణిస్తారు. ఆవకాశాలు కలిసివస్తాయి. మాట తీరు ఆకట్టు కుంటుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. కొంత మొత్తం పొదుపు చేస్తారు. పనులు వేగవంతమవుతాయి. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఇంటి విషయాలు పట్టించుకోండి. కీలక పత్రాలు అందుకుంటారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి.

మీన రాశి

మీన రాశి వారి లక్ష్యసాధనకు పట్టుదల ప్రధానం. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహ పరుస్తాయి. ఓర్పుతో యత్నాలు కొనసాగిం చండి. సాయం ఆశించవద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు ఆస్కారం లేదు. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజ పరుస్తుంది. పనులు చురుకుగా సాగుతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ