మార్చి 13, నేటి రాశి ఫలాలు.. వీరికి ఏలినాటి శని ప్రభావం వల్ల ఖర్చులు అధికం, అప్పుల బాధలు
13 March 2024, 0:02 IST
Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 13.03.2024 బుధవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
మార్చి 13వ తేదీ నేటి రాశి ఫలాలు
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 13.03.2024
లేటెస్ట్ ఫోటోలు
వారం: బుధవారం, తిథి : తదియ,
నక్షత్రం : అళ్విని, మాసం : ఫాల్గుణం,
సంవత్సరం: శోభకృత్ నామ, అయనం: ఉత్తరాయణం
మేష రాశి
మేష రాశి వారికి ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు ఇది కలసి వచ్చే రోజు. లాభస్థానములో బుధ, గురు, శని ప్రభావం వలన పనులయందు లాభము, జయము కలుగును. దశమ స్థానములో కుజ, శుక్రుల అనుకూలత వలన ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలుంటాయి. చంద్రుడు అనుకూల సంచారం వలన అనుకున్న ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. పనిలో ఒత్తిడి ఇబ్బందిపెట్టును. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు కలుగును. జన్మగురుని ప్రభావం వలన కొంత ఒత్తిడి ఏర్పడే సూచన. విష్ణు సహస్రనామం పారాయణం చేయడం మంచిది. మహావిష్ణువు ఆలయాన్ని దర్శించడం మంచిది.
వృషభ రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశివారికి ఈరోజు అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి అనుకూలించును. వ్యయస్థానములో గురుని ప్రభావం ఖర్చులు అధికముగా ఉండును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. లాభస్థానములో రాహువు ప్రభావం వలన పనులయందు పట్టు ఏర్పడును. దశమంలో రవి, బుధ, శని అనుకూలత వలన ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగును. విద్యార్థులకు అనుకూలమైనటువంటి రోజు. వ్యాపారస్థులకు ఖర్చులతో కూడినటువంటి సమయం. కృష్ణుడి ఆలయాలు దర్శించటం మంచిది. కృష్ణాష్టకం పఠించాలి.
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. లాభములో గురుడు, దశమంలో రాహువు ప్రభావంచేత వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో కొంత భయాందోళనలు కలుగు సూచన. వ్యాపారస్తులకు అనుకూల సమయం. కుటుంబ విషయాలు, ఆరోగ్య విషయాలపరంగా అష్టమ కుజ, శుక్రల ప్రభావంచేత మధ్యస్థ ఫలితాలు ఏర్పడుతున్నాయి. విద్యార్థులకు ఈరోజు కలిసివచ్చును. శ్రీమన్నారయణుడు/ శ్రీమహావిష్ణువుకు సంబంధించిన ఆలయాన్ని దర్శించడం మంచిది. విష్ణుమూర్తి అలయాలలో అర్చన జరిపించుకోవాలి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. భాగ్యములో రాహువు, దశమంలో గురుని ప్రభావం వలన ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళు అధికంగా ఉండును. వ్యాపారస్తులకు కొంత కష్టకాలం. ఆయుస్థానమైనటువంటి అష్టమ స్థానములో రవి, బుధ, శనుల ప్రభావం వలన ఈ రాశివారికి ఆరోగ్య సమస్యలు, వృత్తి సమస్యలు, కుటుంబ సమస్యలు. విద్యార్థులకు ఈరోజు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబ విషయాలు, ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. రామాలయాలను దర్శించండి. రామకోటి వంటివి రాయటం మంచిది. తారకమంత్రం పఠించండి.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో వాదనలకు దూరంగా ఉండండి. శత్రు స్థానములో శుక్ర, కుజుల అనుకూలత వలన శత్రువర్గంపై విజయాన్ని పొందెదరు. కోర్టు వ్యవహారాలు అనుకూలించును. వాక్ స్థానములో కేతువు అష్టమ రాహువు ప్రభావం వలన గొడవలకు, ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలని సూచన. ఉద్యోగస్తులకు భాగ్యములో గురుని అనుకూల ప్రభావం వలన మధ్యస్థంనుండి అనుకూల ఫలితాలు ఏర్పడుతున్నాయి. సూర్య నమస్కారం చేయటం మంచిది. గురు దక్షిణామూర్తిని పూజించండి.
కన్యా రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. అష్టమ గురుని ప్రభావంచేత ఆరోగ్య విషయాల యందు జా(గ్రత్తలు వహించడం మంచిది. గత కొంత కాలంతో పోల్చుకుంటే శుభ ఫలితాలను ఇచ్చేటటువంటి రోజు. ప్రయాణాల కోసం చేసే ప్రయత్నాలు ఫలించును. మానసికంగా ప్రశాంతంగా ఉండెదరు. పంచమంలో కుజ శుక్రుల అనుకూలత వలన వీరు చేసే ప్రయత్నాలు ఫలించును. ధనలాభము, కీర్తి కలుగును. జన్మరాహువు, కళత్ర కేతువు ప్రభావంచేత పనులు, ప్రయాణాల్లో ఒత్తిళ్ళు ఏర్పడును. మీరు చేసే ప్రయత్నాలన్నీ సత్ఫలితాలు ఇచ్చే సూచనలు అధికముగా ఉన్నాయి. ఆదిత్య హృదయం పారాయణం చేయండి. విష్ణుమూర్తి అష్టోత్తర నామాలను పఠించండి.
తులా రాశి
తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉన్నది. కుటుంబ సౌఖ్యం, ఆనందం పొందెదరు. పంచమంలో రవి, బుధ, శనుల ప్రభావం వలన నిర్ధిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్ళి విజయాలను పొందుతారు. ఆర్థిక సమస్యల నుండి బయటపడెదరు. కళత్రంలో గురుని అనుకూలత, ఆరో స్థానంలో రాహువు అనుకూలత వలన ఉద్యోగస్తులకు సత్ఫలితాలు కలుగును. విద్యార్థులకు శుభఫలితాలు ఏర్పడును. తులారాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయాలి. మహావిష్ణువు అష్టోత్తర శతనామావళి పఠించండి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు పనులయందు ఒత్తిళ్ళు కొంత అధికముగా ఉండును. వ్యాపారస్తులకు మధ్యస్థ సమయం. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో పురోగతి లభించును. మాతృస్థానములో కుజ, శుక్రుల ప్రభావంచేత బంధుమిత్రులతో సోదరీమణులతో అనందముగా గడిపెదరు. చతుర్ధంలో రవి, బుధ, శని ప్రభావంచేత శారరీక శ్రమ కలుగును. ప్రయాణాల కోసం ప్రణాళికలు రచించెదరు. విద్యార్థులకు మధ్యస్థ ఫలితాలు ఏర్పడును. గణపతి అష్టోత్తరం పఠించాలి. వినాయకుని ఆలయాన్ని దర్శించాలి.
ధనూ రాశి
ధనూరాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. పంచమ స్థానములో గురుని అనుకూలత వలన కుటుంబ సౌఖ్యం, సంతాన సౌఖ్యం, ఆనందము పొందెదరు. ఉద్యోగస్తులకు అనుకూలమైన రోజు. వ్యాపారస్తులకు శుభ ఫలితాలు కలుగును. విద్యార్థులకు ఈరోజు కలసివచ్చును. ధనస్థానములో కుజ, శుక్రుల ప్రభావంచేత ధనలాభం, సౌఖ్యం కలుగును. గొడవలకు దూరంగా ఉండాలని సూచన. మాతృ వర్గీయులతో స్నేహము అధికమగును. కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా గడిపెదరు. ధనూరాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం వినాయకుని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించాలి.
మకర రాశి
మకర రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు ఈరోజు పని ఒత్తిళ్ళు, చికాకులు అధికముగా ఉండును. వ్యాపారస్థులకు అంత అనుకూలంగా లేదు. ఖర్చులు నియంత్రిచుకోవాలని సూచన. ఆరోగ్య సమస్యలు వేధించును. ఏలినాటి శని ప్రభావంచేత శారీరక సమస్యలు, మానసిక వేదన అధికముగా ఉండును. అరోగ్య విషయాల్లో శ్రద్ద వహించడం మంచిది. వాక్ స్థానములో రవి, బుధ, శనులు ప్రభావం వలన వాదనలకు దూరంగా ఉండాలని సూచన. మకర రాశి వాళ్ళు మరింత శుభఫలితాలు పొందటం కోసం విష్ణు సహస్రనామం పారాయణం చేయడం మంచిది. మహావిష్ణువు ఆలయాన్ని దర్భ్శిచండం మంచిది.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈరోజు మీకు ఒత్తిళ్ళతో కూడియున్నటువంటి రోజు. వ్యయస్థానములో కుజ, శుక్రుల ప్రభావం వలన ఖర్చులు అధికమగును. అప్పు చేయవద్దు, ఇవ్వవద్దు అని సూచన. ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయం. వ్యాపారస్తులకు కష్టకాలం. కుంభరాశి జన్మరాశిలో రవి, బుధుల ప్రభావంచేత పనులయందు ఒత్తిళ్ళు, చికాకులు అధికమగును. పనులయందు ఆలస్యము, బద్దకం వంటివి ఏర్పడును. ఆరోగ్య విషయాలయందు శ్రద్ధ వహించాలి. వాక్ స్థానములో రాహువు, తృతీయ స్థానములో గురుని ప్రభావం వలన అనవసర మాటలు పడే స్థితి ఏర్పడును. విద్యార్థులకు మధ్యస్థ సమయం. ఆదిత్య హృదయం పారాయణం చేయండి. విష్ణుమూర్తి అష్టోత్తర నామాలను పఠించండి.
మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. లాభస్థానములో కుజ, శుక్రుల ప్రభావం వలన కుటుంబ సౌఖ్యం, శారీరక సౌఖ్యం, ఆనందం పొందెదరు. వ్యయస్థానములో రవి, బుధ, శనుల ప్రభావంచేత ఏలినాటి శని ప్రభావం వలన ఖర్చులు, అప్పుల బాధ పెరుగు సూచన. ఎవ్వరికీ అప్పు ఇవ్వద్దు అని సూచన. నూతన వ్యాపారం, స్పెక్యులేషన్, పెట్టుబడులకు అనుకూలంగా లేదు. జన్మరాహువు ప్రభావం వలన ఆరోగ్య సమస్యలు, పనిలో ఒత్తిళ్ళు కలుగు సూచన. బృహస్పతి అనుకూల ప్రభావం చేత ధనలాభం కలుగును. రామాలయాలను దర్శించండి. రామకోటి వంటివి రాయటం మంచిది. తారకమంత్రం పరించండి.
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
మొబైల్ : 9494981000