తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  జులై 24, నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వాళ్ళు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి

జులై 24, నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వాళ్ళు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి

HT Telugu Desk HT Telugu

Published Jul 24, 2024 12:01 AM IST

google News
  • Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 24.07.2024 బుధవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

జులై 24 నేటి రాశి ఫలాలు

జులై 24 నేటి రాశి ఫలాలు

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 24.07.2024

లేటెస్ట్ ఫోటోలు

ఈ 3 రాశుల వారిపై కాసుల వర్షం! ఆర్థిక కష్టాలు దూరం, అన్ని విజయాలే..

Mar 23, 2025, 09:04 AM

Guru Transit: గురు సంచారంతో కుబేర యోగం.. ఈ 3 రాశులకు డబ్బే డబ్బు

Mar 22, 2025, 09:44 AM

ఈ 3 రాశుల వారికి ఆకస్మిక ధన లాభం! ఉద్యోగంలో ప్రమోషన్​, ఇక అన్ని కష్టాలు దూరం..

Mar 21, 2025, 06:00 AM

Venus Transit: శుక్రుడు సంచారంలో మార్పు.. ఈ మూడు రాశులకు అదృష్టం, ధన లాభంతో పాటు ఎన్నో

Mar 20, 2025, 08:21 AM

మీన రాశిలోకి శని.. ఈ 3 రాశుల వారికి బలం, బలహీనతలు, అసలు నిజాలు తెలిసే సమయం!

Mar 18, 2025, 05:33 AM

ఈ రాశుల వారికి ఇక తిరుగుండదు! డబ్బుకు డబ్బు, జీవితంలో సంతోషం- ప్రశాంతత..

Mar 17, 2025, 05:56 AM

వారం: బుధ‌వారం, తిథి : త‌దియ‌,

నక్షత్రం: శ‌త‌భిషం, మాసం: ఆషాఢ‌ము,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: ద‌క్షిణాయ‌నం

మేష రాశి

ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు పాటించండి. ఆరోగ్య‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్ర‌త్తలు అవస‌రం. దూర ప్ర‌యాణాల‌కు దూరంగా ఉండండి. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల ఫలితాలు సాధిస్తారు. వ్యాపారస్తులు మెలకువతో వ్యవహరించాలి. పెట్టుబ‌డుల విష‌యంలో పెద్ద‌ల స‌ల‌హాలు తీసుకోండి.

వృషభ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశి వారికి నూత‌న వ్య‌క్తుల‌తో ప‌రిచ‌యాలు ఏర్ప‌డ‌తాయి. త‌ద్వారా పాత స‌మ‌స్య‌లు కొత్త‌గా క‌నిపిస్తాయి. మీ స‌హ‌నానికి ఇది ప‌రీక్షా కాల‌మేన‌ని చెప్పాలి. ఆర్థిక స్థితిలో ఇబ్బందులేమీ ఉండ‌వు. ఆత్మీయుల‌తో సంతోషంగా గ‌డుపుతారు.

మిథున రాశి

దైవ సంబంధిత, సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కారణం లేని చికాకుల వల్ల ప్రశాంతత కోల్పోతారు. సమయోచితంగా వ్యవహరించి మీకు రావలసిన సొమ్ము రాబట్టుకుంటారు. చెల్లింపులను కూడా సకాలంలో చెల్లిస్తారు. మాట మీద నిలబడే వ్యక్తిగా పేరు సంపాదిస్తారు.

కర్కాటక రాశి

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ బాధ్యతలు నెరవేర్చడంలో క్రమబద్ధమైన ప్రణాళికలు రూపొందించుకుంటారు. వాయిదా పడుతున్న వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇంట్లో, వ్యాపార ప్రదేశాల్లో సాంబ్రాణి, దైవికం పొడితో దూపం వేయడం మంచిది, నరదృష్టి తొలగిపోతుంది. మీ మాట తీరుతో స‌మ‌స్య‌లు చ‌క్క‌బెడ‌తారు.

సింహ రాశి

ద‌యా హృదయంతో వ్యవహరిస్తారు. అందరి పట్ల సమన్యాయం కనబరుస్తారు. మంచి వ్యక్తిగా స‌మాజంలో గుర్తింపు పొందుతారు. రాజకీయ రంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కీలక విషయాలపై చర్చిస్తారు. ముఖ్య‌మైన‌ వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్తలు పాటించండి.

కన్యా రాశి

క్రీడాకారులు మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యాపారపరంగా తీసుకునే నిర్ణయాలు స‌ఫలీకృత‌మ‌వుతాయి . ఆత్మీయుల‌ సలహాలు పాటిస్తారు. కీల‌క విష‌యాల్లో మీ అభిప్రాయాలతో పెద్దలు కూడా ఏకీభవిస్తారు. అవకాశాలు కలిసి వస్తాయి.

తులా రాశి

సొంత నిర్ణయాలు తీసుకుంటారు. స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌వుతాయి. కొన్ని విషయాలు కలిసి వస్తాయి. వాహన యోగం ఉంది. నిత్యావసర ధరలు, ఖర్చులు ఆలోచింపచేస్తాయి. దేవాలయాలు సందర్శిస్తారు. ఆరోగ్య సలహాలు, సూచనలు పాటించండి. వినోద కార్య‌క్ర‌మాల్లో స‌ర‌దాగా గ‌డుపుతారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.

వృశ్చిక రాశి

గ‌తంతో పోలిస్తే వృశ్చిక రాశికి ఇప్పుడు కాస్త క‌లిసి వ‌చ్చే స‌మ‌యం. బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది. పక్షులకి నీళ్లు పెట్టండి. సిద్ధ గంధంతో శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి అర్చన జరిపించండి. శుభవార్తలు వింటారు.

ధనుస్సు రాశి

పార్ట్ టైం ఉద్యోగం సంపాదిస్తారు. ఆశించిన రుణాలు సకాలంలో అందుకుంటారు. ప్రతి విషయాన్నీ స్ఫూర్తిగా తీసుకుంటారు. పక్షులకు దాన వేయడం మంచిది. సుమంగళి పసుపుతో అష్టోత్తరం చదువుతూ గౌరీదేవిని అర్చించడం శుభదాయకం.

మకర రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మకర రాశి వాళ్ళు ఈరోజు ఆరోగ్యప‌ర‌మైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కీల‌క విష‌యాల ప‌ట్ల ఆత్మీయుల‌తో చ‌ర్చిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థికస్థితి మెరుగ‌వుతుంది. పక్షులకి దాన వేయండి. అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటారు. అరటినార వత్తులు, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి.

కుంభ రాశి

చెల్లింపుల విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ముఖ్య విష‌యాల్లో ఇత‌రుల స‌ల‌హా తీసుకోకండి. మూగ జీవాల‌కు నీళ్లు పెట్టండి. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఆత్మీయుల‌తో ఆనందంగా గ‌డుపుతారు.

మీన రాశి

ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబ సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు. కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. గోమతి చక్రాలతో లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుతూ అమ్మవారికి పూజ చేయండి. జీవిత భాగస్వామితో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి. ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
తదుపరి వ్యాసం