Vivaha Yoga: 2025లో వివాహం చేసుకోబోతున్న నాలుగు రాశులు ఇవే! ఇందులో మీ రాశి ఉందేమో చూడండి
07 December 2024, 16:00 IST
Vivaha Yoga: ప్రతి ఒక్కరూ కొత్త కలలు, కొత్త లక్ష్యాలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా పెళ్లి కాని వారు కొత్త ఏడాదిపైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. 2025 లో ఏ రాశి వారికి వివాహం జరుగుతుంది? పెళ్లి కోసం వీళ్లు ఇంకా ఎన్ని రోజులు వేచి చూడాలి? తెలుసుకుందాం.
2025లో వివాహం చేసుకోబోతున్న ఐదు రాశులు
వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన దశ. ఇది ఒక శుభకార్యం. వివాహం కేవలం ఇద్దరు వ్యక్తలను మాత్రమే కాదు రెండు కుటుంబాలను ఏకం చేస్తుంది, రెండు మనస్సులను ఏకం చేస్తుంది. వధూవరులు ఇద్దరూ జీవితాంతం కష్టసుఖాల్లో కలిసి ఉంటామని ఒకరికొకరు వాగ్దానం చేసుకునే శుభ సమయం. అయితే పెళ్లి అనేది ప్రతి ఒక్కరూ సరైన వయస్సులో జరగదు. ఇందుకు వారి కుటుంబ నేపథ్యం, ఆర్థిక పరిస్థితులతో పాటు జాతకంలోని కొన్ని లోపాలు కూడా అయి ఉండచ్చు.
లేటెస్ట్ ఫోటోలు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వివాహానికి బృహస్పతి అంటే గురుగ్రహ అనుకూలత ఉండాలి. శుక్రుడు కూడా ప్రేమకు సహకరించాలి. అప్పుడు వివాహం. విజయవంతమైన వైవాహిక జీవితం పొందడం సాధ్యమవుతుంది. 2024లో వివాహం కోసం ఎదురుచూసిన చాలా మంది నిరాశ చెందారు. ఇందుకు గ్రహాల కదలికలు చాలా దోహదపడ్డాయి. అయితే 2025 మాత్రం వధూవరులకు ఉపశమనం కలిగించనుంది. ఈ ఏడాది గ్రహాల సంచారాన్ని బట్టి చూస్తే కొన్ని రాశుల వారికి అన్ని విధాలా కలిసొస్తుంది. వివాహం కుదరని వాళ్లకు, కుదిరిన తర్వాత నిశ్చతార్థం అయిన వారికీ, వివాహం కావాల్సిన వారికి అందరికీ కొత్త ఏడాది శుభ ఫలితాలను ఇవ్వనుంది. 2025లో ఏ రాశివారు నిశ్చితార్థం చేసుకుంటారు? ఏ రాశి వారు వివాహం చేసుకుంటారు? తెలుసుకుందాం రండి..
2025లో వివాహ యోగం కలిగిన రాశులేవి?
సింహ రాశి:
సింహ రాశి వారికి వివాహం చేసుకునేందుకు 2025 సంవ్సతరం చాలా మంచి సమయం. 2025లో మే నెల మధ్యలో పెళ్లి చేసుకుంటే వైవాహిక జీవితం సంతోషంతో నిండుతుంది. వివాహం కుదరని వారికి మంచి సంబంధం దొరుకుతుంది. సంబంధం దొరికి నిశ్చితార్థం లేదా వివాహం చేసుకోవాలనుకునే వారికి కూడా ఇది ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి కూడా ఈ సంవత్సరం బాగా కలిసొస్తుంది.
కన్యా రాశి:
వివాహం విషయంలో కన్యా రాశి వారికి సంవత్సరం ప్రథమార్ధం చాలా మంచిది. కన్యా రాశి జాతకంలో గురుగ్రహం శుభ స్థానంలో ఉంది. ఈ రాశి వారి పూర్వజన్మల కర్మల ఆధారంగా జీవిత భాగస్వామిని పొందుతారు. అయితే మే తర్వాత వివాహం చేసుకోకపోవడమే మంచిది.
తులా రాశి:
తులా రాశి వారికి సంవత్సరంలో మొదటి నెలలు బలహీనంగా ఉంటాయి. దీనివల్ల వివాహం లేదా నిశ్చితార్థంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ కాలంలో వివాహానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోకండి. అయితే వివాహం చేసుకోవాలనుకునే వ్యక్తులకు సంవత్సరం ద్వితీయార్ధం అనుకూల ఫలితాలను ఇస్తుంది.అంటే మే నెల తర్వాత నిశ్చితార్థం, వివాహాలకు అనువైనది.
వృశ్చిక రాశి:
వివాహానికి వృశ్చిక రాశి వారికి 2025 ప్రథమార్ధం చాలా శుభదాయకం. 2025 మే మధ్య వరకు మీ ప్రయత్నాలు సఫలమవుతాయి.పెళ్లి చేసుకోవాలనే కోరికను తీర్చడంలో బృహస్పతి మీకు అనుకూలంగా ఉండి సహాయపడుతుంది. ప్రేమలో ఉన్నవారికి ఇది మంచి సమయం. మీ ప్రేమ గురించి ఇంట్లో చెబితే అది విజయవంతమవుతుంది. అయితే 2025 మే తర్వాత నిశ్చితార్థం, వివాహానికి సంబంధించిన శుభకార్యాలకు దూరంగా ఉండటమే మంచిది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.