తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Sun Transit: ఈ రాశుల వారి దశ తిరగనుంది.. రేపటి నుంచి వీరికి ధనమే ధనం!

Sun Transit: ఈ రాశుల వారి దశ తిరగనుంది.. రేపటి నుంచి వీరికి ధనమే ధనం!

Ramya Sri Marka HT Telugu

14 December 2024, 13:10 IST

google News
    • Sun Transit: గ్రహాల అధిపతి సూర్యభగవానుడి సంచారంలో మార్పు అన్ని రాశులపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. డిసెంబర్ 15 అంటే రేపు సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇది కొన్ని రాశులవ వారికి చాలా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఈ రాశి చక్ర గుర్తులు ఏవో ఇక్కడ తెలుసుకుందాం.
ధనస్సు రాశిలో సూర్యుడి సంచారం .. ఈ రాశుల వారికి అదృష్టం
ధనస్సు రాశిలో సూర్యుడి సంచారం .. ఈ రాశుల వారికి అదృష్టం

ధనస్సు రాశిలో సూర్యుడి సంచారం .. ఈ రాశుల వారికి అదృష్టం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యభగవానుడు తొమ్మిది గ్రహాలకు అధిపతి. అతను నెలకొకసారి తన స్థానాన్ని మార్చగలడు. సూర్యభగవానుడి సంచారం ఖచ్చితంగా అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది. తొమ్మిది గ్రహాలలో సూర్యభగవానుడు అత్యంత శక్తివంతమైన గ్రహం. అతను సింహ రాశికి అధిపతి. సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారినప్పుడు అది అన్ని రాశిచక్ర గుర్తులపై ప్రభావం చూపిస్తుంది.

లేటెస్ట్ ఫోటోలు

Love Zodiac signs: ఈ రాశులు వారు ఎవరినైనా ప్రేమలో పడేస్తారు.. సులువుగా ఆకట్టుకుని సంబంధాలను పెంపొందించుకుంటారు

Dec 14, 2024, 09:13 AM

Dreams Come True: మీ కలలు నిజమవ్వడానికి మీకు సహాయపడే నాలుగు రాశి చిహ్నాలు

Dec 14, 2024, 08:19 AM

Love Rasis: ఈ రాశుల్లో జన్మించినవారు ఇతరులను అయస్కాంతంలా ఆకర్షిస్తారు

Dec 14, 2024, 06:00 AM

ఈ రాశుల వారికి త్వరలో అదృష్ట కాలం.. సంతోషం, విజయాలు, ధనయోగం!

Dec 13, 2024, 10:31 PM

Lovable Zodiac Signs: ఈ రాశి వారికి ప్రేమ, ఆకర్షణా శక్తి ఎక్కువ.. వీళ్లను ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు

Dec 13, 2024, 05:41 PM

Shani: శని తిరోగమనంతో ఈ రాశుల వారి కష్టాలు తీరుతాయి.. ఉద్యోగాలు, ప్రమోషన్లు వచ్చే అవకాశం

Dec 13, 2024, 12:16 PM

సూర్యభగవానుడు డిసెంబర్ 15న అంటే రేపు ధనుస్సు రాశికి ప్రవేశిస్తాడు. ఈ ఏడాది సూర్యభగవానుడి చివరి సంచారం ఇదే. సూర్యభగవానుడి ధనుస్సు రాశి సంచారం ఖచ్చితంగా అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది.అయితే కొన్ని రాశుల వారికి దీని ద్వారా రాజయోగం లభిస్తుంది. ఆ రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి:

సూర్య భగవానుడి ధనుస్సు రాశి సంచారం మేష రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. వ్యక్తిగత జీవితంలో సంతోషం ఉంటుంది. మీ నైపుణ్యాలలో మంచి మెరుగుదల ఉంటుంది. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. నూతన మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందుతారు. మీ వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో పురోగతి సాధించే పరిస్థితులు ఉంటాయి. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. మీ జీవితంలో ఇప్పటివరకు ఉన్న సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. మీరు పనిచేసే చోట పదోన్నతి, వేతన పెంపును పొందవచ్చు. సహోద్యోగులు మీకు అనుకూలంగా పనిచేస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుంది. ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యంలో మంచి మెరుగుదల ఉంటుంది. స్నేహితులు మీకు సహాయం చేస్తారు.

సింహ రాశి:

ఈ రాశి వారికి సూర్యభగవానుడు ధనస్సు రాశి సంచారం శుభఫలితాలను ఇస్తుంది. ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. ఇతరుల నుండి మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. జీవితంలో అనేక రకాలుగా పురోభివృద్ధి ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుంది. ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది. మీరు పనిచేసే చోట పదోన్నతి, వేతన పెంపును పొందవచ్చు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉన్నతాధికారులు మీకు అనుకూలంగా పనిచేస్తారు. ఆరోగ్యంలో మంచి మెరుగుదల ఉంటుంది.

ధనుస్సు రాశి:

ధనస్సు రాశిలోకి సూర్యుడు రేపు ప్రవేశించబోతున్నాడు. కనుక రేపటి నుంచి వీరు వ్యక్తిగత జీవితంలో ఆనందం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి.సవాళ్లను ఎదుర్కొనే అవకాశాలు లభిస్తాయి.పెండింగ్ పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా లాభాలు పొందే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. వైవాహిక జీవితంలో సమస్యలు క్రమంగా తగ్గుతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. విదేశాల్లో ఉన్నవారికి యోగా లభిస్తుంది. విదేశాలకు వెళ్లే అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్యంలో మంచి మెరుగుదల ఉంటుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు మీకు రెట్టింపు లాభాలను ఇస్తాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

తదుపరి వ్యాసం