తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Shattila Ekadashi: షటిలఏకాదశి ఈ మూడు రాశుల వారిని ధనవంతులను చేస్తుంది

Shattila ekadashi: షటిలఏకాదశి ఈ మూడు రాశుల వారిని ధనవంతులను చేస్తుంది

Gunti Soundarya HT Telugu

Published Feb 05, 2024 01:20 PM IST

google News
    • Shattila ekadashi: మాఘ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని షటిల ఏకాదశి అంటారు. దీనినే షట్‌తిల ఏకాదశి అంటారు. ఫిబ్రవరి 6న షటిల ఏకాదశి వచ్చింది. ఈరోజు కొన్ని రాశుల వారికి శుభ యోగం ఇవ్వడంతో పాటు ధనలాభం కలిగించబోతుంది. 
షటిల ఏకాదశి 2024

షటిల ఏకాదశి 2024

Shattila ekadashi 2024: సంవత్సరంలో వచ్చే ప్రతి ఏకాదశికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. ఫిబ్రవరి నెల మాఘ మాసంలో వచ్చే ఏకాదశిని షటిల ఏకాదశి అని అంటారు. ఫిబ్రవరి 6వ తేదీన ఈ ఏకాదశి వచ్చింది. దీన్నే పాపహాని ఏకాదశి, తిల్ద ఏకాదశి అని కూడా పిలుస్తారు. విష్ణుమూర్తిని పూజిస్తారు. ఈరోజు నువ్వులకు అధిక ప్రాముఖ్యత ఇస్తారు.

లేటెస్ట్ ఫోటోలు

ఇక ఈ రాశుల వారి కష్టాలు దూరం! ఆకస్మిక ధన లాభంతో, అంతా సంతోషమే..

Mar 25, 2025, 01:43 PM

ఈ రాశుల వారికి అదృష్టకాలం రాబోతోంది.. అనుకూలమైన పరిస్థితులు, ధనలాభాలు!

Mar 24, 2025, 08:06 PM

ఆశలు వదులుకోకండి.. ఈ రాశుల వారికి ఇక అన్ని విజయాలే! వ్యాపారంలో లాభాలు- దాంపత్య జీవితంలో సంతోషం

Mar 24, 2025, 04:48 PM

ఈ 3 రాశుల వారిపై కాసుల వర్షం! ఆర్థిక కష్టాలు దూరం, అన్ని విజయాలే..

Mar 23, 2025, 09:04 AM

Guru Transit: గురు సంచారంతో కుబేర యోగం.. ఈ 3 రాశులకు డబ్బే డబ్బు

Mar 22, 2025, 09:44 AM

ఈ 3 రాశుల వారికి ఆకస్మిక ధన లాభం! ఉద్యోగంలో ప్రమోషన్​, ఇక అన్ని కష్టాలు దూరం..

Mar 21, 2025, 06:00 AM

షటిల ఏకాదశి రోజు ఉపవాసం ఉంది విష్ణు మూర్తిని పూజించడం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరి పాపాలు నశిస్తాయని, దుఖం, పేదరికం నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈరోజు నువ్వులు లేదా నువ్వులతో చేసిన వంటకాన్ని పంచి పెట్టడం వల్ల పుణ్యం దక్కుతుంది. షటిల ఏకాదశి రోజు విష్ణు మూర్తిని పూజించడం వల్ల లక్ష్మీ దేవి ప్రత్యేక అనుగ్రహం కూడా పొందుతారు. ఈరోజు అనేక శుభ యోగాలు కూడా ఏర్పడుతున్నాయి. షటిల ఏకాదశిని పాటించే వారికి సంపద, ఆరోగ్యం లభిస్తుంది.

షటిల ఏకాదశి కొన్ని రాశుల వారికి అదృష్టం తీసుకురాబోతుంది. ఈరోజు ఏర్పడబోయే శుభ యోగం, హర్ష యోగం వల్ల మూడు రాశుల వారికి శుభ ప్రయోజనాలు కలగబోతున్నాయి. ఆ రాశులు ఏవంటే..

మిథున రాశి

షటిల ఏకాదశి నాడు ఏర్పడే శుభ యోగం మిథున రాశి వారికి మంచి ఫలితాలు ఇవ్వబోతుంది. వీరికి సంపద పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోభివృద్దికి అనేక అవకాశాలు ఉన్నాయి. వృత్తిలో విజయం సాధిస్తారు. అన్ని బాధల నుంచి విముక్తి పొందుతారు.

సింహ రాశి

లక్ష్మీదేవి అనుగ్రహంతో సింహ రాశి వారికి అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది. వ్యాపార పరిస్థితి మెరుగుపడుతుంది. వస్తు సంపద పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వృత్తి జీవితంలో పురోగతికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.

తులా రాశి

తులా రాశి వారికి షటిల ఏకాదశి ఎంతో పవిత్రమైనది. విష్ణువు అనుగ్రహంతో వైవాహిక జీవితంలో వచ్చే సమస్యలు తొలగిపోతాయి. పెళ్లి కానీ వారికి ఈ సమయంలో పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవచ్చు. నిలిచిపోయిన పనులు కొనసాగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఇది తులా రాశి వారికి శుభ సమయం. కొత్త పనులు ప్రారంభించాలని అనుకుంటే ఈ సమయం అనుకూలంగా ఉంది.

నువ్వులు దానం చేయాలి

ఈరోజు నువ్వులు దానం చేయడం వల్ల గత జన్మలో చేసిన పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. నువ్వులని నీటిలో కలిపి సమర్పించడం వల్ల చనిపోయిన పూర్వీకుల ఆత్మలకు శాంతి చేకూరుతుంది. ఈరోజు నువ్వులు ఉపయోగించడం మంచిది. నీటిలో నానబెట్టి వాటితో స్నానం చేయవచ్చు.

అలాగే పవిత్ర హవనం లేదా అగ్ని కార్యక్రమంలో వినియోగించవచ్చు. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు నువ్వులు నీటిలో వేసుకోవచ్చు. నువ్వులు దానం ఇవ్వాలి. వంటకాలలో నువ్వులు వేసి వంట చేసుకోవచ్చు. హిందూ పురాణాల ప్రకారం ఈ ఏకాదశి పాటించిన వారికి విష్ణు మూర్తి మోక్షం ప్రసాదిస్తాడని నమ్ముతారు.

తదుపరి వ్యాసం