తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఈ నాలుగు రాశుల వారికి కష్టాల కాలం రాబోతుంది- ఐదు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి

ఈ నాలుగు రాశుల వారికి కష్టాల కాలం రాబోతుంది- ఐదు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి

Gunti Soundarya HT Telugu

12 November 2024, 9:09 IST

google News
    • శని ప్రత్యక్ష సంచారం వల్ల నాలుగు రాశుల వారికి కష్టాల కాలం మరో మూడు రోజుల్లో రాబోతుంది. రానున్న ఐదు నెలల పాటు అన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు, నష్టాలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అలాగే ఉద్యోగంలోనూ అనుకున్న పనులు జరగకపోవడం వల్ల తీవ్ర నిరాశ చెందుతారు. 
నాలుగు రాశులకు కష్టాల కాలం
నాలుగు రాశులకు కష్టాల కాలం

నాలుగు రాశులకు కష్టాల కాలం

నవంబర్ 15 నుంచి శని కుంభ రాశిలో ప్రత్యక్ష మారంలో సంచరించబోతున్నాడు. నవగ్రహాలలో శని ప్రభావం చాలా శక్తివంతంగా ఉంటుంది. ఇప్పటి వరకు తిరోగమనంలో ఉన్న శని ప్రత్యక్ష మార్గంలోకి రావడం వల్ల నాలుగు రాశుల వారికి అనేక ఇబ్బందులు కలుగబోతున్నాయి.

లేటెస్ట్ ఫోటోలు

ఈ రెండు గ్రహాల కలయికతో వీరి జీవితంలో వెలుగులు.. 2025లో లక్కుతో లైఫ్‌లో గొప్ప అవకాశాలు!

Dec 08, 2024, 10:30 PM

ఈ రాశుల యువతులకు 2025లో పెళ్లి ఖాయం! మీ రాశి కూడా ఇందులో ఉందేమో చూసుకోండి అమ్మాయిలూ!

Dec 08, 2024, 07:13 PM

బుధుడి సంచారంతో వీరికి కలిసి రానున్న కాలం.. ఆర్థిక లాభాలతోపాటుగా అదృష్టం!

Dec 08, 2024, 05:19 PM

ఇతరులు ఈర్షపడేలా వీరి ఎదుగుదల- ఇల్లు కొంటారు, డబ్బుకు లోటు ఉండదు..

Dec 08, 2024, 06:36 AM

ఈ రాశుల వారికి కలిసొచ్చే కాలం రానుంది.. వ్యాపారంలో లాభాలు, సక్సెస్!

Dec 07, 2024, 10:09 PM

ఈ రాశుల వారు సులువుగా, ప్రశాంతంగా నిద్రపోతారట.. ఇందులో మీరు ఉన్నారా లేరా!

Dec 07, 2024, 12:20 PM

రాబోయే ఐదు నెలల్లో వృత్తి, వ్యక్తిగత జీవితం, ఆర్థిక విషయాలలో అడ్డంకులు ఎదుర్కొంటారు. కొత్త సంవత్సరం ప్రారంభం కూడా కొన్ని రాశుల వారికి ఇబ్బందులు తప్పవు. వచ్చే ఏడాది మార్చిలో శని తన తదుపరి రాశి సంచారం చేస్తాడు. కుంభ రాశిని వీడి మీన రాశిలోకి అడుగుపెడతాడు. ప్రస్తుతం శని ప్రత్యక్ష మార్గం వల్ల కష్టాలు ఎదుర్కొనే రాశులు ఏవో చూద్దాం.

మేష రాశి

శని ప్రత్యక్ష కదలిక మేష రాశి వారి మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఉద్యోగంలో ఉన్న వారికి పురోగతి సాధించడం కష్టంగా మారుతుంది. అనుకున్న పనులు పూర్తి చేయలేకపోతారు. దీని వల్ల ఉన్నతాధికారుల దగ్గర నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. సహనం కోల్పోతారు. అలాగే జీవిత భాగస్వామితో గొడవలు జరుగుతాయి. ఒత్తిడిని ఎదుర్కొంటారు. వ్యాపారాలు చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార విస్తరణ అవకాశాలు అనుకున్న విధంగా ఉండకపోవచ్చు. అంచనాలు తలకిందులు అయ్యే అవకాశం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది సవాలుతో కూడిన కాలంగా మారుతుంది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వాళ్ళు ఇప్పటికే అర్థాష్టమ శని ప్రభావంతో ఇబ్బంది పడుతున్నారు. దీనితో పాటు ప్రస్తుత సమయం వీరికి అడ్డంకులతో కూడా కాలంగా మారుతుంది. కష్టపడి పని చేసిన విజయాన్ని అందుకోలేకపోతారు. సహోద్యోగుల నుంచి మద్దతు లేకపోవడంతో కార్యాలయంలో ఇబ్బందులు కలుగుతాయి. నిరాశ ఎదురవుతుంది. ఆర్థికంగా ఎదురు దెబ్బలు తగులుతాయి. ఊహించని ఖర్చులు, నష్టాలు వచ్చే ప్రమాదం ఉంది. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కుటుంబ సంబంధాల మీద శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రశాంతతను కొనసాగించడం కష్టంగా ఉంటుంది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఇది ఒత్తిడి, బాధ్యతలతో కూడిన సమయం. పని భారం విపరీతంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఖర్చులు పెరుగుతాయి. అందువల్ల వాటిని తెలివిగా నిర్వహించుకోవడం చాలా అవసరం. అనుకోని సమస్యలు తెర మీదకు వచ్చి ఇబ్బంది పెడతాయి. సహోద్యోగులతో వృత్తిపరమైన విభేదాలు ఒత్తిడికి గురి చేస్తాయి. అపార్థాలు నివారించడం కోసం సహనంతో వ్యవరించడం చాలా అవసరం.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారి మీద కూడా అర్థాష్టమ శని ప్రభావం ఉంటుని. అందువల్ల ఇది సవాలుతో కూడిన సమయం. కష్టపడి పని చేసినప్పటికీ గుర్తింపు రాకపోవడంలో నిరాశ చెందుతారు. వృత్తిపరంగా ఇతరుల నుంచి మద్దతు తక్కువగా ఉంటుంది. కొత్త వెంచర్లు ప్రారంభించాలని అనుకునే వారికి ఈ కాలం అనువైనది కాదు. ఊహించని అడ్డంకులు, నష్టాలకు దారి తీస్తుంది. వ్యక్తిగత సంబంధాలు దెబ్బతింటాయి. ఈ కాలంలో వృశ్చిక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా, ఓపికగా ఉండాలి.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

తదుపరి వ్యాసం