Sankatahara Chaturthi: 2025లో సంకటహర చతుర్ధి ఎప్పుడెప్పుడు వచ్చింది? ఈరోజు వినాయకుడిని ఇలా పూజించారంటే కష్టాలు తీరుతాయి
18 January 2025, 7:00 IST
- Sankatahara Chaturthi: వినాయకుడిని ఆరాధించడం వలన మన పనిలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా పనులు పూర్తవుతాయి. సంకటహర చతుర్థి రోజున వ్రతం చేయడం వలన మంచి జరుగుతుంది.

Sankatahara Chaturthi: 2025లో సంకటహర చతుర్ధి ఎప్పుడెప్పుడు వచ్చింది?
సంకటహర చతుర్ధి నాడు వినాయకుడిని ఆరాధించడం వలన వినాయకుని అనుగ్రహం కలుగుతుంది. వినాయకుడు తొలి పూజలు అందుకుంటారు. వినాయకుడిని ఆరాధించడం వలన మన పనిలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా పనులు పూర్తవుతాయి. సంకటహర చతుర్థి రోజున వ్రతం చేయడం వలన మంచి జరుగుతుంది. మన కోరికలు నెరవేరుతాయి. అనుకున్న పనులు జరుగుతాయి.
లేటెస్ట్ ఫోటోలు
Budhaditya Yoga: కుంభరాశిలో సూర్యుని రాక, బుద్ధాదిత్య రాజ యోగం- ఈ 4 రాశుల వారికి గోల్డెన్ డేస్ మొదలు, ఉద్యోగ అవకాశాలు!
Shani Transit: శని సంచారం, 2025లో డబ్బుల వర్షం కురుస్తుంది.. ఈ మూడు రాశుల వారికి సంతోషం
ఇక విజయానికి కేరాఫ్ అడ్రెస్ ఈ 3 రాశులు- డబ్బులే, డబ్బులు..
Guru Transit: మిథున రాశిలో గురువు సంచారం.. ఈ 3 రాశులకు అదృష్టం, ధనం, సంతోషంతో పాటు ఎన్నో
ఇక ఈ రాశుల వారికి డబ్బుకు లోటు ఉండదు! జీవితంలో అపార సంతోషం..
Rahu Transit: రాహువు కుంభ రాశి సంచారం.. ఈ రాశులకు ఆకస్మిక ధన లాభం, సంతోషంతో పాటు ఎన్నో
సంకటహర చతుర్థి వ్రత విధానం గురించి తెలుసుకోండి
- ఈ చవితి వ్రతాన్ని 3,5,11 11 లేదంటే 21 నెలల పాటు ఆచరిస్తారు.
- బహుళ చవితి నాడు వ్రతాన్ని మొదలు పెట్టాలి.
- మనసులో కోరికను తలచుకుని ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే మంచి జరుగుతుంది.
- వ్రత ఆచరణ రోజున ఉదయాన్నే శిరస్సున స్నానం చేయాలి. ఆ తర్వాత గణపతిని పూజించాలి.
- తెలుపు రంగు లేదా ఎరుపు రంగు జాకట్టు ముక్కను తీసుకుని వినాయకుడు ముందు పెట్టాలి.
- పసుపు, కుంకుమను రాసి జాకెట్టు ముక్కలో మూడు పిడకలు బియ్యం వేయాలి.
- అందులో తమలపాకు, రెండు ఎండు ఖర్జూరాలను, రెండు వక్కలను, దక్షిణ పెట్టి మన కోరికను చెప్పుకోవాలి.
- ఆ తర్వాత గణేష్ స్తోత్రాన్ని చదివి వ్రత కథను చదువుకోవాలి. ఆ మూటను స్వామివారి ముందు పెట్టాలి.
- ధూపం వెలిగించిన తర్వాత కొబ్బరికాయ కానీ పండ్లు కానీ నైవేద్యంగా పెట్టాలి.
- వినాయకుడి ఆలయానికి వెళ్లి మూడు లేదంటే 11, 21 ప్రదక్షిణలు చేయాలి.
- సూర్యాస్తమయం అయ్యేదాకా వినాయకుడిని కదపకూడదు.
- సూర్యుడు అస్తమించాక స్నానం చేసి దీపం పెట్టుకుని వినాయకుడికి నిత్య పూజ చేసినట్లు పూజ చేయాలి.
- ఆ తర్వాత వినాయకుడు కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసుకోవాలి. స్వామివారికి సాయంత్రం నైవేద్యం పెట్టాలి.
2025లో ఎప్పుడెప్పుడు సంకటహర చతుర్థి వచ్చింది?
- జనవరి 17, 2025, శుక్రవారం పుష్య బహుళ చవితి
- ఫిబ్రవరి 16, 2025, ఆదివారం మాఘ బహుళ చవితి
- మార్చి 17, 2025, సోమవారం ఫాల్గుణ బహుళ చవితి
- ఏప్రిల్ 16, 2025, బుధవారం చైత్ర బహుళ చవితి
- మే 16, 2025, శుక్రవారం వైశాఖ బహుళ చవితి
- జూన్ 14, 2025, శనివారం జేష్ఠ బహుళ చవితి
- జులై 14, 2025, సోమవారం ఆషాడ బహుళ చవితి
- ఆగష్టు 12, 2025, మంగళవారం శ్రావణ బహుళ చవితి
- సెప్టెంబర్ 10, 2025, బుధవారం భాద్రపద బహుళ చవితి
- అక్టోబర్ 10, 2025, శుక్రవారం ఆశ్వీజ బహుళ చవితి
- నవంబర్ 8, 2025, శనివారం కార్తీక బహుళ చవితి
- డిసెంబర్ 7, 2025, ఆదివారం మార్గశిర బహుళ చవితి
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.