తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వాళ్ళకు బాగుంటుంది.. ఆకస్మిక బహుమానాలు, తీర్ధ యాత్రలు, వాహనాలు, గృహ నిర్మాణాలు ఇలా ఎన్నో

Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వాళ్ళకు బాగుంటుంది.. ఆకస్మిక బహుమానాలు, తీర్ధ యాత్రలు, వాహనాలు, గృహ నిర్మాణాలు ఇలా ఎన్నో

HT Telugu Desk HT Telugu

18 January 2025, 4:00 IST

google News
    • Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 18.01.2025 శనివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వాళ్ళకు బాగుంటుంది
Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వాళ్ళకు బాగుంటుంది

Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వాళ్ళకు బాగుంటుంది

రాశిఫలాలు (దిన ఫలాలు) : 18.01.2025

లేటెస్ట్ ఫోటోలు

Budhaditya Yoga: కుంభరాశిలో సూర్యుని రాక, బుద్ధాదిత్య రాజ యోగం- ఈ 4 రాశుల వారికి గోల్డెన్ డేస్ మొదలు, ఉద్యోగ అవకాశాలు!

Feb 15, 2025, 01:09 PM

Shani Transit: శని సంచారం, 2025లో డబ్బుల వర్షం కురుస్తుంది.. ఈ మూడు రాశుల వారికి సంతోషం

Feb 15, 2025, 08:07 AM

ఇక విజయానికి కేరాఫ్​ అడ్రెస్​ ఈ 3 రాశులు- డబ్బులే, డబ్బులు..

Feb 15, 2025, 05:35 AM

Guru Transit: మిథున రాశిలో గురువు సంచారం.. ఈ 3 రాశులకు అదృష్టం, ధనం, సంతోషంతో పాటు ఎన్నో

Feb 14, 2025, 08:05 AM

ఇక ఈ రాశుల వారికి డబ్బుకు లోటు ఉండదు! జీవితంలో అపార సంతోషం..

Feb 14, 2025, 06:15 AM

Rahu Transit: రాహువు కుంభ రాశి సంచారం.. ఈ రాశులకు ఆకస్మిక ధన లాభం, సంతోషంతో పాటు ఎన్నో

Feb 13, 2025, 08:09 AM

ఆయనము: ఉత్తరాయణం, సంవత్సరం: శ్రీ క్రోధినామ

మాసం: పుష్యం, వారం : శనివారం, తిథి : కృ. పంచమి, నక్షత్రం : పూర్వ ఫాల్గుణి

మేషం రాశి

ఈ రాశి వారికి ఈ రోజు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరము. ముఖ్యమైన విషయాలలో ప్రయాణాలలో వాయిదాలకి అవకాశం ఉంది. ప్రయాణాలలో చికాకులు, నూతన వ్యక్తుల పరిచయాలు ఇబ్బంది కలిగించినప్పటికీ ఆత్మబలముతో వాటిని జయిస్తారు. తోబుట్టువులతో ఆత్మీయులతో విభేదాలు రాకుండా వీలైనంతవరకూ మౌనం పాటించుట మేలు. ఆకస్మిక ఖర్చులు అధికంగా ఉంటాయి. గురువులని, పెద్దలని కలిసి ఆశీర్వచనం తీసుకుంటారు. ఆధ్యాత్మిక క్షేత్ర పర్యటన ఆనందాన్నిస్తుంది.

వృషభ రాశి

ఈ రాశి వారికి ఈ రోజు జీవిత భాగస్వామితో అనుకూలమైన చర్చలు చేస్తారు. కుటుంబ వార్తలను ఆహ్లాదకరంగా ఉంటుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తిగత శ్రద్ధ, రోగనిరోధక శక్తి పెరుగుతాయి. పాత బాకీలు వసూలు అవు తాయి. పనులలో ఆలస్యాలు, ఆటంకాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత విభేదాలు రాకుండా సంయమనం పాటించాలి. ఆత్మీయ సోదర వర్గం సహకారం అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు పైన ఆసక్తి ఉండదు. మాటల విషయంలో కంటి విషయంలో జాగ్రత్తలు అవసరం. ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం వల్ల ఇతరులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది.

మిధున రాశి

రాశి వారికి ఈ రోజు సంతానముతో, ఆత్మీయ వ్యక్తులతో అహ్లాదకరంగా గడుపుతారు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. మీ ఆలోచనలు బాగుంటాయి సృజనాత్మకత బాగుంటుంది. అనుకున్న విషయాలు సత్ఫలితాలు వస్తాయి. ఇంతకుముందు రుణములు తీసుకున్న వారి చెల్లిస్తారు. అపార్థాలకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తిపరమైన అంశములలో, సామాజిక సంబంధాలలో వైరాగ్య భావనల అధికంగా ఉంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి.

కర్కాటక రాశి

ఈ రాశి వారికి ఈ రోజు గృహ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. సంతాన విద్య అభివృద్దికి సంబంధించిన విషయాలు వింటారు. ఆలోచనలు ఉద్వేగ పూరితంగా ఉ న్నప్పటికీ ఫలవంతంగా ఉంటాయి. ఆకస్మిక బహుమానాలు అందుకుంటారు, భాగస్వామికి సంబంధించి కొత్త నిర్ణయాలు ఆశాజనకంగా ఉంటాయి. మీ కుటుంబములోని పెద్దలు తీర్ధయాత్రలు చేయడానికి సంకల్పిస్తారు.

సింహ రాశి

రాశి వారికి ఈ రోజు తల్లి ఆరోగ్యం అభివృద్ధి కరంగా ఉంటుంది. వాహనము కొరకు, గృహ నిర్మాణం కొరకు ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులు విద్యాపరమైన అంశములు మీద శ్రద్దను పెంచుకోవాలి. వ్యవసాయ అంశములు అనుకూలంగా ఉంటాయి. మిత్రులతో అనుకూలంగా ఉంటుంది. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న దూర ప్రదేశం నుంచి అందుకున్న ఒక వార్త ఆనందాన్నిస్తుంది. విదేశీ ప్రయత్నాలు చేస్తారు.

కన్యా రాశి

ఈ రాశి వారికి ఈ రోజు మిత్రుల సహకారం ఆశించిన విధముగా అనుకూలంగా ఉంటుంది. ధైర్యము పరాక్రమం పెరుగుతుంది. నిర్ణయాలు ధైర్యంగా తీసుకుంటారు. ఆధాయము అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది. దగ్గర ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులు విద్య మీద ఆసక్తి పెంచుకోవాలి. గృహ వాహన సంబంధ అంశములలో చిన్న పాటి రిపేర్లకు మరమ్మతులకు అవకాశం. వృత్తిపరంగా అధిక బాధ్యతలు శ్రమ ఉన్నప్పటికీ మీరు సమయానికి మీ పనిచేసే ఉన్నత అధికారులు ప్రశంసలను పొందుతారు.

తులా రాశి

రాశి వారికి ఈ రోజు వాతావరణం ఆహ్లాదకరంగా ఉం టుంది. కొన్ని పసులలో ఆటంకాలు ఉన్నప్పటికీ పట్టుదలగా వెళ్లే ప్రయత్నాలు. మాట విలువ గౌరవం పెరుగుతుంది. నూతన వృత్తి కోసం ప్రయత్నం చేసే వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. సంతాన అభివృద్ధి కొరకు కొత్త ప్రయత్నాలు చేస్తారు. వారి కొరకు సమయాన్ని కేటాయిస్తారు.

వృశ్చిక రాశి

ఈ రాశి వారికి ఈ రోజు మనసులోని కోరికలన్నీ నెరవేర్చుకోవడానికి కృషి చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. శారీరక శ్రద్ధ, అలంకరణ మీద ఆసక్తి పెరుగుతాయి. భాగస్వామితో కలిసి నూతన నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రయాణానికి సంకల్పం చేస్తారు. వ్యక్తిగత సంతోషం కొరకు అధికమైనప్పటికీ ఆనందాన్నిస్తాయి. ఇతరులకు రుణములు ఇస్తారు. సంతానపరమైన అంశములలో అభివృద్ధికి సంబంధించిన విషయాలు ఆలోచన రేకెత్తిస్తాయి, గృహ ఆదాయం బాగుంటుంది. తల్లి తరపు బంధువుల నుంచి రాకపోకలుంటాయి.

ధనస్సు రాశి

ఈ రాశి వారికి ఈ రోజు ఆత్మసంతృప్తిని, వ్యక్తిగత అభి వృద్ధిని కలిగిస్తాయి. కుటుంబంలో భాగస్వామితో అన్యోన్యతను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. మాట పట్టింపులు లేకుండా, వాగ్వాదములకు చోటు ఇవ్వకుండా ముందుకు సాగాలి. కొత్త వ్యక్తుల పరిచయాలు లాభాలు వచ్చినప్పటికీ వాటిని దుర్వినియోగము కాకుండా అనుకూలంగా మరల్చుకోవడానికి ప్రయత్నములు చేయాలి. సంతానము అభివృద్ధి కొరకు ఆలోచిస్తారు. వ్యవసాయ సంబంధ అంశములు మీద దృష్టి.

మకర రాశి

రాశి వారికి ఈ రోజు కుటుంబ సభ్యులతో, సంతానంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో, చిన్ననాటి స్నేహితుల పలకరింపులతో ఉత్సాహంగా గడుస్తుంది. ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తారు. తండ్రి నుంచి, దూర ప్రదేశాల నుంచి విలువైన బహుమానాలు అందుకుంటారు. వృత్తిలో గౌరవం, ఆదాయపరమైన పెరుగుదల, ఆశించిన ప్రదేశములకు స్థానచలనమునకు ప్రయత్నాలు అనుకూలం గా ఉండడం ఆనందాన్నిస్తాయి. నూతన విషయాలు తెలుసుకుంటారు.

కుంభ రాశి

ఈ రాశి వారికి ఈ రోజు వృత్తిపరంగా అధిక బాధ్యతలు శ్రమ ఉంటాయి. గౌరవం పెరుగుతుంది. ఇతరులకు సహకరిస్తారు. వృత్తిపరంగా ఉన్నత అధికారుల సహకారంతో పనులు నెరవేరుస్తారు. నూతన విషయాలు నేర్చుకుంటారు. సమయమునకు తగిన ఆహార స్వీకరణ అవసరము. భూమికి సంబంధించిన అంశములలో కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. తోబుట్టువులతో నిదానమవసరం. ఆత్మీయుల సహకారంతో కోరుకున్న విషయంలో పనులు ముందుకు సాగుతాయి. దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.

మీన రాశి

ఈ రాశి వారికి ఈ రోజు అధిక ఖర్చులు ఉన్నప్పటికీ, అవి సంతోషాన్ని సూచిస్తున్నాయి. విద్యా పరంగా అభివృద్ధి పరంగా ఉంటుంది. పెద్దలు గురువుల ఆశీస్సులతో ముందుకు సాగుతారు. ఆత్మీయ వ్యక్తుల సహకారం. మీకు మనోధీర్యాన్ని ఇస్తుంది. విదేశీ ప్రయత్నం చేయువారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తిపరమైన వైరాగ్యంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వాహనములను నడిపేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
తదుపరి వ్యాసం