తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mercury Combust: అస్తంగత్వ దశలోకి బుధుడు: ఈ రాశుల వారికి ఇది సవాళ్లతో కూడిన సమయమే!

Mercury Combust: అస్తంగత్వ దశలోకి బుధుడు: ఈ రాశుల వారికి ఇది సవాళ్లతో కూడిన సమయమే!

Ramya Sri Marka HT Telugu

29 November 2024, 12:42 IST

google News
    • Mercury Combust:గ్రహాల రాకుమారుడు బుధుడు నవంబర్ 30 తేదీన అస్తంగత్వ దశలోకి మారుతున్నాడు. ఈ దశలోనే బుధులు వృశ్చికరాశిలోకి ప్రవేశిస్తాడు. వృశ్చిక రాశిలో బుధుడి అస్తంగత్వ స్థితి అన్ని రాశులపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
అస్తంగత్వ దశలోకి
అస్తంగత్వ దశలోకి

అస్తంగత్వ దశలోకి

గ్రహాల రాకుమారుడు బుథుడు నవంబరు 30న అస్తంగత్వ దశలో వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు అత్యంత వేగంగా కదిలే అతి చిన్న గ్రహం. మేథస్సు, తెలివితేటలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, తార్కిక ఆచోనలు వంటి వాటికి కారకుడు. రవాణా, సాంకేతికత, వాణిజ్యం వంటి వాటిని కూడా ప్రభావితం చేయగల శక్తి బుధుడికి ఉంది. పంచాంగం ప్రకారం బుధుడు 30 నవంబర్ 2024 రాత్రి 8:19 గంటలకు వృశ్చికరాశిలో అస్తంగత్వ దశలోకి వెళతాడు. 11డిసెంబర్ వరకూ బుధుడు అస్తంగత్వ స్థితిలోనే ఉంటాడు. ఈ దశ వల్ల వ్యక్తుల జీవితంలో శక్తివంతమైన, సవాళ్లతో కూడిన సమయంగా మారుతుంది. మేషం నుండి మీనం వరకూ ప్రతి ఒక్క రాశిపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఏ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం.

లేటెస్ట్ ఫోటోలు

ఈ రాశుల వారికి వాహన యోగం- అతి త్వరలో ఆకస్మిక ధన లాభం!

Nov 29, 2024, 05:31 AM

శని నక్షత్ర సంచారంతో 2025లో ఈ రాశులవారికి జాక్‌పాట్, మంచి రోజులు రాబోతున్నాయి!

Nov 28, 2024, 01:49 PM

గురు భగవానుడి నక్షత్ర సంచారం వల్ల 5 నెలలు ఈ రాశుల వారికి రాజయోగం రాబోతుంది!

Nov 28, 2024, 06:47 AM

లక్ష్మీ నారాయణ యోగంతో 2025లో వీరికి అదృష్టం, మంచి ఉద్యోగ ఆఫర్లు!

Nov 27, 2024, 01:36 PM

2025లో వీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోబోతున్నారు.. ఇందులో మీరు ఉన్నారా?

Nov 27, 2024, 06:44 AM

ఈ ఐదు రాశుల వారికి కాలం కలిసి రానుంది.. ఆర్థిక లాభాలు, కుటుంబంలో ప్రశాంతం!

Nov 26, 2024, 07:13 PM

మేషం: ఈ రాశి వారికి ఇది సవాళ్లతో సమయం. చర్మ సమస్యలు, వ్యాధులు, యుటిఐల పట్ల అప్రమత్తంగా ఉండండి. విద్యార్థుల అధ్యయనాలకు అంతరాయం కలుగుతుంది.మిమ్మల్ని మీరు నిరూపించుకోవడం, సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడం కష్టతరంగా ఉంటుంది. విద్యాపరమైన ఒత్తిడి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. తోబుట్టువులతో వివాదాలు వచ్చే అవకాశముంది. అనవసరమైన ఒత్తిడికి దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితులను నిశితంగా గమనించి ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండండి.

వృషభం: జీవిత భాగస్వామి లేదా వృత్తిపరమైన భాగస్వామితో వివాదాలు తలెత్తవచ్చు. అహంకారాన్ని విడిచిపెట్టి ఎదుటివారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. వ్యక్తిగత జీవితంలో మీ తల్లి ప్రమేయం తగ్గించాలి. లేదంటే మీ శృంగార జీవితానికి ఆటంకం కలిగించవచ్చు. గృహ విధుల్లో ఎక్కువగా చిక్కుకోకండి. ప్రియమైనవారితో మాట్లాడటానికి, వారితో కాస్త సమయాన్ని గడిపేందుకు ప్రయత్నించండి. మాట అదుపులో ఉంచుకొండి. అసభ్య పదజాలాన్ని మర్చిపోండి.

మిథునం: మీ సంభాషణలో జాగ్రత్తగా ఉండండి. మీ రహస్యాలను ఎవరితో చెప్పకండి. కోపం తగ్గించుకోండి. తోబుట్టువులతో వివాదాలు తలెత్తవచ్చు. మీ ప్రతిష్టకు భంగం కలగి అవకాశాలున్నాయి. ఇతరులు మిమ్మల్ని మోసపూరితంగా, స్వార్థపరులుగా భావించవచ్చు. కుటంబ పనులకు ఆటంకాలు రావచ్చు. మీ తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి.

కర్కాటకం:ఈ సమయం మీకు మిశ్రమ ఫలితాలను తెస్తుంది. ఖర్చులను నియంత్రించడంలో ఉంచాలి. పొదుపు అలవాటు చేసుకోవాలి. కుటుంబం నుండి ప్రోత్సాహం లభిస్తుంది. పిల్లలతో సానుకూల సంభాషణలు చేస్తారు. సవాళ్లు ఎదురైనప్పుడు బలమైన సంబంధాలను ఏర్పడతాయి. శృంగారపరమైన ఒడిదుడుకులను కూడా ఎదుర్కోవచ్చు, కానీ ఓపెన్ కమ్యూనికేషన్ సహాయపడుతుంది. ఊహించని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు అవకాశం ఉంది.

సింహం: ఈ రాశి వారికి ఇది గడ్డు కాలం. ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడులు, పొదుపులు, ఆదాయాలతో సహా డబ్బు వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతాయి.దురదృష్టవశాత్తూ ఇది మీ స్వంత అహం, అతి విశ్వాసం లేదా అపార్థాల కారణంగా జరుగుతోంది. ఆస్తిని కొనుగోలు, వాహనం కొనుగోలు వంటివి ఇంటిపై మీకున్న దృష్టిని మారుస్తాయి. ఆర్థిక సమస్యల కారణంగా ఇంట్లో ఘర్షణలు ఏర్పడతాయి. ద్రవ్య నిర్ణయాలపై మీ తల్లి నుండి సలహాలను తీసుకోవడం మంచిది.

కన్య: వృత్తి జీవితంలో సమస్యలు తలెత్తవచ్చు. ఇది అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. పని, వ్యక్తిగత బాధ్యతలను సమతుల్యం చేయడం కష్టతరంగా మారుతుంది. అహంతో నడిచే అవాస్తవిక లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నించకండి. బదులుగా స్వీయ-ఆవిష్కరణపై దృష్టి పెట్టండి. ఈ సమయంలో మీ కమ్యూనికేషన్ మిమ్మల్ని హైలైట్ చేస్తుంది. ఓపికగా, ఓపెన్ మైండెడ్‌గా ఉండండి. ప్రత్యేకించి చిన్న తోబుట్టువులతో సంభాషించేటప్పుడు గొడవలకు తావివ్వకండి.

తుల: ఈ సమయంలో మీరు కొన్నింటిని వదులుకోవాలి. అనుకోకుండానే ఇతరులను బాధపెట్టవచ్చు. మర్యాద, దౌత్యంతో ప్రవర్తించండి. కుటుంబ లేదా సామాజిక సమస్యల కారణంగా మీరు మీ తండ్రితో విభేదించవచ్చు. మాటలు జాగ్రత్త. బంధాలను బలోపేతం చేయడం కోసం కుటుంబతో ఎక్కడికైనా వెళ్లవచ్చు. నోరు, దంతాల సమస్యలు తలెత్తవచ్చు. తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఆలోచనాత్మకంగా, శ్రద్ధగా పనిచేయండి.

వృశ్చికం: మీ కష్టానికి ఆశించిన ఆర్థిక ప్రతిఫలం లభించకపోవచ్చు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మీ శ్రేయస్సుపై దృష్టి పెట్టండి. మీ శరీరాన్ని పెంపొందించడంలో సమయాన్ని వెచ్చించండి. ఇది దీర్ఘకాలంలో ఫలితం ఇస్తుంది. మీ శక్తిని పెంచుకోండి, మీ నాడీ వ్యవస్థకు విశ్రాంతి అవసరం. ఈ సమయంలో స్థితిస్థాపకంగా ఉండటానికి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. సవాళ్లు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి.

ధనుస్సు: కెరీర్ మార్పు కోసం పరిశీలిస్తున్నట్లయితే ప్రస్తుతానికి మీ ప్రణాళికలను నిలిపివేయడం ఉత్తమం. ఒకవేళ మారి ఉంటే కొత్త కార్యాలయంలో సవాళ్లు, సర్దుబాట్లు ఉంటాయి. పై అధికారులతో విభేదాలు ఉండవచ్చు. మీరు పని కోసం ప్రయాణించవలసి రావచ్చు, కానీ అవి ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. భాగస్వామి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. అహంభావాన్ని తగ్గంచుకోకపోతే తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. బహిరంగంగా కమ్యూనికేట్ చేయండి.

మకరం: ఆర్థిక నిర్ణయాలలో జాగ్రత్తగా ఉండండి. అప్పులకు దారితీయవచ్చు. షేర్ మార్కెట్ లేదా ఊహాజనిత వ్యాపారాలలో పెట్టుబడి పెట్టడం మానుకోండి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న మకర రాశి విద్యార్థులు చదువులో సవాళ్లను ఎదుర్కోవచ్చు. మీ తండ్రి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఎదుటివారి సలహాలను వినండి వారితో వాదించకండి. శాంతియుత సంబంధాన్ని కొనసాగించండి. కోర్టు కేసులు లేదా వ్యాజ్యాలను పరిష్కరించడానికి ఇది అనువైన సమయం. ఎందుకంటే మీ విరోధులు ప్రతికూలంగా ఉంటారు, మీకు పైచేయి ఇస్తారు.

కుంభం: జీవితంలోని అనిశ్చితి ఏర్పడుతుంది. సవాళ్లు ఎదురవుతాయి. కార్యాలయ ఒత్తిడి కారణంగా విద్య, వృత్తిపరమైన కట్టుబాట్లను సమతుల్యం చేయడానికి కష్టపడాల్సి వస్తుంది.పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఇది కష్టతరమైన సమయం. వృత్తిపరమైన డిమాండ్ల కారణంగా వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తవచ్చు. తల్లిదండ్రులు తమ పిల్లల అవసరాలకు ప్రాధాన్యతనివ్వాలి. ఈ సమయంలో మీ పిల్లలకు మద్దతు అవసరం.

మీనం: వృత్తిపరమైన జీవితంపై అధిక దృష్టి ఇంటినీ, వైవాహిక జీవితాన్ని నిర్లక్ష్యం చేయడానికి దారితీయవచ్చు.రెండింటినీ సమతుల్యం చేయడం కష్టం అవుతుంది. వివాహం చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే వాయిదా వేయడమే మంచిది. తండ్రి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి . ఎదుటివారి సలహాలను శాంతియుతంగా స్వీకరించండి. సుదూర ప్రయాణానికి, ఆధ్యాత్మిక అభివృద్ధికి ఇది అనువైన సమయం.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

తదుపరి వ్యాసం