ఈ రాశుల వాళ్ళను అర్థం చేసుకోవడం చాలా కష్టం- ఒక పట్టాన అంతుపట్టరండోయ్
15 October 2024, 17:00 IST
- చాలా మంది ఎదుటి వారి మనసులో ఏముంది? ఏం ఆలోచిస్తున్నారు అనే విషయాన్ని ఇట్టే పసిగడతారు. కానీ ఈ రాశుల వాళ్ళను అర్థం చేసుకోవడం మాత్రం చాలా కష్టం. మనసుకు ఒక ముసుగు వేసుకుని తిరిగేస్తారు. వారి ప్రవర్తన అంతుచిక్కకుండా ఉంటుంది. అటువంటి రాశులు ఏవో తెలుసా?
ఈ రాశుల వాళ్ళు ఎవరికీ అర్థం కారు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని, ప్రవర్తనను అంచనా వేస్తారు. ఒక్కో రాశిలో జన్మించిన వారి లక్షణాలు ఒక్కో విధంగా ఉంటాయి. కొందరు ఎంతో జాయిఫుల్ గా అందరితో కలిసి మెలిసి ఉంటారు. కానీ మరికొందరు మాత్రం ఇతరులలో కలిసేందుకు చాలా తక్కువ ఆసక్తి చూపిస్తారు.
లేటెస్ట్ ఫోటోలు
ఆరు నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు.. వీళ్ళు వాళ్ళు అవుతారంట. అంటే స్నేహం చేసే వారికి తగినట్టుగా మారిపోతారు. కానీ కొన్ని రాశుల వాళ్ళను అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఒక పట్టాన అంతుపట్టరు. అర్థం అయినట్టే ఉంటారు కానీ అసలు అర్థం కారు. ఇలా ఇతరులను అయోమయానికి గురి చేసే లక్షణాలు కలిగి ఉంటారు. అలాంటి ప్రవర్తన ఏ రాశుల వారికి ఉందో తెలుసా?
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వాళ్ళు ప్రతి విషయం రహస్యంగా ఉంచుకుంటారు. లోతైన భావోద్వేగాలు కలిగి ఉంటారు. వారి మనసులోని భావాలను దాచుకునేందుకు ఎక్కువగా ప్రయత్నిస్తారు. రహస్యంగా ఉంటారు. వాళ్ళ ఆలోచనలు ఏంటి? మనసులో దేని గురించి ఆలోచిస్తున్నారో తెలుసుకోవడం చాలా కష్టం. ఎదుటి వారిని సందిగ్ధంలో పడేసే మనస్తత్వం వీరిది.
మీన రాశి
మీన రాశి వాళ్ళు కలలు కనే స్వభావం ఎక్కువ. సొంత ఆలోచనలతో ఒక ప్రత్యేకమైన లోకాన్ని ఏర్పరుచుకుంటారు. ఒక్కోసారి ఒక్కో విధంగా ప్రవర్తిస్తారు. ఇది ఇతరులను కన్ఫ్యూజన్ లోకి నెట్టేస్తుంది. వాళ్ళ మాటలు అర్థం చేసుకోవడం కూడా చాలా క్లిష్టతరం చేస్తుంది. వాళ్ళు నిజంగా ఏం కోరుకుంటున్నారో అర్థం చేసుకోవడం ఎదుటి వారికి సవాలుగా మారుతుంది.
కుంభ రాశి
కుంభ రాశి వాళ్ళు స్వతంత్రంగా అలాగే వినూత్నంగా ఉంటారు. తరచుగా భావోద్వేగాలకు లోనవుతారు. అయితే వాళ్ళు ఎందుకు అలా ఉంటున్నారో తెలుసుకోవడం చాలా కష్టం. కొన్ని సమయాల్లో దూరంగా ఉన్నట్టు అనిపిస్తారు. మనసుకు ఒక ముసుగు వేసుకుని తిరుగుతారు. మనసులోని ఏ విషయాన్ని బయట పెట్టరు.
మకర రాశి
మకర రాశి వాళ్ళు ఆచారణాత్మకతకు ప్రసిద్ధి చెందుతారు. పైకి చాలా గంభీరంగా కనిపిస్తాయి. సంయమనం పాటిస్తారు. వీరి ఆశయాలు నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ వీరి ప్రవర్తన ఎదుటి వారిని గందరగోళ పరిస్థితిలోకి నెట్టేస్తుంది. వారి భావాలను తప్పుగా అర్థం చేసుకునేలా చేస్తుంది. విజయం సాధించేందుకు వారి చేసే ప్రయత్నాలు అన్నింటినీ దాచి పెట్టేస్తారు. నిగూఢ స్వభావం కలిగి ఉంటారు. అందువల్ల వీరిలోని మృదువైన స్వభావం చూడటం చాలా కష్టమవుతుంది.
మిథున రాశి
మిథున రాశి వాళ్ళు బహుముఖంగా ఉంటారు. తరచుగా ఇతరులను గందరగోళానికి గురి చేసే విధంగా రెండు విధాలుగా ప్రవర్తిస్తారు. తమ మనోభావాలను క్షణంలోనే మార్చేసుకుంటారు. వీళ్ళు సాధారణంగా స్నేహశీలురుగా ఉంటారు. కానీ వారి ప్రవర్తన, క్షణానికో విధంగా మారే తీరు ఎదుటి వారిని ఇబ్బంది పెడుతుంది. వీళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.
టాపిక్