Sankranti: సంక్రాంతి సాయంకాలం వేళ శివార్చన చేయాలి బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Published Jan 12, 2025 10:00 AM IST
Sankranti: సంక్రాంతి సాయంకాలం వేళ విశేషంగా శివార్చన చేయాలి. శివపురాణం ఇలా చెబుతుంది అని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
Sankranti: సంక్రాంతి సాయంకాలం వేళ శివార్చన చేయాలి
సంక్రాంతి సాయంకాలం వేళ విశేషంగా శివార్చన చేయాలి. శివపురాణం ఇలా చెబుతుంది అని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. "శ్రేష్ఠమైన ఆవునేతిని కొంచెంగా వెచ్చ చేయాలి. మళ్లీ దానిని చల్లార్చాలి. దీనినే 'మహాఘృతకంబళ' అంటారు.
లేటెస్ట్ ఫోటోలు
కుజుడు, బుధుడి కలయికతో ఈ 4 రాశులకు సమస్యలు.. ఈ శత్రు గ్రహాల ప్రభావంతో టెన్షన్, ఓటమి ఇలా ఎన్నో!
శని మహారాజయోగం.. అదృష్టమంటే ఈ మూడు రాశులదే, ఇక వీళ్ళు పట్టిందల్లా బంగారమే!
జులై 16 రాశి ఫలాలు.. ఈ ఒక్క రాశి వారికి మాత్రం అన్నింటా అనుకూల ఫలితాలు
ఈ 3 రాశుల వాళ్లు సిద్ధంగా ఉండండి.. పదోన్నతులు, విదేశాల్లో ఉద్యోగావకాశాలు.. మాలవీయ రాజయోగంతో తిరగనున్న దశ
గజకేసరి రాజయోగం వల్ల 3 రాశుల ఇంట్లో ధనం కురిపిస్తుంది, వృత్తిలో పురోగతి ఉంటుంది!
జులై 15 రాశి ఫలాలు.. ఈ 2 రాశుల వారి జీవితాల్లో ఫుల్ రొమాన్స్
ఈ నెయ్యి కొంత సేపటికి పేరుకుంటుంది. ఆ నేతిలో నాలుగో భాగం శివాలయానికి తీసుకెళ్లాలి. మొదట శివలింగానికి తేనె, నేతితో అభిషేకం చేయాలి. ఆ తర్వాత పేరిన నేతిని శివలింగం పై 20 క్షణాలు ఉంచి తీసేయాలి అని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
అనంతరం నువ్వులు, ఆవాలు, బిల్వపత్రం, బంగారు రంగు తామర పూలతో శివుని పూజించాలి. హారతిచ్చి ముగించాక ఆ నేతిని బ్రాహ్మణునికి దానం చేయాలి. మకర సంక్రాంతి నాడు చేసే ఈ పూజను 'మహాఘృతకంబళ పూజ' అంటారు.సంక్రాంతిని పౌష్యలక్ష్మిగా అందరూ భావిస్తారు. ఈ కాలంలో ధాన్యాది పంటలు పుష్కలంగా చేతికందుతాయి. హేమంత ఋతువులో రెండవ మాసం అయిన పుష్యమాసంలో వచ్చే ఈ పండుగను మూడు రోజులు చేసుకుంటారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ.
భోగి:
భోగి పండుగ రోజు తెల్లవారుఝామునే స్నానానంతరం ప్రతి ఇంటి ముంగిట భోగిమంటలు వేస్తారు. ఈ మంటలలో అదివరకు తయారుచేసిన గొబ్బెమ్మల పిడకలు, ఇంటి వాడకానికి పనికిరాని పాత వస్తువులు వేసి, పీడ విరగడ అయిందని సంతోషిస్తారు. ఊరంతా కలిసి ఒకచోట భోగి మంట వేసే ఆచారం కూడా ఉంది. భోగి మంటలతో పాతకు స్వస్తి చెప్పి నవ్యతకు స్వాగతం పలుకుతారు.
ఈ రోజు సాయంకాలం చిన్న పిల్లలకు భోగిపళ్లు (రేగుపళ్లు, పూలరేకులు, చిల్లర డబ్బులు) పోసి, హారతి ఇచ్చి దిష్టి తీస్తారు. పేరంటాళ్లకు నానబెట్టిన శనగలు, పండ్లు, తాంబూలం ఇస్తారు. కొందరు బొమ్మల కొలువులు పెడతారు. ధనుర్మాసం చివరి రోజు కాబట్టి గోదా కళ్యాణం చేస్తారు అని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
సంక్రాంతి నాడు ఇంటి ముంగిట పెద్ద పెద్ద ముగ్గులుకనువిందు చేసేలా వేసి, సంక్రాంతి పురుషుని ఆహ్వానిస్తారు. ఈ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది. ఉత్తరాయణమున ఉరివేసుకుని మరణించిన పుణ్యలోకాలు కలుగునని నానుడి. ఈ రోజున పితృదేవతలకు తర్పణములు వదులుతారు. రైతులకు పంటలు పుష్కలంగా పండి ఈ రోజుల్లో చేతికి అంది వస్తాయి కాబట్టి 'పంటల పండుగ' అని అంటారు అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
"రవి సంక్రమణే ప్రాప్తేన స్నాయాధ్యాస్తు మానవా సప్తజన్మసురోగస్వాత్ నిర్దనశ్చైవ జాయతే"
సూర్య సంక్రమణ సమయంలో స్నానం చేయనివాడు ఏడు జన్మల యందు రోగియై దరిద్రాన్ని అనుభవిస్తాడు. ఈ రోజున పాయసం, ధాన్యం, పండ్లు, విసనకర్రలు, వస్త్రాలు, త్రిమూర్తుల ప్రతిమలను పండితులకు దానం చేయాలి. మహిళలు పసుపు, కుంకుమ, సుగంధద్రవ్యాలు, పువ్వులు, బెల్లం పుణ్యస్త్రీలకు దానం చేయడం వల్ల మాంగళ్యాభివృద్ధి కలుగుతుంది. దేవాలయాన్ని సందర్శించి నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.