Solar eclipse: 2025లో ఎన్ని సూర్య గ్రహణాలు వస్తాయి? ఏ తేదీలలో వస్తాయి?
19 December 2024, 17:36 IST
Solar eclipse 2025: 2025 సంవత్సరంలో రెండు సూర్య గ్రహణాలు వస్తాయి. ఈ రెండు గ్రహణాలు చాలా ప్రత్యేకమైనవి. సూర్య గ్రహణానికి ఏమి దానం చేయాలి? అవి ఏఏ తేదీలలో వచ్చాయి?

సూర్య గ్రహణం ఎప్పుడు?
కొత్త సంవత్సరం 2025లో గ్రహణాలు ఎప్పుడు వచ్చాయో తెలుసుకునేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తారు. వచ్చే ఏడాది రెండు సూర్యగ్రహణాలు ఏర్పడనున్నాయి. 2025 మార్చి 29న మొదటి సూర్యగ్రహణం, 2025 సెప్టెంబర్ 21న రెండో సూర్యగ్రహణం ఏర్పడనున్నాయి.
లేటెస్ట్ ఫోటోలు
Brain health: ఈ ఆహారాలతో మీ పిల్లల మెదడును మరింత చురుకుగా చేయండి
New year resolutions: న్యూ ఇయర్ సందర్భంగా 7 బెస్ట్ రెజొల్యూషన్స్
Kia Syros: కియా సైరోస్.. ప్రీమియం ఫీచర్స్ తో బాక్సీ లుక్ కాంపాక్ట్ ఎస్ యూవీ
Telangana Tourism : ప్రకృతి అందాలు.. చారిత్రక కట్టడాలు.. ఓరుగల్లు నగరం పర్యాటకులకు స్వర్గధామం
Top Horror Thriller Movies 2024: ఈ ఏడాది హాలీవుడ్ టాప్ 10 హారర్ థ్రిల్లర్ మూవీస్ ఇవే.. ఐఎండీబీ రేటింగ్స్ ప్రకారం..
Telangana Ration Card Holders : రేషన్ కార్డు ఉందా... మీకో గుడ్ న్యూస్..! అసెంబ్లీలో కీలక ప్రకటన
సూర్యగ్రహణం అనేది ఒక ఖగోళ దృగ్విషయం. దీనిలో చంద్రుడు.. భూమికి, సూర్యుడికి మధ్య పూర్తిగా లేదా పాక్షికంగా వస్తాడు. ఖగోళ దృగ్విషయం కేవలం దృశ్యరూపం మాత్రమే కాదు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో సాంస్కృతిక, శాస్త్రీయ, ఖగోళ ప్రాముఖ్యతను కూడా కలిగి ఉంది. 2025 సంవత్సరంలో వచ్చే రెండు సూర్య గ్రహణాలు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఈ రెండు మన దేశంలో గ్రహణాలు పాక్షికంగానే ఏర్పడతాయి. 2025 గ్రహణం గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి.
- 2025లో తొలి సూర్యగ్రహణం 2025 మార్చి 29న ఏర్పడనుంది. ఇది పాక్షిక సూర్యగ్రహణం. భారత కాలమానం ప్రకారం ఉదయం 08:50 - మధ్యాహ్నం 12:43 గంటలకు గ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణం భారత్ లో కనిపించదు. భారతదేశానికి బదులుగా యూరప్, ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రంలో ఈ గ్రహణం కనిపిస్తుంది.
- 2025 సెప్టెంబర్ 21న ఏర్పడే సూర్యగ్రహణం కూడా పాక్షిక సూర్యగ్రహణమే. భారత కాలమానం ప్రకారం ఉదయం 5:29 గంటల నుంచి 9:53 గంటల వరకు గ్రహణం ఉంటుంది. భారత్ లో కూడా ఈ గ్రహణం కనిపించదు. ఆస్ట్రేలియా, అంటార్కిటికా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రంలో ఈ గ్రహణం కనిపిస్తుంది.
- పంచాంగం ప్రకారం మొదటి గ్రహణం చైత్ర అమావాస్య రోజున, రెండవ సూర్యగ్రహణం పితృ పక్షం, సర్వ పితృ అమావాస్య రోజున జరుగుతుంది. గ్రహణాలు ఏర్పడే ఈ రెండు తేదీలు చాలా ప్రత్యేకమైనవి. చైత్ర అమావాస్య తర్వాత చైత్ర నవరాత్రులు ప్రారంభమవుతాయి. పూర్వీకులను సర్వ పితృ అమావాస్య నాడు పంపుతారు.
- మొదటి సూర్యగ్రహణం రోజున శని అమావాస్య కూడా ఉంది. ఈ రోజున శని కుంభం నుండి మీన రాశిలోకి సంచరిస్తాడు. శని సంచారం చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే శని బృహస్పతి రాశిలోకి ప్రవేశిస్తున్నాడు, ఇది అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది.
- శని అమావాస్య, చైత్ర అమావాస్య రోజున సూర్యగ్రహణం ఉన్నప్పుడు దాన ఫలం పెరుగుతుంది. ఈ రోజున స్నానం చేసి దానం చేయాలి. ఈ రోజున చేసే దానధర్మాలు ఎంతో ఫలిస్తాయని చెబుతారు. కాబట్టి ఈ రెండు రోజుల్లో గ్రహణంతో పాటు పేదలకు దానధర్మాలు చేయాలి.
(గమనిక: ఈ వ్యాసంలో ఇచ్చిన సమాచారం పూర్తిగా సత్యం, ఖచ్చితమైనదని మేము చెప్పడం లేదు. వీటిని ఆచరించే ముందు సంబంధిత రంగంలోని నిపుణులను సంప్రదించండి.)