Evil Eye: ఇలా నరదృష్టి నుంచి బయపడి సంతోషంగా ఉండచ్చు.. కష్టాలన్నీ పరార్
11 December 2024, 9:45 IST
- Evil Eye: ఎప్పుడైనా సరే నరదృష్టి వలన ప్రభావం మనపై పడిందంటే సంతోషం ఉండదు. కుటుంబం అంతా కష్టాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నరదృష్టి నుంచి బయటపడడానికి కొన్ని పరిహారాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Evil Eye: ఇలా నరదృష్టి నుంచి బయపడి సంతోషంగా ఉండచ్చు.. కష్టాలన్నీ పరార్
కొంతమంది దృష్టి పడితే చాలు చిక్కుల్లో పడిపోతామని చాలా మంది నమ్ముతారు. నిజానికి నరుల దృష్టికి నాపరాళ్ళు కూడా పగిలిపోతాయని పెద్దలు అంటూ ఉంటారు. కొంతమంది కళ్ళు పడితే చాలు సంతోషమంతా కూడా తొలగిపోయి బాధలే మిగులుతాయి అని చాలా మంది చెప్తారు. చాలా మంది దిష్టి తగలకుండా కొన్ని పరిహారాలను పాటిస్తూ ఉంటారు. ఇంటికి గుమ్మడికాయ కట్టడం లేదంటే కాళ్ళకి నల్లతాడు కట్టుకోవడం ఇలా రకరకాలుగా ఎవరికి తోచిన వాళ్ళు పాటిస్తూ ఉంటారు. అయితే, ఒకరి కారణంగా సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలంటే, కొన్ని పరిహారాలని పాటించడం మంచిది. మొత్తం రెండు రకాల శక్తులు ఉంటాయి. ఒకటి సానుకూల శక్తి. ఇంకోటి ప్రతికూల శక్తి.
లేటెస్ట్ ఫోటోలు
నరదృష్టి వలన ఇన్ని ఇబ్బందులా?
ఎప్పుడైనా సరే నరదృష్టి వలన ప్రభావం మనపై పడిందంటే సంతోషం ఉండదు. కుటుంబం అంతా కష్టాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నరదృష్టి నుంచి బయటపడడానికి కొన్ని పరిహారాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నరదృష్టి వలన కుటుంబ సభ్యుల ఆరోగ్యం దెబ్బతింటుంది, కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు ఎక్కువవుతాయి. అప్పటివరకు ఉన్న పని అంతా కూడా ఒక్కసారిగా చెడిపోతుంది. ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవహిస్తుంది.
నరదృష్టికి పరిహారాలు
ఇంటికి వీటిని కట్టండి
ఒకరి వలన ఇబ్బందులు కలగకుండా ఉండాలన్నా, నరదృష్టి బాధలకు దూరంగా ఉండాలన్నా ఇంటికి నిమ్మకాయ, ఎండు మిరపకాయలు కట్టుకోవడం మంచిది. శనివారం నాడు 5 లేదా 7 మిరపకాయలు, ఒక నిమ్మకాయ కలిపి ఇంటి బయట కడితే మంచి ఫలితం ఉంటుంది. చెడు దృష్టి పడకుండా ఉంటుంది. సంతోషంగా ఉండొచ్చు.
ఇంటిని ఇలా శుభ్రం చేయండి
ఈవిల్ ఐ మన మీద పడకుండా ఉండేందుకు ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఆ నీటిలో కొంచెం ఉప్పు వేస్తే మంచిది. మంగళవారం, గురువారం, ఆదివారం మాత్రం ఇలా ఉప్పు నీటితో ఇంటిని క్లీన్ చేసుకోవద్దు.
గంగాజలం
ప్రతికూల శక్తి ప్రవహిస్తోందని అనిపిస్తే ఇంట్లో గంగాజలం చల్లండి. ఇలా చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది. ప్రతికూల శక్తి తొలగిపోయి, సానుకూల శక్తి ప్రవహిస్తుంది.
అగర్బత్తి
ఇంట్లో ప్రతికూల శక్తి తొలగిపోవాలంటే అగర్బత్తిని కూడా వెలిగించండి. ఇలా వెలిగిస్తే కూడా మంచి ఫలితాలు ఉంటాయి. నరదృష్టి వంటి బాధలు ఉండవు.
ఇలా కూడా చెయ్యచ్చు
ఈ సమస్యలే ఏమీ లేకుండా సంతోషంగా ఉండాలంటే ఇంట్లో లవంగాలని, కర్పూరాన్ని, బిర్యానీ ఆకుల్ని లేదా ఆవు పిడకలని కూడా కాల్చచ్చు. ఇవి కూడా ప్రతికూల శక్తిని తొలగించి, సానుకూల శక్తిని పెంచుతాయి.