తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vastu Tips: మీ ఇంట్లో ఏ మూలను ఏ గ్రహం పాలిస్తుందో మీకు తెలుసా..? మొత్తం ఎనిమిది గ్రహాలు ఎక్కడెక్కడుంటాయంటే!

Vastu Tips: మీ ఇంట్లో ఏ మూలను ఏ గ్రహం పాలిస్తుందో మీకు తెలుసా..? మొత్తం ఎనిమిది గ్రహాలు ఎక్కడెక్కడుంటాయంటే!

Ramya Sri Marka HT Telugu

11 December 2024, 8:35 IST

google News
  • Vastu Tips: ఏదైనా ఇల్లు, కార్యాలయం లేదా భవన నిర్మాణానికి వాస్తు చాలా ముఖ్యమైనది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి దిశను అంటే ఇంట్లోని ప్రతి మూలను వేర్వేరు గ్రహాలు శాసిస్తాయి. మొత్తం ఎనిమిది గ్రహాలు ఏది ఏ దిశను పాలిస్తుందో ఇక్కడ తెలుసుకొవచ్చు. 

ఇంట్లో ఏ మూలను ఏ గ్రహం పాలిస్తుంది?
ఇంట్లో ఏ మూలను ఏ గ్రహం పాలిస్తుంది?

ఇంట్లో ఏ మూలను ఏ గ్రహం పాలిస్తుంది?

వాస్తు శాస్త్రంలో వాస్తు దిశలు, పంచభూతాలు, అష్టదీక్షల తరువాత నవగ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి దిశను వేర్వేరు గ్రహాలు పరిపాలిస్తాయి. అందుకే ఇల్లు, కార్యాలయం లేదా మరేదైనా భవనాన్ని నిర్మించేటప్పుడు దిశలతో పాటు నవగ్రహాలను పరిగణనలోకి తీసుకోవడం మంచిదని జ్యోతిష్య శాస్త్రం, వాస్తు శాస్త్రంలో చెబుతోంది. ఈ నియమాలను అనుసరించి ఇల్లు, కార్యాలయం, భవనాలు నిర్మించే వారు ఎల్లప్పుడూ సానుకూల ఫలితాలను పొందుతారని నమ్ముతారు. ఏ దిశకు గ్రహం అధిపతి? ఎనిమిది గ్రహాల్లో ఏ గ్రహం ఏ మూలను పరిపాలిస్తుందో తెలుసుకుందాం.

లేటెస్ట్ ఫోటోలు

Shani: శని దిశలో మార్పు, కుంభరాశిలో రాజయోగం. రాశి వారికి ఆకస్మిక ధన లాభం

Dec 11, 2024, 10:39 AM

సూర్య శని కలయికతో వీరికి ఊహించని ఆర్థిక లాభాలు, అదృష్టం నెత్తి మీద ఉంటుంది!

Dec 11, 2024, 06:20 AM

Venus Transit: శుక్రుడి రాశిచక్రంలో మార్పు.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు

Dec 10, 2024, 02:14 PM

నెల రోజులు ఈ మూడు రాశుల వారికి చాలా లక్.. ధన లాభం, సంతోషం దక్కుతాయి!

Dec 10, 2024, 12:43 PM

బుధుడి సంచారంతో కుంభరాశి వారికి లక్కు.. కానీ ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి!

Dec 10, 2024, 11:56 AM

ఈ 3 రాశులకు టైమ్​ వచ్చింది! ఆకస్మిక ధన లాభం, పట్టిందల్లా బంగారమే..

Dec 10, 2024, 06:00 AM

ఏ గ్రహాలు ఏ దిశను పరిపాలిస్తాయి?

1. సూర్యుడు:

వాస్తు శాస్త్రం ప్రకారం గ్రహాల అధిపతి సూర్యుడు తూర్పు దిక్కును పాలిస్తాడు. అందుకే ఆ దిశ చాలా మంచిదని పెద్దలు చెబుతారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుడు ఆరోగ్యం, సంపద, ఆదాయాన్ని ఇస్తాడు. వాస్తుకు సంబంధించినంత వరకు.. బరువైన వస్తువులను ఎప్పుడూ తూర్పు దిశలో ఉంచకూడదు. ఇలా చేస్తే వాస్తు లోపాల వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.

2. కుజుడు:

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు దక్షిణదిశకు అధిపతి. యముడు కూడా ఈ దిశలోనే ఉంటాడు. కుజుడు ధైర్యానికి, కోపానికి, సంపదకు అధిపతి. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ దిశలో పడకగది, స్టోర్ రూమ్ ఉండటం మంచిది.

3. చంద్రుడు:

వాస్తు శాస్త్రం ప్రకారం చంద్రుడు వాయవ్య దిశకు అధిపతి. చంద్రుడు ప్రశాంతమైన మనస్సు, సంపదకు కారుకుడు. అందుకే ఈ దిశలో డైనింగ్ రూమ్, గెస్ట్ రూమ్, మహిళల గదిని నిర్మించడం మంచి ఫలితాలను ఇస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

4. బుధుడు:

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు ఉత్తర దిక్కుకు అధిపతి. సంపదకు అధిపతి అయిన కుబేరుడు కూడా ఈ దిశకు అధిపతి.అందువల్ల ఆదాయం, బంగారం, వెండి వంటి విలువైన వస్తువులను ఈ దిశలో ఉంచడం మంచిది.

5. గురుడు:

ఈశాన్య మూలను గురు లేదా బృహస్పతి పరిపాలిస్తారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ దిశకు శ్రీ హరి అధిపతి. గురువు అనుగ్రహం ఉన్నవారు జీవితంలో సంతోషంగా ఉంటారు.అందుకే ఈ దిశలో పూజగది ఉంటే మంచి ఫలితాలు వస్తాయి.

6. శుక్రుడు:

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు ఆగ్నేయ దిశకు అధిపతి .అగ్నిదేవత కూడా ఈ దిశలో ఉండటం శుభ పరిణామం. శుక్రుడు అందం, ఆనందం, విలాసానికి సంబంధించిన గ్రహంగా భావిస్తారు. కాబట్టి వాస్తు ప్రకారం వంటగది, విద్యుత్ సంబంధిత వస్తువులను ఈ దిశలో ఉంచడం మంచిది.

7. శని:

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని పశ్చిమ దిశకు అధిపతి. వరుణుడు కూడా ఈ దిశకు అధిపతి. కాబట్టి ఈ దిశ లాభాన్ని సూచిస్తుంది. శని కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి ఈ దిశలో పడకగది, గ్రంథాలయం మొదలైనవి ఉంటే మంచిది.

8. రాహువు:

జ్యోతిషశాస్త్రంలో రాహువును అశుభ గ్రహంగా పరిగణిస్తారు.అయితే వాస్తు ప్రకారం రాహువు నైరుతి దిశకు అధిపతి. ఈ దిశలో బాత్ రూమ్ లేదా ఆఫీసు ఏర్పాటు చేసుకోవచ్చు.అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తేలికపాటి వస్తువులను ఈ దిశలో ఉంచకూడదు. అయితే బరువైన వస్తువులను ఉంచవచ్చు.ఇక్కడ స్థలం ఖాళీగా ఉంచకూడదు.

గమనిక: ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

తదుపరి వ్యాసం