Bahraich Mysterious Temple: ఒక్క రోజులో మూడు అవతారాల్లో మారిపోయే అమ్మవారు కొలువైన ఆలయం, బహ్రాయిచ్ గుడి రహస్యం తెలుసా?
29 November 2024, 20:00 IST
- Bahraich Mysterious Temple: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్ గుడిలో ఓ మిస్టరీ దాగి ఉంది. ఇక్కడ అమ్మవారు రోజు మొత్తంలో మూడు అవతారాల్లోకి మారిపోతుంటారు. 50 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయం గురించి మరింత తెలుసుకోండి.
బహ్రాయిచ్ గుడి రహస్యం తెలుసా?
భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు, పురాతన ఆలయాలకు ప్రసిద్ధి గాంచింది. మన దేశంలో ఒక్కో దేవుడి ఆలయానికి ఒక్కో ప్రత్యేకమైన చరిత్ర, ప్రాముఖ్యత ఉంటుంది. సాధారణ ప్రజలకు మాత్రమే కాదు సైన్స్ కూడా అందని రహస్యాలెన్నో భారతదేశంలోని ఆలయాల్లో దాగి ఉన్నాయి. అలాంటి ప్రాచీనమైన చరిత్ర కలిగిన ఆలయాల్లో ఒకటి ఉత్తరప్రదేశ లోని సంతోషీ మాతా ఆలయం. ఈ ఆలయంలో అమ్మవారు ఒక్కరోజులోనూ మూడు అవతారాల్లో దర్శనమిస్తారు. ఆలయ చరిత్ర, విశిష్టత వంటి విషయాలను గురించి తెలుసుకుందాం.
లేటెస్ట్ ఫోటోలు
ఉత్తరప్రదేశ్ లోని బహ్రెయిచ్ సంతోషీ మాతా ఆలయం హిందూ విశ్వాసాలకు, నమ్మకాలకు ప్రతీక. యాబై సంవత్సరాల నాటి ఈ ఆలయంలో ఎన్నో మహిమలు, నమ్మకాలు, అద్భుతమైన సంఘటనలు జరిగాయి. ప్రత్యేకించి ఈ ఆలయ విశిష్టత గురించి చెప్పాలంటే, ఇక్కడ సంతోషిమాత తన రూపాన్ని రోజులో మూడు సార్లు మార్చుకుంటూ ఉంటారు. ప్రతి రూపంలోనూ భక్తులకు అనుగ్రహం కురిపించి వారి కోర్కెలను తీరుస్తారు. ఇక్కడ ఉదయం అమ్మవారు బాల సంతోషిమాతగా దర్శనమిస్తారు. మధ్యాహ్న సమయంలో కౌమార దశలో ఉన్న అమ్మవారిగా కనిపిస్తారు. ఇక సాయంత్రానికి యవ్వన రూపంలో కనిపిస్తారని చెబుతుంటారు.
ఏ రూపంలో కనిపించినా ఆ అమ్మవారు తమపై ఒకేలాంటి ఆశీర్వాదం కురిపిస్తారని ఆలయానికి విచ్చేసే భక్తులు చెబుతున్నారు. ఒకే రోజులో మూడు రూపాల్లో కనిపించే అమ్మవారి రూపం వెనుక రహస్యం ఇంతవరకూ అంతుచిక్కకుంది.
ఆలయ చరిత్ర
ఇక్కడ స్థానికంగా ఉండే ఒక వ్యాపారవేత్త తాను కోరుకున్న కోరిక నెరవేరడంతో 1969లో సంతోషిమాత కోసం ఇక్కడ ఆలయాన్ని నిర్మించాడట. అందుకోసం కాన్పూర్ లోని నైపుణ్యం కలిగిన కళాకారులను పిలిపించి దీనిని అద్భుతంగా సిద్ధం చేయించారు. దాంతోపాటు ఆలయ ప్రవేశ ద్వారంపై వేసిన రహస్య చిత్రాలు కొన్ని దశాబ్దాలుగా0 0భ0క్0తు0ల0ను ఆకర్షిస్తూనే ఉన్నాయి.
శుక్రవారం మరింత ప్రత్యేకం
ప్రతి రోజు జరిగిన దాని కంటే శుక్రవారం నాడు మరింత ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తుంటారు. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన శుక్రవారం చేసే ప్రార్థనలు త్వరగా నెరవేరతాయని భక్తుల నమ్మకం. అందుకే ఆ రోజుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. పూజ అనంతరం భక్తులు బెల్లం, పప్పు, ప్రసాదం పంపిణీ చేస్తారు.
ఆలయానికి వెళ్లే దారి
ఈ ఆలయం బహ్రెయిచ్ లోని ఘంటాఘర్ పవర్ హౌజ్ సమీపంలో ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులు ఇక్కడి నుంచే పూజా సామాగ్రిని ఇక్కడ కనిపించే అనేక దుకాణాల్లో ఎక్కడైనా కొనుగోలు చేసుకుని వెళ్లొచ్చు. ఆలయ వాతావరణం సమీపిస్తూ ఉంటేనే భక్తులకు మానసిక ప్రశాంతతను, ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది.
భక్తుల నమ్మకాలు
సంతోషిమాత ఆలయానికి విచ్చేసి తమ కోరికను నిస్వార్థంగా, అమ్మవారి ముందు ఉంచితే కచ్చితంగా నెరవేరుతుందని నమ్ముతారు. ఈ ఆలయం భక్తుల విశ్వాసానికి మాత్రమే ప్రతీక కాదు. వేల మంది ఆశలకు కూడా కేంద్రంగా మారింది. అమ్మవారి ఆశీస్సులు పొందడంతో పాటు అమ్మవారి దర్శనంలో మహిమలను చూడాలనుకుంటే బహ్రెయిచ్ లోని ఈ ఆలయాన్ని తప్పకుండా సందర్శించండి మరి.