తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Negitive Energies: తెలియక చేసే కొన్ని పొరపాట్లు ఇంట్లో ప్రతికూల శక్తులను పెంచుతాయట.. అవేంటో తెలుసా?

Negitive Energies: తెలియక చేసే కొన్ని పొరపాట్లు ఇంట్లో ప్రతికూల శక్తులను పెంచుతాయట.. అవేంటో తెలుసా?

Ramya Sri Marka HT Telugu

29 November 2024, 18:01 IST

google News
    • Negitive Energies: మనిషి సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలంటే ప్రతికూల శక్తులకు దూరంగా ఉండాలి. వాస్తు శాస్త్రం ప్రకారం తెలిసో తెలియకో రోజూ చేసే కొన్ని పొరపాట్లు జీవితాన్ని ప్రతికూల శక్తులతో నింపుతాయిట. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.  
వాస్తు సలహాలు
వాస్తు సలహాలు

వాస్తు సలహాలు

భూమి మీద నివసిందే ప్రతి జీవికీ కొన్ని నియమాలు ఉన్నాయి. వాటి ప్రకారం జీవనం సాగించకపోతే సమస్యలు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. మనిషి సుఖంగా, సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలంటే కొన్ని నియమాలను తప్పక పాటించాల్సి ఉంటుంది. సంప్రదాయాలు, జ్యోతిష్య శాస్త్రం, వాస్తు శాస్త్రం ఇవన్నీ వ్యక్తి జీవితాన్ని గురించి కొన్ని పద్ధతులు, నియమాలను నిర్దేషించాయి. వాటి అనుగుణంగా జీవించకపోతే ఎన్నో ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని నియమాలను పాటించకపోతే మనిషి చుట్టూ ప్రతికూల శక్తులు పెరిగి జీవితాన్ని నాశనం చేస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం జీవితం నుండి ప్రతికూల శక్తులను తొలగించడానికి, కొన్ని పరిహారాలు, వాస్తు నియమాలను పాటించడం చాలా ముఖ్యం. ప్రతిరోజూ లేదా కొన్నిసార్లు మనకు తెలియకుండా చేసే చిన్న చిన్న పొరపాట్లు ప్రతికూల శక్తులను ఆహ్వానించి జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.

లేటెస్ట్ ఫోటోలు

Naval Dockyard Apprentice 2024 : విశాఖ నేవల్ డాక్ యార్డ్ లో 275 అప్రెంటీస్ ఖాళీలు - ముఖ్య తేదీలివే

Nov 29, 2024, 09:54 PM

BMW M2: భారత్ లో బీఎండబ్ల్యూ ఎం2 లేటెస్ట్ ఎంట్రీ.. స్టైలింగ్ లో తిరుగులేని స్పోర్ట్ కూపే ఇది..

Nov 29, 2024, 09:50 PM

Hair fall problem: చలి కాలంలో జుట్టు ఊడే సమస్యకు కారణాలివే..

Nov 29, 2024, 09:31 PM

త్వరలో ఈ నాలుగు రాశుల వారికి మెండుగా అదృష్టం.. సంపద, ఆనందం!

Nov 29, 2024, 07:01 PM

AP Tourism : ఆంధ్ర ఊటీ అరకులోయ సిగలో.. మరో పర్యాటక సోయగం.. డోంట్ మిస్

Nov 29, 2024, 02:41 PM

TG Weather Updates : రేపట్నుంచి తెలంగాణలోనూ వర్షాలు - ఈ జిల్లాలకు IMD హెచ్చరికలు, తాజా వెదర్ రిపోర్ట్ ఇదిగో

Nov 29, 2024, 02:28 PM

ఇంట్లో ప్రతికూల శక్తులుంటే ఏమవుతుంది?

వాస్తు శాస్త్రం ప్రకారం, ప్రతికూల శక్తులు అంటే భూతాలు, దెయ్యాలు, పిశాచాలు, ఇతర నెగటివ్ ఎనర్జీలు మనిషి జీవితంపై అనేక విధాలుగా ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయి. ఇంట్లో లేదా కార్యాలయంలో ఇవి ప్రవేశించడం వల్ల తరచూ శారీరక ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వ్యాపారాల్లో నష్టాలు, మానసిక ఒత్తిడి, ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం, నిరాశ, ఆందోళన, నెగిటివిటీ, కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు, పనుల్లో పరాజయాలు, ప్రయత్నాల్లో లోపాలు, నిద్రలేమి, అశాంతి, భయం వంటి సమస్యలు తలెత్తుతాయి.

ప్రతికూల శక్తుల నుంచి తప్పించుకోవడం ఎలా..?

  • ప్రముఖ వాస్తు సలహాదారు ఆచార్య ముకుల్ రస్తోగి ప్రకారం.. కొన్ని చిన్న విషయాలలో జాగ్రత్త వహించడం ద్వారా జీవితంలో ప్రతికూలతను తగ్గించవచ్చు. అవేంటంటే
  • చాలా మంది రెండు లేదా మూడు రోజుల పాటు ఒకే దుస్తులను ధరిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇది సరైన పద్ధతి కాదు. వరుసగా అవే దుస్తులు వేసుకోవడం వల్ల అవి ప్రతికూల శక్తులకు నిలయంగా మారతాయి.
  • గోర్లను ఎక్కువగా పెంచుకోకూడదు. గోరులో పేరుకుపోయిన మురికి వ్యక్తి జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
  • బూట్లు లేదా చెప్పులను శుభ్రం చేయకుండా ఎక్కువసార్లు ధరించకూడదు. చెప్పుడు చెడు శక్తులకు నిలయంగా మారతాయి. ఎప్పటికప్పుడు వాటిని శుభ్రం చేసుకోవాలి.
  • పాత వార్తాపత్రికలను ఎక్కువ రోజులు ఇంట్లో ఉంచకూడదు. ఇది ఇంట్లో నెగిటివిటీని వ్యాపింపజేస్తుంది.
  • ఇంట్లో పాజిటివిటీ పెరగాలంటే పరిశుభ్రత, తగినంత వెలుతురు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అలాగే పచ్చని చెట్లు, మొక్కలను పెంచాలి. వాడిపోయిన చెట్లను ఇంట్లో అస్సలు ఉంచకూడదు.
  • వాస్తు ప్రకారం ఆగిన లేదా పాడైపోయిన గడియారాన్ని కూడా ఇంట్లో ఉంచకూడదు. ఇది సమయం ఆగిపోవడాన్ని సూచిస్తుంది. కాబట్టి దాన్ని వెంటనే రిపేర్ చేయించాలి లేదా కొత్తది కొనాలి.
  • పాత, విరిగిపోయిన వస్తువులు, పనికిరాని బట్టలు ఆథ్మాత్మికతకు, యథార్థానికి దూరంగా ఉంచుతాయి. కనుక వీటిలో ప్రతికూల శక్తులు నిలిచి ఉంటాయి.
  • రాత్రి పూట కత్తులు, బ్లేడులు వంటి ఆయుధాలను బయట ఉంచకూడదు. ఈ వస్తువులు ఇంట్లో ప్రతికూల శక్తుల ప్రవేశానికి కారణం అవుతాయని నమ్మకాలు ఉన్నాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

తదుపరి వ్యాసం