తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Dasara Remedies: అపరాజిత పూలతో దసరా రోజు ఇలా చేయండి- డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి

Dasara remedies: అపరాజిత పూలతో దసరా రోజు ఇలా చేయండి- డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి

Gunti Soundarya HT Telugu

11 October 2024, 19:37 IST

google News
    • Dasara remedies: దసరా రోజు పూజలో అపరాజిత పూలతో పూజ చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. నీలం రంగు పూలతో ఈ పరిహారాలు పాటించడం వల్ల డబ్బు సమస్యలు తొలగిపోతాయి. ధనం సమకూరుతుంది. పేదరికం తొలగిపోతుంది. 
అపరాజిత పూలు
అపరాజిత పూలు (pixabay)

అపరాజిత పూలు

దేవి శరన్నవరాత్రులు ముగిశాయి. అక్టోబర్ 12న దసరా పండుగ జరుపుకుంటారు. విజయానికి చిహ్నంగా విజయ దశమి జరుపుకుంటారు. హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ఈ ప్రత్యేకమైన పండుగ రోజున అపరాజిత దేవిని కూడా పూజిస్తారు. దేవి అంశతో అపరాజితా దేవి ఉద్భవించింది.

లేటెస్ట్ ఫోటోలు

Mahakumbh 2025: కుంభమేళాలో జన సంద్రంగా త్రివేణి సంగమం

Jan 15, 2025, 10:17 PM

TG Indiramma Housing Scheme : జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఆమోదం తప్పనిసరి! ఆ తర్వాతే జాబితాల ప్రకటన, ప్రాసెస్ ఎలా ఉంటుందంటే?

Jan 15, 2025, 08:05 PM

India Women Cricket Team: ఇండియా వుమెన్ క్రికెట్ టీమ్ సరికొత్త చరిత్ర.. 304 పరుగులతో విజయం

Jan 15, 2025, 07:37 PM

TG Praja Palana Applications : ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోలేదా..? ఆలస్యం చేయకుండా వెంటనే ఇలా చేయండి

Jan 15, 2025, 06:29 PM

Godari Gattu Song: వ్యూస్‍లో భారీ మైల్‍స్టోన్ దాటేసిన ‘గోదావరి గట్టు మీద’ పాట.. దూసుకెళుతున్న సాంగ్

Jan 15, 2025, 05:32 PM

Sankranthi Celebrations: కీర్తి సురేష్ నుంచి నయనతార వరకు.. స్టార్ల సంక్రాంతి సంబరాలు చూశారా?

Jan 15, 2025, 04:28 PM

తలపెట్టిన అన్ని పనుల్లో విజయాన్ని కోరుకుంటూ దసరా రోజు అపరాజిత దేవిని పూజించే ఆచారం కూడా ఉంది. అది మాత్రమే కాదు జీవితంలోని అనేక సమస్యల నుంచి బయట పడేందుకు అపరాజిత పుష్పాలతో కొన్ని పరిహారాలు చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడతారు.

పేదరికం తొలగిపోయేందుకు

ఎంత కష్టపడినా డబ్బులు ఇంట్లో నిలవవు. ఆదాయం బాగున్నా అంతకంటే ఖర్చులు ఇబ్బంది పెడతాయి. డబ్బు ఆదా చేయలేకపోతారు. అటువంటి పరిస్థితిలో మీరు ఉన్నారా? అయితే దసరా రోజు ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో శంఖు పూలు వేయాలి. ఈ మాత్రను ఇంటి ఈశాన్య మూలలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో పేదరికం తొలగిపోతుంది. ఆర్థిక కష్టాలు నిలిచిపోతాయి. కుటుంబంలోని సమస్యలు తొలగిపోతాయి.

పర్సులో పెట్టుకోండి

లక్ష్మీదేవికి శంఖు పూలతో పూజ చేయాలి. ఆ తర్వాత పూలను మీ పర్సులో జాగ్రత్తగా ఉంచుకోండి. లేదంటే డబ్బు నిల్వ చేసే ప్రదేశంలో ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. డబ్బు ప్రవాహం పెరుగుతుంది. ఖర్చులు తగ్గుముఖం పడతాయి. ధనం పెద్ద మొత్తంలో సమకూరుతుంది. పదకొండు అపరాజిత పూలతో దండను తయారు చేసి అమ్మవారికి సమర్పించాలి. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

ఆర్థిక కష్టాలు తొలగేందుకు

ఆర్థిక ఇబ్బందులు కుటుంబాన్ని చాలా కష్టపెడతాయి. అటువంటి సమస్య మీకు ఎదురవుతుంటే దసరా రోజు చంద్రుడికి అపరాజిత పూలు సమర్పించాలి. ఇలా చేస్తే ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో నివసించేలా చేస్తుంది. అలాగే కుటుంబంలో సమస్యలు తరచూ ఇబ్బంది పెడుతుంటే దసరా రోజు స్నానం చేసే నీటిలో ఈ పువ్వులు వేసుకుని చేయాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో ప్రశాంతత నెలకొంటుంది. అదృష్టం అండగా నిలుస్తుంది. పనులు సకాలంలో పూర్తి అవుతాయి.

శంఖు పూలు శనీశ్వరుడికి కూడా ఎంతో ప్రీతికరమైనవి. ఈ ఏడాది శనివారం దసరా రావడం వల్ల శనీశ్వరుడికి కూడా పూజ చేయవచ్చు. అపరాజిత పూలు సమర్పించి పూజ చేస్తే శని అనుగ్రహం తొలగిపోతుంది. శని దోషాల నుంచి విముక్తి కలుగుతుంది. ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటాయి. డబ్బు సమస్యల నుంచి బయట పడేయడంలో ఈ పూలు చాలా శక్తివంతంగా పని చేస్తాయని నమ్ముతారు. శని అనుగ్రహంతో జీవితంలోని సమస్యలు తొలగిపోతాయి.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

 

తదుపరి వ్యాసం