Dhanusu Rasi 2025 Telugu: ధనుస్సు రాశి ఫలాలు..దుష్టులతో సహవాసం, శుభకార్యాలకు ఆటంకం
14 December 2024, 13:23 IST
- Dhanusu Rasi 2025 Telugu: ధనుస్సు రాశి జాతకులకు 2025 రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ హిందుస్తాన్ టైమ్స్ తెలుగు పాఠకులకు అందిస్తున్న జాతక ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
ధనుస్సు రాశి జాతకులకు 2025 రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?
2025 సంవత్సరం నందు ధనూ రాశి ఫలితములు చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా బృహస్పతి మే నుండి ఏడవ స్థానమునందు సంచరించటం, శని నాలుగవ స్థానమునందు సంచరించుట చేత, రాహువు మే నుండి మూడవ స్థానము నందు మరియు కేతువు మే నుండి తొమ్మిదవ స్థానమునందు సంచరించుటచేత ధనూరాశి వారికి 2025 సంవత్సరం అంత అనుకూలంగా లేదు. అర్ధాష్టమ శని ప్రభావంచేత ధనూరాశి వారికి ఈ సంవత్సరం సమస్యలు, చికాకులు అధికమగును. అయినప్పటికి బృహస్పతి యొక్క ప్రభావం వలన ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు.
లేటెస్ట్ ఫోటోలు
ఎవరికి ఎలా ఉండబోతుంది?
నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నములో ఆటంకములు ఎదురగును. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ఆరోగ్య విషయాలయందు జాగ్రత్త వహించాలి.ధనూరాశి విద్యార్థులకు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి. విద్యార్థులు శ్రద్ధ వహించాలి. ధనూరాశి స్త్రీలకు కుటుంబములో వాదనలు మరియు ఘర్షణ వాతావరణం వంటివి ఏర్పడు సూచన. వ్యాపారస్తులకు వ్యాపారంలో మధ్యస్థ ఫలితములు సంభవించును.
ఈ సంవత్సరం ధనూరాశివారికి కుటుంబపరమైనటువంటి చికాకులను, కుటుంబ సమస్యలను అధికంగా పొందు సూచన. కుటుంబ సభ్యులతో ఆచి తూచి వ్యవహరించండి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు వహించడం మంచిది. రాజకీయ నాయకులకు రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్ళు అధికముగా ఉండును. రైతాంగానికి శుభ ఫలితాలు కలుగును.
పాటించాల్సిన పరిహారాలు..
ధనూరాశి 2025 సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేసుకోవటం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నువ్వులను దానం ఇవ్వండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని
పఠించండి.
ధనూ రాశి వారికి ఏ నెల ఎలా ఉండబోతుంది..
జనవరి 2025 :-
ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. మీరు చేసే ప్రతి పని కలసివచ్చును. స్నేహితుల విందులలో పాల్గొంటారు. వాహన సౌఖ్యం. ఇంటియందు శుభములు. అలంకార వస్తు లాభములుంటాయి. దూరప్రయాణాలు. స్త్రీ విరోధములు. అనుకోని ప్రయాణాలుంటాయి.
ఫిబ్రవరి 2025:-
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. గౌరవం తగ్గును. అనారోగ్య సమస్య లుంటాయి. కొన్ని శుభకార్యాలకు ఆటంకాలు. మాట పట్టింపుల వల్ల ద్వేషం, కలహాలు. లాభాలు అంతగా కలసిరావు. ఆడంబరములకై ధనం ఖర్చు చేసెదరు. దుష్టుల సహవాసం.
మార్చి 2025:-
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. కుటుంబములో వృథా ఖర్చులుంటాయి. గృహ మార్పులు. దాన ధర్మాలు చేస్తారు. స్నేహబాంధవ్యాలు పెరుగను. స్త్రీ సహాయం. కుటుంబ కలహాలుంటాయి. ఆదాయం పెరుగును. కొన్ని విషయాలలో ఓటమి.
ఏప్రిల్ 2025 :-
ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. సంతానమునకు కష్టములు. తల్లి దండ్రులకు అనారోగ్యము. ఇంటియందు సమస్యలు. ఏ పని తలపెట్టినా కలసిరాదు. స్నేహితుల సహకారం. ఉన్నత విద్యకు ఆటంకం. దంపతుల మధ్య విరోధాలు. అస్వస్థత. ఆందోళన. ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. వస్త్రములు, వాహనములు కొనుగోలు చేస్తారు. భూ, గృహ సమస్యలు అనుకూలించును. అధికార లాభములు, దాన ధర్మములు చేయుదురు. మంచి గౌరవం. దూరప్రాంతపు వ్యాపారములు కలసివచ్చును.
మే 2025 :-
ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. వస్త్రములు, వాహనములు కొనుగోలు చేస్తారు. భూ, గృహ సమస్యలు అనుకూలించును. అధికార లాభములు, దాన ధర్మములు చేయుదురు. మంచి గౌరవం. దూరప్రాంతపు వ్యాపారములు కలసివచ్చును.
జూన్ 2025 :-
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. పనుల యందు ఆలస్యం జరుగును. మానసికాందోళన. ప్రయాణముల యందు సౌఖ్యము. భార్యాభర్తల మధ్య చికాకులు పెరుగును. ప్రేమలో సఫలత. మీ వల్ల ఇతరులకు హాని కలుగుతుంది. ఇంటియందు శుభకార్యములు.
జూలై 2025 : -
ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. స్థిరాస్తులను వృద్ధి చేయుట. కోర్టు వ్యవహారముల యందు జయము. భయాందోళనలుంటాయి. భూ, గృహ మార్పులు. మంచి గౌరవముంటుంది. చెడు వ్యసనాల వల్ల ఇబ్బందులు. పూజలు, వ్రతములు చేయుదురు.
ఆగస్టు 2025 :-
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ఖర్చులు పెరుగును. వ్యాపారపరంగా లాభదాయకం. శత్రువులు మిత్రులుగా మారెదరు. శరీరం నందు అనుకోని మార్పులు, అనారోగ్యములు. రాజకీయ వ్యవహారములలో తిరుగుతారు. శుభకార్యాలు కలసివచ్చును
సెప్టెంబర్ 2025 :-
ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. అనుకోని ప్రయాణాలుంటాయి. పుత్రులతో గొడవలు. శరీరమునందు బద్ధకం, నీరసం, మందబుద్దిగా నడుచును. గృహం లేక భూమి కొనుట. సంతాన సౌఖ్యము. వ్యాపారస్తులకు లాభదాయకం. ధనలాభములు.
అక్టోబర్ 2025 :-
ఈ మాసం మీకు అనుకూల సమయం. ప్రతి పనీయందు ఉత్సాహం. మానసికా నందము. అలంకార ప్రాప్తి. ధనవ్యయం. కొత్తవారితో పరిచయాలుంటాయి. వ్యర్థపు ఆలోచనలు చేయుదురు. పెద్దలతో తిరుగుతారు. స్నేహితులతో మోసం జరుగును.
నవంబర్ 2025 :-
ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. దేవాలయ దర్శనాలు. దాన ధర్మములు చేయుదురు. ఆదాయం బాగుండును. శతృ జయం. పెద్దవారితో గొడవలు, అధికార ఒత్తిడి. భార్యాభర్తల మధ్య ఎడబాటు. శుభకార్యాలు కలసివచ్చును. చేసే పనులలో చిక్కులు తీరును.
డిసెంబర్ 2025 :-
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ధననష్టం. మానసికాందోళన. భయం. సంఘం నందు గౌరవం తగ్గును. విద్యయందు ఆసక్తి. జ్ఞాపకశక్తి పెరుగును. ఖర్చులు అధికమగును. రుణబాధలు. మీ సంతానం మీద కోపంగా వ్యవహరించెదరు.