Dhanu sankranti: ఈసారి ధను సంక్రాతి ఎప్పుడు వచ్చింది? ఆ రోజు ఇలా చేస్తే మీ కష్టాలు తొలగిపోవచ్చు, ఆర్థిక బాధలు కూడా ఉండవు
14 December 2024, 11:25 IST
- Dhanu sankranti: ధను సంక్రాంతి నాడు ఏం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి..?, ధను సంక్రాంతి ఎప్పుడు వచ్చింది..?, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి ధను సంక్రాంతి నాడు ఏం చేస్తే బాగుంటుంది అనే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Dhanu sankranti: ఈసారి ధను సంక్రాతి ఎప్పుడు వచ్చింది?
జ్యోతిష్యం ప్రకారం సూర్యుడు రాశిని మార్చడానికి ప్రత్యేక అర్థం ఉంది. ధను సంక్రాంతితో కర్మలు కూడా మొదలవుతాయి. ధను సంక్రాంతి నాడు ఏం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి..?, ధను సంక్రాంతి ఎప్పుడు వచ్చింది..?, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి ధను సంక్రాంతి నాడు ఏం చేస్తే బాగుంటుంది అనే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
లేటెస్ట్ ఫోటోలు
ధను సంక్రాతితో మంచి ఫలితాలు:
ధను సంక్రాంతి సమయంలో సూర్యుడు ఇంకా ఎక్కువ సానుకూల శక్తిని కలిగి ఉంటారు. ఇటువంటి సమయంలో విజయాన్ని అందుకోవచ్చు. సమస్యల నుంచి బయటపడడానికి కూడా మంచి సమయం. కనుక ఈ ధను సంక్రాతి నాడు ఈ కింది చెప్పినట్టు చేస్తే, మంచి ఫలితాలను పొందొచ్చు.
ఈసారి ధను సంక్రాతి ఎప్పుడు వచ్చింది?
ఈసారి ధను సంక్రాంతి డిసెంబర్ 16న వచ్చింది. డిసెంబర్ 16న ధను సంక్రాంతి నాడు సూర్యుడిని ఆరాధించడం వలన ఆయన ఆశీస్సులు కలుగుతాయి. సంతోషంగా ఉండవచ్చు. అయితే, ధను సంక్రాంతి నుంచి మకర సంక్రాంతి వరకు శుభకార్యాలు చేయడం వంటివి చేయకూడదు.
ధను సంక్రాతి నాడు ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలి?
ధను సంక్రాంతి నాడు వీటిని అనుసరించడం వలన ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే సమస్యలన్నీ తీరి, సంతోషంగా ఉండడానికి అవుతుంది. ధను సంక్రాంతి నాడు త్వరగా నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. సూర్య భగవానుడిని ఆరాధిస్తే సమస్యలన్నీ తీరిపోతాయి.
విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఆరాధించండి:
సంక్రాంతి నాడు విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఆరాధిస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది. ధను సంక్రాంతి నాడు మహామృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు చదువుకుంటే చేసే ప్రతీ పనిలో కూడా విజయాన్ని అందుకోవచ్చు.
గాయత్రీ మంత్రం:
ఈ రోజు గాయత్రీ మంత్రాన్ని జపిస్తే కూడా మంచిది. పూర్వీకుల అనుగ్రహాన్ని పొందవచ్చు.
దానం:
ఎవరికైనా దానం చేయడం, లేని వారికి ఏమైనా సహాయం అందించడం వలన కూడా ధను సంక్రాంతి నాడు మంచి ఫలితాలని అందుకోవచ్చు. ఆర్థిక బాధల నుంచి కూడా గట్టెక్కచ్చు. ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతాయి. చనిపోయిన వారిని తలచుకుని పూజిస్తే కూడా సానుకూల శక్తి ప్రవహిస్తుంది. జీవితంలో మంచి మార్పులు వస్తాయి. చలికాలం కాబట్టి ధను సంక్రాంతి నాడు దుప్పట్లు వంటివి కూడా దానం చేయొచ్చు. ఇలా చేస్తే కూడా మీ సమస్యలు తొలగిపోయి సంతోషంగా ఉండవచ్చు.
శాంతి కోసం ధను సంక్రాతి నాడు ఇలా చేయండి:
ధను సంక్రాంతి నాడు ఉప్పు లేని ఆహారం తీసుకోవాలి. ఆలా చేయడం వలన పూర్వీకుల నుండి దీవెనలు అందుతాయి. శాంతి కోసం పూర్వీకులను కూడా ప్రార్థించవచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.