Chinese Horoscope: ఈరోజు జాగ్రత్తగా ఉండాల్సిన 3 చైనీస్ రాశిచక్ర గుర్తులు.. ఆఫీసులోనూ ఇబ్బందులు రావొచ్చు
18 January 2025, 12:00 IST
- Chinese Horoscope: ఈ మూడు గ్రూపులకు చెందిన వ్యక్తులు కొన్ని ఇబ్బందుల్ని ఈరోజు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇబ్బందుల్ని ఎదుర్కోకుండా ఉండడానికి వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండడం మంచిది. అప్పుడు సమస్యలు నుంచి బయటపడడానికి అవుతుంది.

Chinese Horoscope: ఈరోజు జాగ్రత్తగా ఉండాల్సిన 3 చైనీస్ రాశిచక్ర గుర్తులు
మనకు ఎలా అయితే మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశులు ఉన్నాయో చైనీస్ జ్యోతిష్యం ప్రకారం 12 జంతువులు ఉంటాయి. పుట్టిన సంవత్సరం ఆధారంగా ఏ గ్రూపుకి చెందిన వారు అనేది తెలుసుకోవచ్చు. అయితే ఈ మూడు జంతువుల గ్రూప్ కి చెందిన వారు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి.
లేటెస్ట్ ఫోటోలు
Sun Saturn Conjunction:సూర్యుడు, శని కలయికతో ఈ 3 రాశులకు లక్కే లక్కు.. పనిలో విజయం, సంతోషంతో పాటు ఎన్నో
విజయానికి కేరాఫ్ అడ్రెస్ ఈ 3 రాశులు- కష్టాలు దూరం, ఉద్యోగంలో ప్రమోషన్..
Weekly Love Horoscope : ఈ ఆరు రాశులవారికి వీక్లీ లవ్ జాతం ఎలా ఉంది?
ఇక అదృష్టమంతా ఈ 3 రాశుల వారిదే! ఆర్థిక కష్టాలు దూరం, వ్యాపారంలో ధన లాభం..
09 February 2025 horoscope: రేపు మీ రాశి వారికి ఎలా ఉండబోతోంది? 9 ఫిబ్రవరి 2025, ఆదివారం రాశి ఫలాలు
ఈ మూడు రాశుల వారికి మరో వారం చాలా అదృష్టం.. ఆర్థిక ప్రయోజనాలు, సంతోషం దక్కుతాయి!
ఈ మూడు గ్రూపులకు చెందిన వ్యక్తులు కొన్ని ఇబ్బందుల్ని ఈరోజు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇబ్బందుల్ని ఎదుర్కోకుండా ఉండడానికి వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండడం మంచిది. అప్పుడు సమస్యలు నుంచి బయటపడడానికి అవుతుంది. మరి మీ గ్రూప్ కూడా ఉందేమో చూసుకుని జాగ్రత్త పడటం మంచిది.
1.ఎద్దు
ఎద్దు గ్రూప్ (1925, 1937, 1949, 1961, 1973, 1985, 1997, 2009, 2021) చెందిన వారు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఎద్దు గ్రూప్ చెందిన వారు ఆఫీసుకు చెందిన విషయాల్లో ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు తీసుకున్న బాధ్యతలు వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
కమ్యూనికేషన్ సరిగా లేకపోవడం, కష్టంగా అనిపించడం ఇలాంటివి సంభవించొచ్చు. ఇలా చిన్నచిన్న కారణాల వలన ప్రాజెక్టులు ఆలస్యం అవ్వచ్చు. అనుకున్న పనులు వాయిదా పడొచ్చు. ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. మీ రిలేషన్ షిప్ లో కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాస్త సహనంతో, ఓపికతో వ్యవహరించండి.
2. కుందేలు
కుందేలు గ్రూప్ ((1927, 1939, 1951, 1963, 1975, 1987, 1999, 2011, 2023)) కి చెందిన వ్యక్తులకి ఈరోజు కొన్ని కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అపార్థం చేసుకోవడం వలన ఇబ్బందులు వస్తాయి. కోపం కలగవచ్చు. బంధంలో కూడా ఇబ్బందులు రావచ్చు. మీ పనిలో ఉన్న డిమాండ్లు లేదా ఊహించని మార్పులు వలన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు వంటి విషయాల్లో ఒత్తిడికి గురవచ్చు. కుందేలు గ్రూప్ కి చెందిన వారు అనవసరమైన ఖర్చుల్ని తగ్గించుకోవాలి. శాంతి, స్పష్టత కలిగించే వాటిపై దృష్టి పెట్టాలి.
3. మేక
మేక గ్రూప్ ((1931, 1943, 1955, 1967, 1979, 1991, 2003, 2015, 2027) కి చెందిన వారు కూడా ఈరోజు చిన్న చిన్న ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రాజెక్టులు ఆలస్యం అవ్వడం వంటి ఇబ్బందులు కలగవచ్చు. ఊహించని ఖర్చులు కారణంగా ఆందోళన చెందవచ్చు.
చిన్నపాటి వివాదాలు, అపార్ధాలు పరిష్కరించుకోవడానికి కాస్త సమయాన్ని కేటాయించండి. రిలేషన్ షిప్ లో కూడా చిన్న చిన్న ఇబ్బందులు కలగవచ్చు. అనవసరంగా ఇబ్బందుల్ని కొని తెచ్చుకోవద్దు. లక్ష్యాలకు కట్టుబడి ఉండండి. నష్టాలకి దూరంగా ఉండండి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.