తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Powerful Mantralu: మానసిక ప్రశాంతతను అందించే శక్తివంతమైన మంత్రాలు ఇవి-వీటిని పఠించండి ఒత్తిడి ఉండదు

Powerful mantralu: మానసిక ప్రశాంతతను అందించే శక్తివంతమైన మంత్రాలు ఇవి-వీటిని పఠించండి ఒత్తిడి ఉండదు

Gunti Soundarya HT Telugu

05 September 2024, 15:27 IST

google News
    • Powerful mantralu: మనసులో అశాంతి నెలకొంటే ఏ పని మీద దృష్టి సారించలేరు. ఈ ఒత్తిడి, ఉరుకుల పరుగుల జీవితంలో మనశ్శాంతి అనేది కరువైంది. దాన్ని పొందటం కోసం మీరు రోజులో కొద్ది సేపు ఈ శక్తివంతమైన మంత్రాలు పఠించండి. మనసు రిలాక్స్ గా అనిపిస్తుంది. 
మానసిక ప్రశాంతతను ఇచ్చే శక్తివంతమైన మంత్రాలు ఇవి
మానసిక ప్రశాంతతను ఇచ్చే శక్తివంతమైన మంత్రాలు ఇవి (pixabay)

మానసిక ప్రశాంతతను ఇచ్చే శక్తివంతమైన మంత్రాలు ఇవి

Powerful mantralu: మనసులో అశాంతి నెలకొంటే జీవితం అల్లకల్లోలంగా మారిపోతుంది. ఏ పని మీద మనసు లగ్నం చేయలేరు. వాటిని అధిగమించేందుకు మానసిక ప్రశాంతతను పొందేందుకు ఉన్న శక్తివంతమైన మార్గం మంత్రాలను పఠించడం. కొన్ని మంత్రాలు జపించడం వల్ల ప్రతికూలతలు అధిగమించవచ్చు.

లేటెస్ట్ ఫోటోలు

January 17 horoscope: ఈ శుక్రవారం మీకు ఎలా ఉండబోతోంది? రేపటి మీ రాశి ఫలాలు తెలుసుకోండి..

Jan 16, 2025, 09:26 PM

January 16 horoscope: రేపు మీ రాశి ఫలం ఎలా ఉండబోతోందో, పరిహారాలేంటో తెలుసుకోండి?

Jan 15, 2025, 10:36 PM

రెండు గ్రహాల ప్రభావం.. ఈ రాశుల వారికి అధికంగా అదృష్టం.. ఆదాయం, ఆనందం పెరుగుతుంది!

Jan 14, 2025, 10:50 PM

January 15 horoscope: జనవరి 15 మీకు ఎలా ఉండబోతోంది? రేపటి రాశిఫలాలను ఈ రోజే తెలుసుకోండి!

Jan 14, 2025, 09:05 PM

ఈ రాశుల వారికి కష్టకాలం- చేతిలో డబ్బు ఉండదు, ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి..

Jan 14, 2025, 05:48 AM

ఈ వారంలోనే ఈ నాలుగు రాశుల వారికి లక్కీ టైమ్ షురూ.. ధనం, సంతోషం, సక్సెస్!

Jan 12, 2025, 07:20 PM

మనసుకు శాంతి లభిస్తుంది. భయాన్ని తొలగించుకోవచ్చు. ఆర్థిక శ్రేయస్సును పొందటం కోసం జీవితంలో శాంతి, ప్రశాంతత కోసం ఈ ఆరు మంత్రాలు పఠించి చూడండి. ఇవి మిమ్మల్ని మరింత సమర్థవంతంగా మారుస్తాయి. మీలోని శక్తిని రెట్టింపు చేస్తాయి. మీరు ఏ మంత్రాన్ని జపిస్తున్నారు అనే దాని మీద వాటి సానుకూల ప్రభావాలు ఆధారపడి ఉంటాయి. మనశ్శాంతి కోసం ఈ మంత్రాలు పఠించండ.

ఓం నమః శివాయ

మీకు శాంతి, ప్రశాంతతను అందించగల సులభమైన అత్యంత శక్తివంతమైన మంత్రాలలో ఒకటి ఓం నమః శివాయ. ఇది శివునికి అంకితం చేసిన మంత్రం. శివుడికి నమస్కరిస్తూ దైవ శక్తులను ఆహ్వానించుకునేందుకు ఇది దోహదపడుతుంది. కోపం, భయం, ఒత్తిడిని తొలగించేందుకు ఈ మంత్రం సహాయపడుతుంది. శాంతి, నిశ్చలత్వానికి ప్రతిరూపమైన శివ శక్తితో వ్యక్తిని సమం చేస్తాయి. ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల మీ చుట్టూ ప్రకాశవంతమైన శక్తి ఏర్పడుతుంది. ఎటువంటి హాని మీ దరి చేరదు.

మహా మృత్యుంజయ మంత్రం

మంత్రం - ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం, ఉర్వారుకమివ బంధనన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్.

శివుడికి సంబంధించిన మరొక శక్తివంతమైన మంత్రం మహా మృత్యుంజయ మంత్రం. మరణ భయాన్ని జయించడంలో సహాయపడుతుంది. ప్రశాంతమైన మనసును ఇస్తుంది. ఇందులోని పదాలు ఉచ్చరించడం వల్ల ఆందోళన, భయం తొలగిపోతుంది. శివుని శక్తి మీకు అండగా నిలుస్తుంది. సవాళ్ళను స్వీకరించే ధైర్యం, సామర్థ్యం పెరుగుతాయి.

గాయత్రీ మంత్రం

గాయత్రీ మంత్రం అనేది అత్యంత శక్తివంతమైన వేద మంత్రాలలో ఒకటి. గాయత్రీ మంత్రానికి మనస్సు, శరీరాన్ని శుద్ధి చేసే శక్తి ఉంది. ఏదైనా ప్రతికూల ఆలోచనలను తొలగించేస్తుంది. మనసుకు ఒక స్పష్టతను ఇస్తుంది. ఈ మంత్రాన్ని పదే పదే జపించినడం వల్ల విశ్వం శక్తిని ప్రసారం చేయడంలో సహాయపడుతుంది. మీ సమస్యల నుంచి బయట పడేందుకు ఈ మంత్రం పఠించవచ్చు. దీన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల సానుకూలత, సమతుల్యత మనసును సృష్టించడంలో సహాయపడుతుంది. మానసిక ప్రశాంతతను ఇస్తుంది.

ఓం గణ గణపతయే నమః

గణేషుడికి సంబంధించి శక్తివంతమైన మంత్రం ఇది. దీన్ని పఠిస్తే అడ్డంకులు తొలగిపోతాయి. వినాయకుడి శక్తి, ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి. మీ మనసులోని చింతలు అన్నీ తొలగిపోతాయి. ఒత్తిళ్ళ నుంచి బయట పడి మనసు ప్రశాంతంగా ఉంటుంది.

ఓం నమో భగవతే వాసుదేవాయ

విష్ణువుకు అంకితం చేసిన మంత్రం ఇది. ఓం శబ్ధంతో ప్రారంభమవుతుంది. అన్నీ శక్తులను ఇది కేంద్రీకరిస్తుంది. వ్యక్తిని శక్తివంతం చేసేందుకు సహాయపడుతుంది. అంతర్గత శాంతిని పెంపొందించేందుకు సహాయపడుతుంది. విష్ణు మూర్తి మీకు ఎల్లప్పుడూ రక్షణగా నిలుస్తూ సహాయం చేస్తాడు.

ఓం శాంతి

ఓం శాంతి అనే ఈ రెండు పదాలు విశ్వం శక్తిని, సానుకూలతను కలిగి ఉంటాయి. ఓం అనేది విశ్వం శబ్దం. ఈ మంత్రాన్ని ఎవరైన పదే పదే జపించడం వల్ల జీవితంలో ప్రశాంతత నెలకొంటుంది. వాస్తవానికి ఓం శాంతిని జపించడం అంటే మిమ్మల్ని మీరు రక్షించుకోవడమే. మీలో దాగున్న అంతర్గత శక్తిని ప్రేరేపిస్తుంది. మనసుకు విశ్రాంతిని ఈశునది. ఈ మంత్రం గరిష్ట ప్రయోజనాలు పొందటానికి ఓం శాంతి శాంతి శాంతిహి అని జపించండి. అప్పుడు మీ చుట్టూ ఎంత ప్రశాంతంగా ఉందో మీకే తెలుస్తుంది.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

తదుపరి వ్యాసం