తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Bhogi Pandlu: పిల్లలకు భోగి పండ్లు పొసే పద్దతి తెలుసా? రేగి పండ్లను తలపై ఎందుకు పోస్తారు? ఏంటీ ఈ పండ్లకు ఇంత కథ ఉందా?

Bhogi Pandlu: పిల్లలకు భోగి పండ్లు పొసే పద్దతి తెలుసా? రేగి పండ్లను తలపై ఎందుకు పోస్తారు? ఏంటీ ఈ పండ్లకు ఇంత కథ ఉందా?

Peddinti Sravya HT Telugu

11 January 2025, 9:00 IST

google News
    • Bhogi Pandlu: భోగి నాడు సాయంత్రం పేరంటం పెట్టి, పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. రేగి పళ్ళు కాస్త భోగి పండ్లుగా మారాయి. సాయంత్రం చుట్టుపక్కల ఉన్న పెద్ద వాళ్ళందరిని పిలిచి పిల్లలకు రేగుపండ్లతో దిష్టి తీస్తారు. రేగిపండ్లలో కొన్ని పువ్వు రేకులు, చిల్లర డబ్బులు, చెరుకు ముక్కలు కూడా కలుపుతారు. 
Bhogi Pandlu: పిల్లలకు భోగి పండ్లు పొసే పద్దతి తెలుసా? రేగి పండ్లను తలపై ఎందుకు పోస్తారు?
Bhogi Pandlu: పిల్లలకు భోగి పండ్లు పొసే పద్దతి తెలుసా? రేగి పండ్లను తలపై ఎందుకు పోస్తారు? (pinterest)

Bhogi Pandlu: పిల్లలకు భోగి పండ్లు పొసే పద్దతి తెలుసా? రేగి పండ్లను తలపై ఎందుకు పోస్తారు?

భోగి రోజు సాయంత్రం చిన్న పిల్లలకు భోగి పండ్లు పోస్తారు. ఐదేళ్లు దాటని పిల్లలందరికీ కూడా భోగి పండ్లు పోసే సంప్రదాయం ఉంది. తెలుగు వాళ్ళ జీవితాల్లో సంక్రాంతికి ఉన్న ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఇంతా అంతా కాదు. సంక్రాంతి పండుగ అంటే మనకి ఎన్నో ఉంటాయి.

లేటెస్ట్ ఫోటోలు

ఈ మూడు రాశుల వారికి మరో వారం చాలా అదృష్టం.. ఆర్థిక ప్రయోజనాలు, సంతోషం దక్కుతాయి!

Feb 08, 2025, 12:31 PM

Parivartana Yogam: పరివర్తన రాజయోగంతో 3 రాశుల వారికి అదృష్టం.. ఇక అన్నీ విజయాలే, తిరుగేలేదు

Feb 07, 2025, 09:39 AM

ఈ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం! ఇక అన్ని కష్టాలు దూరం, జీవితంలో సంతోషం..

Feb 07, 2025, 05:58 AM

7 February Horoscope: ఈ శుక్రవారం మీకు శుభాలను తెస్తుందా? ఫిబ్రవరి 7 రాశి ఫలాలు

Feb 06, 2025, 09:01 PM

Mercury Effects: మకర రాశిలోకి బుధుడు .. 4 రాశులకు ఇబ్బందులు.. జాగ్రత్తగా ఉండాలి

Feb 06, 2025, 10:26 AM

5th February Horoscope: మీ రాశి గ్రహబలం రేపు ఎలా ఉండబోతోంది?.. ఫిబ్రవరి 5 రాశి ఫలాలు

Feb 04, 2025, 09:59 PM

గాలిపటాలు ఎగరవేయడం, పిండివంటలు చేసుకోవడం, భోగి పండ్లు పోయడం, గంగిరెద్దులు, హరిదాసులు ఇలా చెప్పుకుపోతే చాలానే ఉన్నాయి. అలాగే సంక్రాంతి నాడు కుటుంబమంతా కలిసి సరదాగా సమయాన్ని గడుపుతారు. సంతోషంగా ఇంట్లో పిండి వంటలతో, విందు భోజనాలతో గడుపుతారు.

పిల్లలకు భోగి పండ్లు

భోగి నాడు సాయంత్రం పేరంటం పెట్టి, పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. రేగి పళ్ళు కాస్త భోగి పండ్లుగా మారాయి. సాయంత్రం చుట్టుపక్కల ఉన్న పెద్ద వాళ్ళందరిని పిలిచి పిల్లలకు రేగుపండ్లతో దిష్టి తీస్తారు. రేగిపండ్లలో కొన్ని పువ్వు రేకులు, చిల్లర డబ్బులు, చెరుకు ముక్కలు కూడా కలుపుతారు. మూడు సార్లు పిల్లలు చుట్టూ తిప్పి తర్వాత తలపై పోస్తారు.

భోగి పళ్ళు పోయడం వలన ఎలాంటి లాభాలు ఉంటాయి?

చిన్నపిల్లలకు భోగి పండ్లు పోస్తే చాలా మంచిదట. పిల్లలకు రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. జీర్ణవ్యవస్థ కూడా బలహీనంగా ఉంటాయి. రేగి పండ్లు మంచి ఔషధంగా పనిచేస్తాయి. వీటిలో పోషకాలు ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

అనారోగ్య సమస్యలు తొలగిస్తాయి. రేగిపండ్లలో, బంతి పువ్వు రేకులు కలిపి పిల్లలు చుట్టూ ఉంచితే క్రిములు అన్ని తొలగిపోతాయి. బంతిపూలకు క్రిములను చంపడం ప్రధాన లక్షణం. అవి చర్మానికి తగిలితే కూడా మంచిదట.

రేగి పండ్లు ప్రత్యేకం..

సాక్ష్యాత్తు నారాయణలు బదరీ వృక్షం దగ్గర ఆశ్రయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ పండ్లు తింటూ తపస్సు చేశారు. అందుకనే రేగు చెట్టుకి ప్రాధాన్యత ఎక్కువ. రేగుపండ్లను అర్కఫలం అంటారు. సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్ళినప్పుడు ఆయన కరుణ కటాక్షులు పిల్లలపై ఉండాలని.. ఆ ఉద్దేశంతో పిల్లలకి భోగి పండ్లు పోయడం జరుగుతుంది.

ఈ పండ్లను బదరీ ఫలం అని కూడా అంటారు. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి నారాయణలు ఈ బదరికా వనంలో తపస్సు చేశారట. ఆ సమయంలో దేవతలు వారి యొక్క శిరస్సుపై బదరీ ఫలాలను కురిపించారని, అందుకని ప్రత్యేకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లు పోసే సంప్రదాయం వచ్చింది.

భోగి పండ్లు పోసే పద్ధతి

భోగి పండ్లు పోసే పిల్లలకు తలస్నానం చేయించాలి. కొత్త వస్త్రాలు కట్టాలి. నుదుట తిలకం అద్దాలి. దేవతామూర్తులకు దండం పెట్టించి, తర్వాత పిల్లల్ని కుర్చీలో కూర్చోపెట్టి దీపం వెలిగించి హారతి ఇవ్వాలి.

ఒక మంగళ హారతి పాట పాడాలి. కృష్ణుడికి హారతి అద్ది, పిల్లలకు అద్దాలి. కృష్ణుడికి భోగి పండ్లు పోసి పిల్లలకి మూడుసార్లు కొంచెం కొంచెం పొయ్యాలి. చిల్లర, నానబెట్టిన సెనగలు, బంతిపూల రేకులు, రేగి పండ్లు కలిపి పోయాలి. సంక్రాంతి పండుగ నాడు పోసిన రేగిపండ్లను పండుగ పండ్లు అని అంటారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

తదుపరి వ్యాసం