తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Astrological Remedies: ఉద్యోగం, ప్రేమ, ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు తొలగిపోవాలంటే.. ఈ పరిహారాలను పాటించండి

Astrological Remedies: ఉద్యోగం, ప్రేమ, ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు తొలగిపోవాలంటే.. ఈ పరిహారాలను పాటించండి

Peddinti Sravya HT Telugu

Published Jan 11, 2025 05:30 PM IST

google News
    • Astrological Remedies: జ్యోతిష్య పరిహారాలని అనుసరించడం వలన ఇబ్బందుల నుంచి గట్టెక్కొచ్చు. చాలా మంది వారి కెరియర్, రిలేషన్షిప్ లేదా ఆరోగ్యం విషయంలో ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ పరిహారాలని అనుసరిస్తే సంతోషంగా ఉండొచ్చు.
Astrological Remedies: ఉద్యోగం, ప్రేమ, ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు తొలగిపోవాలంటే (pinterest)

Astrological Remedies: ఉద్యోగం, ప్రేమ, ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు తొలగిపోవాలంటే

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనం కేవలం భవిష్యత్తును మాత్రమే కాదు. మన జీవితంలో ఏ సమస్యకు అయినా కూడా పరిష్కారాన్ని పొందవచ్చు. కొన్ని సమస్యలకి పరిష్కారం మనకి సులువుగా దొరుకుతుంది.


లేటెస్ట్ ఫోటోలు

కుజ కేతువుల సంయోగం, జూలై 28లోగా ఈ నాలుగు రాశులకు శుభ ఫలితాలు.. ధన లాభం, ప్రమోషన్లు ఇలా ఎన్నో!

Jun 18, 2025, 07:31 AM

ఈ 3 రాశుల వారికి కనీవినీ ఎరుగని రీతిలో ధన లాభం- కుటుంబంలో సంతోషం, వృత్తిలో సక్సెస్​!

Jun 17, 2025, 05:59 AM

బాబా వంగా జోస్యం.. ఒకదాని తర్వాత మరో ప్రమాదం.. 2025లో ఇంకా ఏం జరగనుందో చెప్పిన బాబా వంగా!

Jun 16, 2025, 02:31 PM

శని తిరోగమనంతో మూడు రాశులకు కనీవినీ ఎరుగని రీతిలో లాభాలు.. ధనం, పదోన్నతి, శుభవార్తలతో పాటు ఎన్నో!

Jun 16, 2025, 08:56 AM

లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన 3 రాశులు ఇవి- ఇక జీవితంలో ధన లాభం, గౌరవం, కీర్తి, సంతోషం..

Jun 15, 2025, 05:33 AM

50 ఏళ్ల తర్వాత చతుర్గ్రాహి యోగం.. ఈ నాలుగు రాశుల వారికి లాటరీ తగినట్లే.. పెరగనున్న ఆస్తిపాస్తులు, సంపద!

Jun 14, 2025, 08:20 PM

వాటిని ఆచరించడం వలన ఆ సమస్యల నుంచి బయటపడడానికి అవుతుంది. ఈ ఆచరణాత్మక దశలు ప్రతికూల శక్తిని తొలగించడానికి మాత్రమే కాకుండా సమస్యల్ని పరిష్కరించడానికి కూడా ఉపయోగపడతాయి.

జ్యోతిష్య పరిహారాలని అనుసరించడం వలన ఇబ్బందుల నుంచి గట్టెక్కొచ్చు. చాలా మంది వారి కెరియర్, రిలేషన్షిప్ లేదా ఆరోగ్యం విషయంలో ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ పరిహారాలని అనుసరిస్తే సంతోషంగా ఉండొచ్చు.

కెరీర్, ఆర్థిక ఇబ్బందులు

పలువురు కెరియర్, ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు. దాని వలన ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక పరిస్థితులు సరిగ్గా ఉండవు. బృహస్పతి లేదా శని గ్రహం బలహీనంగా ఉండడం వలన ఈ సమస్యలు కలగచ్చు. శని మంత్రాన్ని జపిస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

1. ఓం శం శనిశ్చారాయ నమః అని జపిస్తే ఉద్యోగ సమస్యల నుంచి సులువుగా బయటపడొచ్చు. ఆర్థిక ఇబ్బందులు కూడా తీరుతాయి.

2. పక్షులకు బుధవారం నాడు ఆహారాన్ని అందించడం వలన బృహస్పతి బలపడుతుంది. సమస్యలు తగ్గుతాయి.

ప్రేమ, పెళ్లి జీవితంలో సమస్యలు

శుక్రుడు, చంద్రుడు రిలేషన్షిప్స్ ని చూస్తాయి. రిలేషన్ షిప్ కి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే ఈ పరిహారాలని పాటించండి. ఇలా చేయడం వలన ఈ ఇబ్బందులు నుంచి సులువుగా గట్టెక్కొచ్చు.

1. చంద్రుడు గురించి సోమవారం ఉపవాసం చేస్తే ప్రేమ జీవితం బాగుంటుంది. పెళ్లయిన వాళ్లు కూడా ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉండొచ్చు.

2. తెల్లని పూలను దేవుడికి సమర్పించడం లేదా ఇంట్లో పెట్టడం వలన శుక్రుడు బలపడతాడు. ఈ సమస్యలు తొలగిపోతాయి. ప్రేమ, పెళ్లి జీవితం బాగుంటుంది.

ఆరోగ్య సమస్యలు

సూర్యుడు, కుజుడు శారీరక శక్తి, రోగినిరోధక శక్తిని చూస్తాయి. సూర్య మంత్రాన్ని జపిస్తే ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలకి దూరంగా ఉండవచ్చు.

ఓం సూర్యాయ నమః అని రోజూ జపిస్తే అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు.

ఎర్రటి వస్త్రాలు లేదంటే ఎర్రటి పప్పులు మంగళవారం నాడు దానం ఇస్తే శుక్రుడు బలపడతాడు. అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.