Annapurna Jayanthi: రేపే అన్నపూర్ణ జయంతి, మీకు జీవితాంతం ఆహారానికి లోటు లేకుండా ఉండాలంటే వీటిని దానం చేయండి
14 December 2024, 8:07 IST
- Annapurna Jayanthi: అన్నపూర్ణ జయంతి నాడు అమ్మవారిని ఆరాధిస్తారో, వాళ్ళ ఇల్లు ఐశ్వర్యంతో నిండి ఉంటుంది. ఎప్పుడూ సంతోషంగా ఉండొచ్చు. ఎలాంటి బాధలు అయినా సరే తొలగిపోతాయి. తిండికి అసలు లోటు కూడా ఉండదు. పైగా ఈరోజు చేసే దానాలకి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది.
Annapurna Jayanthi: రేపే అన్నపూర్ణ జయంతి, మీకు జీవితాంతం ఆహారానికి లోటు లేకుండా ఉండాలంటే వీటిని దానం చేయండి
అన్నపూర్ణ జయంతి నాడు అన్నపూర్ణని ఆరాధించడం వలన దుఃఖాల నుంచి బయటపడవచ్చు. జీవితంలో వచ్చే కష్టాలకు దూరంగా ఉండవచ్చు. ఎవరైతే అన్నపూర్ణ జయంతి నాడు అమ్మవారిని ఆరాధిస్తారో, వాళ్ళ ఇల్లు ఐశ్వర్యంతో నిండి ఉంటుంది. ఎప్పుడూ సంతోషంగా ఉండొచ్చు. ఎలాంటి బాధలు అయినా సరే తొలగిపోతాయి. తిండికి అసలు లోటు కూడా ఉండదు. పైగా ఈరోజు చేసే దానాలకి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి అన్నపూర్ణ జయంతి నాడు పూజలు చేయడం, దానాలు చేయడం మంచిది.
లేటెస్ట్ ఫోటోలు
అన్నపూర్ణ జయంతి ఎప్పుడు వచ్చింది?
ఈసారి అన్నపూర్ణ జయంతి ఎప్పుడు అనే విషయానికి వస్తే, మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి నాడు అన్నపూర్ణ జయంతిని జరుపుకుంటాము. ఈసారి పౌర్ణమి డిసెంబర్ 14వ తేదీ సాయంత్రం 4:58 గంటలకు మొదలవుతుంది. డిసెంబర్ 15 మధ్యాహ్నం 2:31తో ముగుస్తుంది. కనుక డిసెంబర్ 15న అన్నపూర్ణ జయంతిని జరుపుకోవాలి.
అన్నపూర్ణ జయంతి నాడు ఏం చేయాలి?
ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకోవాలి. గంగాజలంతో పూజ గదిని శుద్ధి చేయాలి. తర్వాత ఉపవాసం ఉండాలనుకుంటే ఉపవాసం చేయొచ్చు.
పూజకు ముందు పూజ స్థలంలో అన్నపూర్ణ విగ్రహాన్ని పెట్టాలి. అమ్మవారికి యధావిధిగా పూజ చేయాలి.
అన్నపూర్ణ దేవి స్తోత్రాలు, మంత్రాలు పఠిస్తే మంచిది.
'ఓం అన్నపూర్ణాయ నమః' అని 108 సార్లు జపిస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది.
అన్నపూర్ణ జయంతి నాడు మంచి ఫలితాల కోసం ఇలా చేయండి:
అన్నపూర్ణ జయంతి నాడు నూనె, గోధుమలు, బియ్యం, పప్పులు, డాబులను ఎవరికైనా దానం చేస్తే వారి ఇంట సిరులు కురుస్తాయి. ఆహారానికి లోటు ఉండదు. ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా గట్టెక్కొచ్చు. అన్నపూర్ణ జయంతి నాడు దానం చేసేటప్పుడు ఉప్పును మాత్రం ఇవ్వద్దు.
అన్నపూర్ణ జయంతి నాడు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా వంట గదిని శుభ్రంగా ఉంచుకోవాలి. అన్నపూర్ణయన పార్వతిని, పార్వతి పతి అయిన పరమేశ్వరుడిని ఆరాధిస్తే కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా ఈ విధంగా అన్నపూర్ణ జయంతిని జరుపుకుంటే సకల సౌభాగ్యాలు కలిగి, సంతోషంగా ఉండొచ్చు.
అన్నపూర్ణా స్తోత్రం కూడా చదువుకోవచ్చు
నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ
నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ
ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
నానా రత్న విచిత్ర భూషణకరి హేమాంబరాడంబరీ
ముక్తాహార విలంబమాన విలసత్-వక్షోజ కుంభాంతరీ
కాశ్మీరాగరు వాసితా రుచికరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక్య నిష్ఠాకరీ
చంద్రార్కానల భాసమాన లహరీ త్రైలోక్య రక్షాకరీ
సర్వైశ్వర్యకరీ తపః ఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
కైలాసాచల కందరాలయకరీ గౌరీ-హ్యుమాశాంకరీ
కౌమారీ నిగమార్థ-గోచరకరీ-హ్యోంకార-బీజాక్షరీ
మోక్షద్వార-కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
దృశ్యాదృశ్య-విభూతి-వాహనకరీ బ్రహ్మాండ-భాండోదరీ
లీలా-నాటక-సూత్ర-ఖేలనకరీ విజ్ఞాన-దీపాంకురీ
శ్రీవిశ్వేశమనః-ప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
ఉర్వీసర్వజయేశ్వరీ భగవతీ మాతా కృపాసాగరీ
వేణీ-నీలసమాన-కుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ
సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
ఆదిక్షాంత-సమస్తవర్ణనకరీ శంభోస్త్రిభావాకరీ
కాశ్మీరా త్రిపురేశ్వరీ త్రినయని విశ్వేశ్వరీ శర్వరీ
స్వర్గద్వార-కపాట-పాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
దేవీ సర్వవిచిత్ర-రత్నరుచితా దాక్షాయిణీ సుందరీ
వామా-స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ
భక్తాభీష్టకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
చంద్రార్కానల-కోటికోటి-సదృశీ చంద్రాంశు - బింబాధరీ
చంద్రార్కాగ్ని-సమాన-కుండల-ధరీ చంద్రార్క - వర్ణేశ్వరీ
మాలా-పుస్తక-పాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
క్షత్రత్రాణకరీ మహాభయకరీ మాతా కృపాసాగరీ
సర్వానందకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
అన్నపూర్ణే సదాపూర్ణే శంకర-ప్రాణవల్లభే
జ్ఞాన-వైరాగ్య-సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ
మాతా చ పార్వతీదేవీ పితాదేవో మహేశ్వరః
బాంధవా: శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం
సర్వ-మంగళ-మాంగళ్యే శివే సర్వార్థ-సాధికే
శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తు తే