తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Tourism : రా.. రమ్మని పిలుస్తున్న గోదారి అందాలు.. ఎంజాయ్‌మెంట్‌కు ఇదే సరైన సమయం

AP Tourism : రా.. రమ్మని పిలుస్తున్న గోదారి అందాలు.. ఎంజాయ్‌మెంట్‌కు ఇదే సరైన సమయం

27 October 2024, 12:58 IST

AP Tourism : ప్రకృతి అందాలకు పెట్టింది పేరు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా. గోదారి అందాలు పర్యాటకులకు ఆహ్లాదం, ఆనందాన్ని పంచుతాయి. ముఖ్యంగా ఈ సీజన్‌లో పర్యాటక ప్రాంతాలు టూరిస్టులను ఆకర్షిస్తున్నాయి. మారేడుమిల్లి మొదలు.. కాకినాడ బీచ్ వరకు ఎన్నో అందాలను ఈ సీజన్‌లో ఆస్వాదించవచ్చు.

  • AP Tourism : ప్రకృతి అందాలకు పెట్టింది పేరు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా. గోదారి అందాలు పర్యాటకులకు ఆహ్లాదం, ఆనందాన్ని పంచుతాయి. ముఖ్యంగా ఈ సీజన్‌లో పర్యాటక ప్రాంతాలు టూరిస్టులను ఆకర్షిస్తున్నాయి. మారేడుమిల్లి మొదలు.. కాకినాడ బీచ్ వరకు ఎన్నో అందాలను ఈ సీజన్‌లో ఆస్వాదించవచ్చు.
యానాంలో రాజీవ్‌ రివర్‌ బీచ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఏనుగులు అభిషేకం చేసున్న శివ లింగం, భారతమాత విగ్రహం, బ్రెజిల్‌ యేసు విగ్రహం నమూనాలో ఉన్న మౌంట్‌ ఆఫ్‌ మెర్సీలకు పర్యాటకులు ఎక్కువగా వస్తారు. గరియాలతిప్ప వద్ద మడ అడవుల్లో 1.50 కి.మీ పొడవున చెక్కల నడక దారి.. బోటు షికారు ఆనందాన్ని పంచుతోంది. 
(1 / 5)

గోదావరి నది ఒడ్డునే ఉన్న డిండి రిసార్ట్స్ మంచి టూరిస్ట్ స్పాట్. ఇక్కడ వశిష్ఠ గోదావరి నదీలో బోటు షికారు చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. నది పక్కనే విశ్రాంతి గదుల్లో సేదతీరవచ్చు. ఏపీ టూరిజం రిసార్ట్స్, ప్రైవేటు రిసార్ట్సులో చాలా గదులు అందుబాటులో ఉన్నాయి. 
(2 / 5)

రాజమండ్రిలోని గోదావరి తీరానికి దక్షిణకాశీగా పేరుంది. పుష్కర, కోటిలింగాల, సరస్వతీ రేవులు ఆహ్లాదాన్ని పంచుతాయి. పుష్కర ఘాట్‌కు, సరస్వతీ ఆలయం రేవుకు మధ్యలో బోటు షికారు ఇచ్చే అనుభూతి మరెక్కడా దొరకదు. ధవళేశ్వరం బ్యారేజి, మ్యూజియం ఆకట్టుకుంటాయి.
(3 / 5)

మారేడుమిల్లి ఏరియాలో పర్యాటకులను ఆకర్షించే ప్రాంతాలు చాలా ఉన్నాయి. వనవిహారి, జంగిల్‌ స్టార్‌ విడిది కేంద్రాల్లో సేదతీరి ఇక్కడి పర్యాటక ప్రాంతాలు సందర్శిస్తారు. మారేడుమిల్లి నుంచి చింతూరు వెళ్లే మార్గంలో జలతరంగిణి, అమృతధార వాటర్‌ఫాల్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక్కడ కొండను తాకే మేఘాలు, ప్రకృతి అందాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి.
(4 / 5)

ఇక కాకినాడ తీరానికి ్నేక ప్రాంతాల నుంచి టూరిస్టులు వస్తారు. శిల్పారామం, ఎన్టీఆర్‌ బీచ్, యుద్ధ విమాన ప్రదర్శన శాల, కుడా పార్క్ ప్రాంతాలకు.. కాకినాడ నుంచి ఆటోలు, ప్రైవేటు వాహనాల్లో చేరుకోవచ్చు. ఉప్పాడ తీరం, జాంధానీ ఉప్పాడ పట్టు చీరలూ మగువలను మంత్రముగ్దులను చేస్తాయి.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి