తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tg Govt Megha Pact : తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ బాధ్యతలు మేఘా చేతికి, రూ.200 కోట్లు సీఎస్ఆర్ నిధులు కేటాయింపు

TG Govt Megha Pact : తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ బాధ్యతలు మేఘా చేతికి, రూ.200 కోట్లు సీఎస్ఆర్ నిధులు కేటాయింపు

26 October 2024, 19:51 IST

TG Govt Megha Pact : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ భవన నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వానికి మేఘా ఇంజినీరింగ్ కంపెనీకి మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణానికి మేఘా కంపెనీ సీఎస్ఆర్ నిధుల నుంచి రూ. 200 కోట్లు కేటాయించింది.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ భవన నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వానికి  మేఘా ఇంజినీరింగ్ కంపెనీకి మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
(1 / 6)

రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వీఎల్వీఎస్ఎస్ సుబ్బారావు సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ మేఘా కంపెనీ ప్రతినిధులు ఎంవోయూపై సంతకాలు చేశారు.
(2 / 6)

అంతకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేఘా ఎండీ కృష్ణారెడ్డి నేతృత్వంలో ఆ కంపెనీ ప్రతినిధుల బృందం ఈ ఒప్పందంపై చర్చించారు. స్కిల్స్ వర్సిటీలో అధునాతన మౌలిక సదుపాయాలతో కూడిన యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణానికి మేఘా కంపెనీ తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ నిధుల నుంచి రూ. 200 కోట్లు కేటాయించింది.
(3 / 6)

స్కిల్ వర్సిటీ క్యాంపస్‌లో అకడమిక్ బిల్డింగ్, వర్క్ షాపులు, తరగతి గదులతో పాటు హాస్టల్ బిల్డింగ్స్ నిర్మిస్తామని మేఘా ఎండీ పీవీ కృష్ణారెడ్డి తెలిపారు. సీఎస్ఆర్ నిధులతో ఈ క్యాంపస్ నిర్మాణానికి ముందుకు వచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డి మేఘా కంపెనీకి  అభినందనలు తెలిపారు. ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారు.
(4 / 6)

హైదరాబాద్ శివారు కందుకూరు మండలంలో మీర్‌ఖాన్‌పేట సమీపంలో 57 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి ఆగస్టులో సీఎం భూమి పూజ చేశారు. 
(5 / 6)

ఇప్పటికే ఆర్కిటెక్ట్ నిపుణులతో తయారుచేయించిన యూనివర్సిటీ భవన నిర్మాణ నమూనాలను, డిజైన్లను ఈ సమావేశంలో ప్రదర్శించారు. వారం రోజుల్లోగా భవన డిజైన్లకు తుది రూపు ఇవ్వాలని సీఎం సూచించారు. డిజైన్లకు తుది రూపం ఇచ్చి నవంబర్ 8న యూనివర్సిటీ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి