తెలుగు న్యూస్  /  ఫోటో  /  Telangana Weather News : ఐఎండీ రెయిన్ అలర్ట్ - తెలంగాణలో మళ్లీ వర్షాలు..! ఎప్పట్నుంచంటే...

Telangana Weather News : ఐఎండీ రెయిన్ అలర్ట్ - తెలంగాణలో మళ్లీ వర్షాలు..! ఎప్పట్నుంచంటే...

23 November 2024, 12:45 IST

Telangana Weather Updates : తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. నవంబర్ 29వ తేదీ నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం అయితే రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని వివరించింది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…..

  • Telangana Weather Updates : తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. నవంబర్ 29వ తేదీ నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం అయితే రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని వివరించింది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…..
తెలంగాణలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చింది.
(1 / 6)
తెలంగాణలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చింది.(image source unsplash.com)
తెలంగాణలో నవంబర్ 29వ తేదీ నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ్టి నుంచి నవంబర్ 28వ తేదీ వరకు కూడా పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుంది.
(2 / 6)
తెలంగాణలో నవంబర్ 29వ తేదీ నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ్టి నుంచి నవంబర్ 28వ తేదీ వరకు కూడా పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుంది.
నవంబర్ 28వ తేదీ వరకు ఎలాంటి వర్ష సూచన లేదని, ఎలాంటి హెచ్చరికలు కూడా లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. మరోవైపు తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఇవాళ ఉదయం మెదక్ లో 11. 4 సెల్సియస్‌ డిగ్రీలు నమోదయ్యాయి.
(3 / 6)
నవంబర్ 28వ తేదీ వరకు ఎలాంటి వర్ష సూచన లేదని, ఎలాంటి హెచ్చరికలు కూడా లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. మరోవైపు తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఇవాళ ఉదయం మెదక్ లో 11. 4 సెల్సియస్‌ డిగ్రీలు నమోదయ్యాయి.(image source unsplash.com)
మరోవైపు  దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం భూమధ్యరేఖ హిందూ మహా సముద్రం వరకు విస్తరించి ఉంది. ఈ ప్రభావంతో ఇవాళ(నవంబర్ 23)బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఇది తర్వాత వాయవ్య దిశగా కదులుతూ తదుపరి రెండు రోజుల్లో దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది.
(4 / 6)
మరోవైపు  దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం భూమధ్యరేఖ హిందూ మహా సముద్రం వరకు విస్తరించి ఉంది. ఈ ప్రభావంతో ఇవాళ(నవంబర్ 23)బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఇది తర్వాత వాయవ్య దిశగా కదులుతూ తదుపరి రెండు రోజుల్లో దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది.(image source pixabay)
అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో  నవంబర్ 25, 26 తేదీల్లో దక్షిణ కోస్తా, సీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పలు చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడుతాయని పేర్కొంది.
(5 / 6)
అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో  నవంబర్ 25, 26 తేదీల్లో దక్షిణ కోస్తా, సీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పలు చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడుతాయని పేర్కొంది.(image source pixabay)
రైతులు పంట పొలాల్లో నిలిచిన అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు సూచిస్తున్నారు. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలని, ఉద్యానవన పంట మొక్కలు/చెట్లు పడిపోకుండా సపోర్టు అందించాలి.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
(6 / 6)
రైతులు పంట పొలాల్లో నిలిచిన అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు సూచిస్తున్నారు. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలని, ఉద్యానవన పంట మొక్కలు/చెట్లు పడిపోకుండా సపోర్టు అందించాలి.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.(image source pixabay)

    ఆర్టికల్ షేర్ చేయండి