తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tg Weather Report : ఐఎండీ అలర్ట్ - తెలంగాణలో మళ్లీ వర్షాలు..! ఎప్పట్నుంచంటే..?

TG Weather Report : ఐఎండీ అలర్ట్ - తెలంగాణలో మళ్లీ వర్షాలు..! ఎప్పట్నుంచంటే..?

08 November 2024, 18:03 IST

IMD Telangana Weather Report : తెలంగాణకు వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. నవంబర్ 11వ తేదీ వరకు రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని తెలిపింది. అయితే 12వ తేదీ నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజా బులెటిన్ లో పేర్కొంది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…

  • IMD Telangana Weather Report : తెలంగాణకు వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. నవంబర్ 11వ తేదీ వరకు రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని తెలిపింది. అయితే 12వ తేదీ నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజా బులెటిన్ లో పేర్కొంది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…
నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరో 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(1 / 8)
నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరో 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణలో చూస్తే ప్రస్తుతం పొడి వాతావరణమే ఉంది. కొద్దిరోజులుగా చలి తీవ్రత కూడా బాగా పెరిగింది. ఉదయం వేళల్లో పొగ మంచు కురుస్తోంది.
(2 / 8)
తెలంగాణలో చూస్తే ప్రస్తుతం పొడి వాతావరణమే ఉంది. కొద్దిరోజులుగా చలి తీవ్రత కూడా బాగా పెరిగింది. ఉదయం వేళల్లో పొగ మంచు కురుస్తోంది.(image source unsplash.com )
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. నవంబర్ 11వ తేదీ వరకు కూడా తెలంగాణలో పొడి వాతారవణమే ఉంటుందని అంచనా వేసింది.ఎలాంటి వర్ష సూచన లేదని తెలిపింది.
(3 / 8)
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. నవంబర్ 11వ తేదీ వరకు కూడా తెలంగాణలో పొడి వాతారవణమే ఉంటుందని అంచనా వేసింది.ఎలాంటి వర్ష సూచన లేదని తెలిపింది.(image source unsplash.com )
నవంబర్ 12వ తేదీ నుంచి తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది.
(4 / 8)
నవంబర్ 12వ తేదీ నుంచి తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది.
నవంబర్ 15వ తేదీ వరకు తేలికపాటి వర్షాలు పడుతాయని.. కొన్నిచోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడొచ్చని అంచనా వేసింది. 
(5 / 8)
నవంబర్ 15వ తేదీ వరకు తేలికపాటి వర్షాలు పడుతాయని.. కొన్నిచోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడొచ్చని అంచనా వేసింది. (image source unsplash.com )
మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే ఈ ఏడాది చలి తీవ్రత తక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాత్రి ఉష్ణోగ్రతల్లో క్రమంగా పెరుగుదల నమోదు కానుంది.
(6 / 8)

మరోవైపు శని, ఆదివారాల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండి అంచనా వేసింది. ఆంధ్రప్రదే‌శ్, యానాం దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తా, యానాంలలో గురు, శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురుస్తాయని వెల్లడించింది.
(7 / 8)

విశాఖ జిల్లా పాడేరు మన్యంలో చలి వణికిస్తోంది. శీతాకాలం కావడంతో ఉష్ణోగ్రతలు దిగజారుతున్నాయి. గురువారం పాడేరులో కనిష్ఠ 16, గరిష్ఠ 27 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 
(8 / 8)
విశాఖ జిల్లా పాడేరు మన్యంలో చలి వణికిస్తోంది. శీతాకాలం కావడంతో ఉష్ణోగ్రతలు దిగజారుతున్నాయి. గురువారం పాడేరులో కనిష్ఠ 16, గరిష్ఠ 27 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

    ఆర్టికల్ షేర్ చేయండి