తెలుగు న్యూస్  /  ఫోటో  /  Telangana Tourism : సోమశిల టు శ్రీశైలం - కృష్ణమ్మ అలలపై లాంచీ ప్రయాణం, రూ. 2 వేలకే టూర్ ప్యాకేజీ

Telangana Tourism : సోమశిల టు శ్రీశైలం - కృష్ణమ్మ అలలపై లాంచీ ప్రయాణం, రూ. 2 వేలకే టూర్ ప్యాకేజీ

03 November 2024, 11:07 IST

TG Tourism Somasila to Srisailm Boating : సోమశిల నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణం షురూ అయింది. శనివారం రోజు ఉదయం 80 మంది ప్రయాణికులతో తొలి బోటు బయల్దేరింది. ప్రతి శనివారం ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుందని టూరిజం అధికారులు తెలిపారు. ధరలతో పాటు షెడ్యూల్ వివరాలు ఇక్కడ చూడండి… 

  • TG Tourism Somasila to Srisailm Boating : సోమశిల నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణం షురూ అయింది. శనివారం రోజు ఉదయం 80 మంది ప్రయాణికులతో తొలి బోటు బయల్దేరింది. ప్రతి శనివారం ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుందని టూరిజం అధికారులు తెలిపారు. ధరలతో పాటు షెడ్యూల్ వివరాలు ఇక్కడ చూడండి… 
పర్యాటకులకు తెలంగాణ టూరిజం శాఖ శుభవార్త చెప్పింది. సోమశిల - శ్రీశైలం మధ్య లాంచీ ప్రయాణం ప్రారంభమైంది.  కృష్ణమ్మ  ఒడిలో, న‌‌‌‌‌‌‌‌ల్లమ‌‌‌‌‌‌‌‌ల ప‌‌‌‌‌‌‌‌చ్చద‌‌‌‌‌‌‌‌నం అందాలను వీక్షిస్తూ కృష్ణా అలలపై జర్నీ కొనసాగుతోంది.
(1 / 7)

శనివారం(నవంబర్ 2) రోజు ఉదయం 80 మంది ప్రయాణికులతో సోమశిల నుంచి తొలి బోటు బయల్దేరింది.  సాయంత్రం 5:00 గంటలకు శ్రీశైలానికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. 
(2 / 7)

 కొల్లాపూర్ మండలం సోమశిల నుంచి  శ్రీశైలం వెళ్తారు. కృష్ణా నదిలో సాగే జర్నీ… మాటల్లో వర్ణించలేం. ఈ టూర్ ప్యాకేజీ ప్రతి శనివారం అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఆన్ లైన్ ద్వారా టికెట్లు బుకింగ్ చేసుకోవాలని సూచించారు.
(3 / 7)

లాంచీలో  పర్యాటకులకు ఉదయం మరియు సాయంత్రం టీ, స్నాక్స్ మరియు లంచ్ అందిస్తారు. 
(4 / 7)

వన్ వే క్రూయిజ్  టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే పెద్దలకు రూ. 2000గా ఉంది. పిల్లలకు రూ. 1600గా ఉంది. రౌండప్ (రానుపోను) జర్నీలో పెద్దల‌‌‌‌‌‌‌‌కు  రూ.3,000, పిల్లలకు రూ.2,400గా నిర్ణయించారు. 
(5 / 7)

సోమశిల - శ్రీశైలం టూర్ ప్యాకేజీని బుకింగ్ చేసుకునేందుకు  https://tourism.telangana.gov.in/  వెబ్ సైట్ ను సందర్శించాలి. లేదా 9848540371 లేదా 9848306435 నెంబర్లను సంప్రదించాలి. marketing@tgtdc.in కు మెయిల్ కూడా చేయవచ్చు. 
(6 / 7)

మరోవైపు నాగార్జున సాగర్ - శ్రీశైలం మధ్య కూడా లాంచీ ప్రయాణం మొదలైంది. ఇక్కడ కూడా వన్ వే క్రూయిజ్  టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే పెద్దలకు రూ. 2000గా ఉంది. పిల్లలకు రూ. 1600గా ఉంది. రౌండ్ క్రూయిజ్ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే రూ. పెద్దలకు రూ. 3వేలుగా నిర్ణయించారు. పిల్లలకు రూ. 2400గా ఉంది.
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి